/rtv/media/media_files/2024/11/17/7WQWs21K04ifvwSrf8qU.jpg)
ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు ఇంటిపై మరోసారి దాడి బాంబుల దాడి జరిగింది. ఉత్తర ఇజ్రాయెల్ సిజేరియా పట్టణంలో ఉన్న ప్రధాని బెంజమిన్ నెతన్యాహు ఇంటి గార్డెన్‌లో రెండు బాంబులను గుర్తించారు. అయితే ఈ దాడి సమయంలో ఇంట్లో నెతన్యాహు లేరు. గార్డెన్‌లో బాంబుల దాడి జరిగినప్పుడు అక్కడ ఎవరూ లేకపోవడంతో ఎలాంటి నష్టం జరగలేదు. ఈ దాడిని ఇజ్రాయెల్ భద్రతా మంత్రి ఖండించారు. ఇంట్లో బాంబు పెట్టి రెడ్ లైన్ క్రాస్ చేశారని, దీంతో తీవ్ర పరిణామాలు ఎదుర్కొంటారని హెచ్చరించారు. అయితే ఈ బాంబుల దాడి ఇరాన్ పన్నాగమేనని ఇజ్రాయెల్ అనుమానిస్తోంది.
ఇది కూడా చూడండి: చైనాలో దారుణం.. కత్తి దాడిలో 8 మంది మృతి
ההסתה נגד ראש הממשלה בנימין נתניהו חוצה כל גבול. זריקת פצצת התאורה הערב לביתו, היא חציית עוד קו אדום — היום זו פצצת תאורה, מחר זה ירי חי. ההסתה נגד נתניהו ומשפחתו, חייבת להיפסק. מצפה כי שב"כ והמשטרה יגיעו לחשודים שביצעו את המעשה במהרה.
— איתמר בן גביר (@itamarbengvir) November 16, 2024
ఇది కూడా చూడండి: ‘నెట్ స్పీడ్ పెరిగిందో మీ పని ఖతం.. బాడీలో ఆ పార్ట్‌కు ముప్పు’
🛑| BREAKING: A couple of hours ago, grenades/bombs were dropped at Netanyahu’s house, causing for a fire to break out.
— Arya - آریا (@AryJeay) November 17, 2024
The bomb exploded near one of the security guards. pic.twitter.com/rdZ2SjtL8M
ఇది కూడా చూడండి: ప్రెగ్నెంట్ చేస్తే లక్షల్లో డబ్బు అంటూ.. నిరుద్యోగ అబ్బాయిలే టార్గెట్
గతంలో కూడా ఒకసారి..
ఇదిలా ఉండగా గతంలో కూడా బెంజమిన్ నెతన్యాహు ఇంటిపై బాంబుల దాడి జరిగింది. ఇజ్రాయెల్ సిటీ సిజేరియాలో ఉన్న ఇంటిపై లెబనాన్ డ్రోన్ దాడి చేసింది. ఈ దాడిలో నెతన్యాహు ఇల్లు పూర్తిగా ధ్వంసం అయ్యింది. మూడు డ్రోన్లతో లెబనాన్ ఇజ్రాయెల్‌పై దాడి చేసింది. అందులో ఒకటి సెంట్రల్ ఇజ్రాయెల్ నగరమైన సిజేరియాలో నెతన్యాహు ఇంటిపై దాడి చేసింది. ఈ దాడిలో ఆ భవనం పూర్తిగా నేలమట్టం అయిపోయింది. అదృష్టవశాత్తు ఈ దాడిలో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదని కథనాలు తెలుపుతున్నాయి.
ఇది కూడా చూడండి: TG Group-3: నేడే గ్రూప్-3 పరీక్ష.. అభ్యర్థులకు నిపుణుల కీలక సూచన!