Israel: విరుచుకుపడుతున్న ఇజ్రాయెల్.. లెబనాన్‌లో 105 మంది మృతి హైజ్‌బొల్లా ఉగ్రవాద స్థావరాలే టార్గెట్‌గా ఇజ్రాయెల్ వైమానిక దాడులు చేస్తోంది. అయితే ఈ దాడిలో 105 మంది మృతి చెందినట్లు లెబనాన్ ప్రభుత్వం తెలిపింది. మరో 359 మంది గాయాల పాలైనట్లు పేర్కొంది. హౌతీ తిరుగుబాటుదారులపై కూడా ఇజ్రాయెల్ వైమానిక దాడులు చేస్తోంది. By B Aravind 30 Sep 2024 in ఇంటర్నేషనల్ క్రైం New Update షేర్ చేయండి హెజ్‌బొల్లాపై ఇజ్రాయెల్ రోజురోజుకు విరుచుకుపడుతోంది. లెబనాన్ వైపు రాకెట్లు దూసుకెళ్తున్నాయి. హైజ్‌బొల్లా ఉగ్రవాద స్థావరాలే టార్గెట్‌గా ఇజ్రాయెల్ వైమానిక దాడులు చేస్తోంది. అయితే ఈ దాడిలో 105 మంది మృతి చెందినట్లు లెబనాన్ ప్రభుత్వం తెలిపింది. మరో 359 మంది గాయాల పాలైనట్లు పేర్కొంది. హైజ్‌బొల్లా అధినేత హసన్ నస్రల్లా హతమైన సంగతి తెలిసిందే. దీంతో ఇజ్రాయెల్ మరింత దూకుడు పెంచింది. ఆ సంస్థకు చెందిన సైనిక ఆయుధాలు, మౌలిక సదుపాయాలను ధ్వంసం చేస్తోంది. తూర్పు, దక్షిణ లెబనాన్, బీరుట్ ప్రాంతాల్లో జరిగిన దాడుల్లో భారీ సంఖ్యలో మృతి చెందారు.మృతుల్లో ఒకరు ఫ్రెంచ్ పౌరుడు కూడా ఉన్నట్లు లెబనాన్ ప్రభుత్వం వెల్లడించింది. Also Read: వరద బీభత్సం.. పెరుగుతున్న మృతుల సంఖ్ నబిల్ కౌక్ హతం మరోవైపు లెబనాన్ చేస్తున్న దాడులపై ఇజ్రాయెల్ కూడా స్పందించింది. హెజ్‌బొల్లా స్థావరాల పైనే దాడులు చేశామని పేర్కొంది. ఈ దాడిలో కీల నేత నబిల్ కౌక్ కూడా హతమైనట్లు పేర్కొంది. నబిల్ కౌక్ హెజ్‌బొల్లా సెంట్రల్ కౌన్సిల్ డిప్యూటీ హెడ్‌గా ఉన్నారు. ఇక మొత్తానికి హెజ్‌బొల్లాకు చెందిన 20 మందికి పైగా నేతలను మట్టుబెట్టామని ఇజ్రాయెల్ ప్రకటించింది. అలాగే హైతీ తిరుగుబాటుదారులపై కూడా ఇజ్రాయెల్ వైమానిక దాడులు చేస్తోంది. అక్కడ ఓ విద్యుత్ కేంద్రంపై బాంబుల వర్షం కురిపించింది. ఈ దాడుల్లో నలుగురు మృతి చెందగా.. 33 మంది గాయాలపాలయ్యారు. #telugu-news #israel #haiti #lebanon మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి