/rtv/media/media_files/2025/03/15/3PlBJkeCa16mNhvxq9RT.jpg)
ISIS Photograph: (ISIS)
ఉగ్రవాదాన్ని కట్టడి చేయడానికి అమెరికా సీక్రెట్ ఆపరేషన్‌ను చేపట్టింది. ఇందులో ఇస్లామిక్ స్టేట్ (ISIS) గ్లోబల్ ఆపరేషన్స్ చీఫ్ అబ్దుల్లా మక్కీ ముస్లిహ్ అల్ రిఫాయ్ అలియాస్ అబు ఖదీజాను అమెరికా హతం చేసింది. ఇరాకీ ఇంటెలిజెన్స్, భద్రతా దళాల సంయుక్త సహకారంతో అగ్రరాజ్యం ఇరాక్‌లో జరిపిన సీక్రెట్ ఆపరేషన్‌లో ఐసీసీ అగ్రనేతను హతమార్చింది. అమెరికా సెంట్రల్ కమాండ్ దీనికి సంబంధించిన వీడియోలను విడుదల చేసింది. మార్చి 13వ తేదీన ఈ సీక్రెట్ ఆపరేషన్ జరగ్గా.. తాజాగా ఈ వివరాలు బయటకు వచ్చాయి.
ఇది కూడా చూడండి: Punjab: స్వర్ణదేవాలయం దగ్గర గుర్తు తెలియని వ్యక్తి హల్ చల్..ఐదుగురికి గాయాలు
"Today the fugitive leader of ISIS in Iraq was killed. He was relentlessly hunted down by our intrepid warfighters. His miserable life was terminated, along with another member of ISIS, in coordination with the Iraqi Government and the Kurdish Regional Government. PEACE THROUGH… pic.twitter.com/gB68jMpd64
— President Donald J. Trump (@POTUS) March 15, 2025
గతంలో త్రుటిలో తప్పించుకోగా..
కారులో అబు ఖదీజా వెళ్తుండగా అమెరికా దళాలు క్షిపణి ప్రయోగించడంతో ఘటనాస్థలంలోనే అతను మరణించాడు. అయితే ఇతనితో పాటు మరో ఐసిస్ ఉగ్రవాది కూడా చనిపోయినట్లు యూఎస్ సెంట్రల్ తెలిపింది. అయితే వీరిద్దరి శరీరాలకు సూసైడ్ బాంబులతో పాటు కొన్ని ఆయుధాలు కూడా ఉన్నట్లు తెలుస్తోంది. గతంలో అబు ఖదీజా త్రుటిలో తప్పించుకోగా.. ఇప్పుడు హతం అయ్యాడు.
CENTCOM Forces Kill ISIS Chief of Global Operations Who Also Served as ISIS #2
— U.S. Central Command (@CENTCOM) March 15, 2025
On March 13, U.S. Central Command forces, in cooperation with Iraqi Intelligence and Security Forces, conducted a precision airstrike in Al Anbar Province, Iraq, that killed the Global ISIS #2 leader,… pic.twitter.com/rWeEoUY7Lw
ఇది కూడా చూడండి: Rohit Sharma Retirement: రోహిత్ తర్వాత కెప్టెన్ ఎవరు?.. లైన్లో ముగ్గురు స్టార్లు!
అప్పట్లో అబు ఖదీజా డీఎన్‌ఏ తీసుకున్నారు. దీని ఆధారంగా పరీక్షలు నిర్వహించి ఖదీజా మృతిని వెల్లడించారు. మొదటి ఈ వార్తను ఇరాక్ ప్రధాని ప్రకటించారు. దీనికి అమెరికా అధ్యక్షుడు ట్రంప్ స్పందిస్తూ.. ఇరాక్‌లో ఐసిస్ అగ్రనేతను హతమార్చామాని, అతని కోసం ధైర్యవంతమైన యుద్ధ యోధులు ఎన్నో రోజుల నుంచి విశ్రాంతి తీసుకోకుండా వేటాడారు. ఇప్పుడు మీం బలంతో శాంతిని సాధించామని ట్రంప్ సోషల్ మీడియాలో తెలిపారు.
ఇది కూడా చూడండి:Ranya Rao Case: రన్యారావు కేసు పై సీబీ'ఐ'..హడలి పోతున్న నేతలు!
ఐసిస్ ముఠాలో అబు ఖదీజా రెండో అత్యంత శక్తిమంతమైన నాయకుడిగా ఉన్నాడు. గ్లోబల్ ఆపరేషన్స్‌ను పర్యవేక్షిస్తున్న అబు ప్రపంచ వ్యాప్తంగా ఉన్న అత్యంత ప్రమాదకర ఉగ్రవాదుల్లో ఒకడు. 2023లో అతడిపై అగ్రరాజ్యం ఆంక్షలు విధించింది. ఐసిస్‌కు వ్యతిరేకంగా అమెరికా నేతృత్వంలోని సంకీర్ణ భద్రతా దళం కొన్నేళ్లుగా కీలక మిలిటరీ ఆపరేషన్లు చేపట్టింది.