విరుచుకుపడ్డ ఇజ్రాయెల్.. ఇరాన్‌లో 20 భారీ ఇంధన మిశ్రమాలు ధ్వంసం

శనివారం తెల్లవారుజామున జరిగిన ఇజ్రాయెల్ వైమానిక దాడులు ఇరాన్ క్షిపణి స్థావరాలను తీవ్రంగా దెబ్బతీశాయి. దాదాపు 20 భారీ ఇంధన మిశ్రమాలు ధ్వంసమయ్యాయి. ఈ మిక్సర్లను తిరిగి మళ్లీ అమర్చాలంటే కనీసం ఏడాదిపైగా సమయం పడుతుందని తెలుస్తోంది.

New Update
Satellite

గతకొంతకాలంగా పశ్చిమాసియాలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న సంగతి తెలిసిందే. అయితే తాజాగా శనివారం తెల్లవారుజామున జరిగిన ఇజ్రాయెల్ వైమానిక దాడులు ఇరాన్ క్షిపణి స్థావరాలను తీవ్రంగా దెబ్బతీశాయి. ఇరాన్ క్షిపణుల్లో వినియోగించే ఘన ఇంధన మిశ్రమాన్ని తయారుచేసే ప్రదేశాలను ధ్వంసం చేశాయి. అయితే ఈ పరికరాలను ఇరాన్‌ సొంతంగా తయారుచేసుకోలేదు. వీటిని చైనా లేదా ఇతర దేశాల నుంచి దిగుమతి చేసుకొంటోంది. టెహ్రన్‌లోని అణుశక్తి కేంద్రానికి రక్షణగా ఉన్నటువంటి ఎస్‌-300 గగనతల రక్షణ వ్యవస్థను కూడా ఇజ్రాయెల్ ధ్వంసం చేసినట్లు తెలుస్తోంది. 

Also Read: రైల్వేస్టేషన్‌లో తొక్కిసలాట.. 9 మందికి తీవ్రంగా గాయాలు

20 భారీ ఇంధన మిశ్రమాలు ధ్వంసం

ఇక పర్చిన్ మిలిటరీ కాంప్లెక్స్‌లో డ్రోన్ల తయారీ యూనిట్‌ను కూడా ఇజ్రాయెల్ ధ్వంసం చేసింది. ముఖ్యంగా ఖెబర్, హజ్‌ ఖాసీం బాలిస్టిక్‌ మిసైల్స్‌లో వినియోగించే ఘన ఇంధనాన్ని తయారు చేసే కర్మాగారం పూర్తిగా ధ్వంసమైనట్లు సమాచారం. అయితే గతంలో ఇరాన్.. ఇదే క్షిపణులను ఇజ్రాయెల్‌పై దాడి చేసేందుకు వినియోగించింది. ఈ కర్మాగారాన్ని ఇరాన్ మిసైల్ ప్రొగ్రామ్‌కు వెన్నెముకగా భావిస్తారు. అయితే ఈ దాడి దెబ్బకు అది కూడా పనికిరాకుండా పోయింది. దాదాపు ఇక్కడ 20 భారీ ఇంధన మిశ్రమాలు ధ్వంసమయ్యాయి. వీటి ఒక్కోదాని ధర 2 మిలియన్ డాలర్ల వరకు ఉంటుందని తెలుస్తోంది. 

ఈ మిక్సర్లను తిరిగి మళ్లీ అమర్చాలంటే కనీసం ఏడాది వరకు సమయం పడుతుందని పలువురు నిపుణులు చెబుతున్నారు. ఇక ఉత్పత్తిని పాత స్థాయిలోకి తీసుకురావాలంటే రెండోళ్లు పట్టొచ్చని అంటున్నారు. ఇదిలాఉండగా.. పర్చిన్ సహా మరోచోట బాలిస్టిక్ మిసైల్ కాంప్లెక్సులు దెబ్బతిన్నట్లు శాటిలైట్ చిత్రాలు విశ్లేషించిన ఐక్యరాజ్య సమితి ఆయుధ ఇన్‌స్పెక్టర్ డేవిడ్ అల్బర్ట్, డెకర్ ఎవలెంత్ అనే సీఎన్‌ఏ పరిశోధకుడు పేర్కొన్నారు. పర్చిన్ మిలటరీ కాంప్లెక్స్‌లోనే మూడు భవనాలు దెబ్బతిన్నట్లు గుర్తించామని తెలిపారు. 

Also Read: ఇరాన్ మీద ఇజ్రాయెల్ దాడి..1981 నాటి ఆపరేషన్ ఒపేరాతో పోలిక

ఈ ఘన ఇంధనం మిక్స్‌ర్‌ను తయారీ, ఎగుమతి చేయడంపై కూడా ఆంక్షలున్నాయి. ఈ మిక్సర్ల కోసం ఇరాన్‌ భారీగా ఖర్చు చేసి దిగుమతి చేయించుకుంది. కానీ ఇప్పుడు ఇరాన్‌కు వెన్నుముక అయిన క్షిపణులు తయారు చేసే సామర్థ్యంపై దెబ్బపడిందని నిపుణులు చెబుతున్నారు. ఇదిలాఉండగా మరోవైపు ఇజ్రాయెల్ దళాలు ఉత్తర గాజాపై దాడులకు పాల్పడ్డాయి. ఈ దాడల్లో సుమారు 45 మంది మృతి చెందినట్లు తెలుస్తోంది. 

Advertisment
Advertisment
తాజా కథనాలు