మనిషి బూడిదకు రూ.400 కోట్లు.. చితాభస్మంలో విలువైన లోహాలు!

మనిషి బూడిదతో జపాన్ ప్రభుత్వం రూ.400 కోట్లు సంపాదించింది. చితాభస్మంలో డెంటల్‌ ఫిల్లింగ్స్‌, బోన్‌ ఇంప్లాంట్స్‌కు వాడిన పల్లాడియం, టైటానియం వంటి విలువైన లోహాలు ఉన్నట్లు జపాన్ శాస్త్రవేత్తలు గుర్తించారు. దీంతో జపాన్ శ్మశాన వాటికలను అభివృద్ధి చేస్తోంది.

author-image
By Kusuma
New Update
DRDRER

Ashes: మనిషి చనిపోతే సాధారణంగా డెబ్ బాడీని కాల్చి, ఆ బూడిదను ఏదైనా పవిత్ర జలంలో కలిపేస్తాం. కానీ ఆ బూడిద కోట్ల రూపాయలు విలువ చేస్తుందనే విషయం చాలామందికి తెలియదు. అవును మీరు చదువుతున్నది నిజమే. జపాన్ లో చితాభస్మాన్ని అమ్మకానికి పెడుతూ కోట్లు సంపాదిస్తున్నారు. శ్మశాన వాటికల్లో బూడిదను కలెక్ట్ చేసి స్వయంగా జపాన్ ప్రభుత్వమే బిజినెస్ చేయడం విశేషం. కాగా ఇందుకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.

ఇది కూడా చదవండి: Golf City: హైదరాబాద్‌కు త్వరలో 200 ఎకరాల్లో గోల్ఫ్ సిటీ..

బూడిద నుంచి లోహాలు..

ఈ మేరకు జపాన్‌లోని పబ్లిక్‌ శ్మశాన వాటికల్లో బూడిదను నీళ్లలో కలిపేవారు. కానీ ఇటీవల ఆ బూడిదలో డెంటల్‌ ఫిల్లింగ్స్‌, బోన్‌ ఇంప్లాంట్స్‌కు వాడిన పల్లాడియం, టైటానియం వంటి విలువైన లోహాలు ఉంటాయని జపాన్ శాస్త్రవేత్తలు గుర్తించారు. దీంతో జపాన్ ప్రభుత్వం గత ఐదేళ్లలో చనిపోయిన 15 లక్షల మంది బూడిద నుంచి లోహాలు సేకరించింది. అనంతరం వాటిని పరిశీలించి అమ్మకానికి పెట్టగా.. రూ.400 కోట్లు సంపాదించింది. ఈ క్రమంలోనే దేశవ్యాప్తంగా శ్మశాన వాటికలను మరింత అభివృద్ధి చేయడంతోపాటు, ఇతర అవసరాలకు కూడా ఆ డబ్బును వినియోగిస్తోంది. 

ఇది కూడా చదవండి: Diwaliకి కొత్త రెవెన్యూ చట్టం.. ప్రభుత్వానికి చేరిన దస్త్రం

ఇది కూడా చదవండి: IND vs NZ: 36 ఏళ్ల తర్వాత భారత గడ్డపై.. 8 వికెట్ల తేడాతో కివీస్ విజయం

ఇది కూడా చదవండి: జైల్లో లారెన్స్ బిష్ణోయ్ ఖర్చులకు రూ.40 లక్షలు.. ఎవరు ఇస్తున్నారంటే?

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

Pak: ఉగ్రవాదులు స్వాతంత్ర సమరయోధులు..పాక్ ఉప ప్రధాని ప్రేలాపన

ఏం జరిగినా...ఎవరేం అన్నా తమ నోటిని మాత్రం కంట్రోల్ లో పెట్టుకోమంటున్నారు పాక్ నేతలు. ఒకవైపు యుద్ధం జరిగే పరిస్థితులు కనిపిస్తున్నాయి. దాన్ని మరింత ఎగదోస్తూ.. పహల్గామ్ దాడికి పాల్పడిన ఉగ్రవాదులు స్వాత్రంత్య సమరయోధులంటూ పాక్‌ ఉప ప్రధాని వ్యాఖ్యలు చేశారు.

New Update
pak

Pakistan Deputy Pm Ishaq

పాకిస్తాన్ సీమాంతర ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తోందని భారత్ మండిపడుతోంది. పహల్గామ్ దాడి దానికి సంబంధించినదే అని విరుచుకుపడింది. అయితే ఈ దాడితో తమకే సంబంధం లేదని పాక్ కప్పిపుచ్చుకోవడానికి ట్రై చేసింది. కానీ మరోవైపు నుంచి నోటికొచ్చినట్లు మాట్లాడ్డం మాత్రం ఆపడం లేదు. మొన్న పాక్ రక్షణ మంత్రి కాశ్మీర్ దాడి భారత్ తప్పేనంటూ మాట్లాడారు. ఈరోజు ఆ దేశ ఉప ప్రధాని ఇషాక్ దార్ సంచలన వ్యాఖ్యలు చేశారు. 

వాళ్ళు స్వాతంత్ర సమరయోధులు..

ఇస్లామాబాద్ లో మీడియాతో మాట్లాడిన ఇషాక్  కాశ్మీర్ లోని పహల్గామ్ లోదాడి చేసిన ఉగ్రవాదులు స్వాతంత్ర సమరయోధులై ఉంటారంటూ అనుచిత వ్యాఖ్యలు చేశారు. అలాగే సింధు జలాల ఒప్పందం రద్దు గురించి మాట్లాడుతూ ఈ ఏక పక్ష నిర్ణయాన్ని తాము ఎప్పటికీ అంగీకరించమని ఇషాక్ అన్నారు. భారత్ తీసుకున్న నిర్ణయానికి ప్రతిచర్య తప్పందటూ రెచ్చగొట్టే మాటలు మాట్లాడారు. 

అధికారికంగా లేఖ..

 మరోవైపు సింధు జలాల ఒప్పందం అమలు నిలిపివేస్తున్నట్లు ప్రకటించిన భారత్..ఆ విషయాన్ని అధికారికంగా పాకిస్తాన్ కు చెప్పారు. భారత నీటి వనరుల కార్యదర్శి దేబశ్రీ ముఖర్జీ పాక్‌ అధికారి సయీద్‌ అలీ ముర్తుజాకు లేఖ పంపారు. ఏ ఒప్పందాన్నైనా నిజాయతీగా గౌరవించడం అనేది ప్రాథమిక బాధ్యత. కానీ, జమ్మూ-కాశ్మీర్ ‌ను లక్ష్యంగా చేసుకొని పాకిస్థాన్‌ సీమాంతర ఉగ్రవాదాన్ని కొనసాగిస్తోంది. దీని వలన మా దేశం నష్టపోతోంది. అందుకే ఈ ఒప్పందాన్ని నిలిపివేస్తున్నమంటూ లేఖలో రాశారు. 

today-latest-news-in-telugu | pakistan | comments | terrorists | freedom-fighters

Also Read: Israel: పాక్ ను సర్వనాశనం చేద్దాం...రంగంలోకి ఇజ్రాయెల్

 

Advertisment
Advertisment
Advertisment