పాకిస్థాన్‌కు వెళ్లనున్న ఎస్. జైశంకర్.. ఎందుకో తెలుసా ? పాకిస్థాన్‌లోని అక్టోబర్ 15, 16వ తేదీల్లో షాంఘై కో ఆపరేషన్ ఆర్గనైజేషన్ (SCO) సమావేశం జరగనుంది. అయితే ఈ సమావేశానికి భారత విదేశాంగ మంత్రి ఎస్. జై శంకర్ వెళ్లనున్నారు. 2015 డిసెంబర్ తర్వాత భారత విదేశాంగ మంత్రి పాకిస్థాన్‌కు వెళ్లడం ఇదే తొలిసారి. By B Aravind 04 Oct 2024 in ఇంటర్నేషనల్ నేషనల్ New Update షేర్ చేయండి పాకిస్థాన్‌లోని ఇస్లామాబాద్‌లో అక్టోబర్ 15, 16వ తేదీల్లో షాంఘై కో ఆపరేషన్ ఆర్గనైజేషన్ (SCO) సమావేశం జరగనుంది. అయితే ఈ సమావేశానికి భారత విదేశాంగ మంత్రి ఎస్. జై శంకర్ వెళ్లనున్నారు. ఈ విషయాన్ని విదేశాంగ మంత్రిత్వశాఖ ధృవీకరించింది. గత ఏడాది ఈ సమావేశానికి మన దేశమే అతిథ్యమిచ్చిన సంగతి తెలిసిందే. గోవాలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. అప్పడు ఈ మీటింగ్‌కి అప్పటి పాకిస్థాన్ విదేశాంగ మంత్రి బిలావల్ బుట్టో కూడా హాజరయ్యారు. అయితే ఈ ఏడాది పాకిస్థాన్‌లో జరగనున్న ఈ సమావేశానికి భారత్ తరఫున వెళ్లాలా ? వద్దా ? అనేదానిపై గత కొన్నిరోజులుగా చర్చలు జరిగాయి. చివరికి కేంద్రమంత్రి జైశంకర్ ఈ మీటింగ్ వెళ్లనున్నారని.. విదేశాంగశాఖ స్పష్టం చేసింది. ఒక విదేశాంగశాఖ మంత్రిగా జైశంకర్ పాకిస్థాన్‌కు వెళ్లనుండటం ఇదే మొదటిసారి కావడం విశేషం. Also Read: మాలలకు షాక్.. రివ్యూ పిటిషన్స్ కొట్టివేసిన సుప్రీంకోర్టు షాంఘై కో ఆపరేషన్ ఆర్గనైజేషన్ (SCO)లో భారత్, చైనా, పాకిస్థాన్, రష్యా, కజకిస్తాన్, కిర్గిజిస్తాన్, తజికిస్థాన్, అలాగే ఉజ్బెకిస్థాన్ దేశాలు భాగస్వాములుగా ఉన్నాయి. ప్రతీఏడాది ఒక్కో దేశంలో ఈ సమావేశాలు జరగుతుంటాయి. రొటేషన్ పద్ధతిలో భాగంగా ఈసారి పాకిస్థాన్‌కు అతిథ్యం ఇచ్చే అవకాశం వచ్చింది. ఆగస్టులోనే ఎస్‌సీఓ మీటింగ్‌కు హాజరుకావాలని ప్రధాని మోదీకి పాకిస్థాన్ ఆహ్వానం పంపింది. దీనిపై నిర్ణయం తీసుకుంటామని అప్పట్లో జైశంకర్ ప్రకటించారు. కానీ ఎట్టకేలకు జైశంకరే ఈ ఎస్‌సీఓ శిఖరాగ్ర సమావేశానికి భారత ప్రతినిధి బృందం తరఫున నాయకత్వం వహిస్తారని విదేశాంగ శాఖ ప్రకటించింది. ఈ సమావేశానికి చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్ సైతం హాజరుకానున్నట్లు తెలుస్తోంది. #WATCH | MEA Spokesperson Randhir Jaiswal says, "EAM Jaishankar will lead a delegation to Pakistan for the SCO summit which will be held in Islamabad on 15th and 16th October..." pic.twitter.com/HP7cSzH6AI — ANI (@ANI) October 4, 2024 2015 డిసెంబర్ తర్వాత భారత విదేశాంగ మంత్రి పాకిస్థాన్‌కు వెళ్లడం ఇదే తొలిసారి. దివంగత మాజీ విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్ 2015లో ఆఫ్ఘనిస్తాన్‌కు సంబంధించి భద్రతా సదస్సులో పాల్గొనేందుకు ఆమె ఇస్లామాబాద్‌కు వెళ్లారు. ఇదిలాఉండగా.. ఎస్‌ఈఓ శిఖరాగ్ర సమావేశాలకు ముందుగా మంత్రివర్గ సమావేశం, అలాగే ఎస్‌సీఓ సభ్య దేశాల మధ్య ఆర్థిక, సామాజిక-సాంస్కృతిక, మానవతా సహకారంపై దృష్టి సారించే విధంగా పలు సీనియర్ అధికారుల సమావేశాలు జరుగనున్నాయి. 2001లో షాంఘైలో.. షాంఘై కో ఆపరేషన్ ఆర్గనైజేషన్‌ను.. చైనా, రష్యా, కజకిస్థాన్, తజికిస్థాన్, కిర్గిజ్ రిపబ్లిక్, ఉజ్బెకిస్థాన్ దేశాలు కలిసి ప్రారంభించాయి. 2017లో భారత్, పాకిస్థాన్ ఈ ఎస్‌సీఓలో శాశ్వత సభ్యత్వం పొందాయి. గత ఏడాది జులైలో భారత్‌లో నిర్వహించిన వర్చువల్ సమ్మీట్ ఆఫ్ గ్రూపింగ్‌లో ఇరాన్ కూడా ఈ ఎస్‌సీఓలో శాశ్వత సభ్యత్వం పొందింది. ఆర్థిక, భద్రతా కుటమిగా.. అతిపెద్ద ట్రాన్స్-రీజినల్ అంతర్జాతీయ సంస్థలలో ఒకటిగా ఎస్‌ఓ ప్రారంభమైంది. #pm-modi #india #pakisthan #jai-shankar మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి