Iran సుప్రీం లీడర్ ఆరోగ్య పరిస్థితి విషమం.. తర్వాతి వారసుడు ఆయనేనా

ఇరాన్ సుప్రీం లీడర్ అయతొల్లా అలీ ఖమేనీ ఆరోగ్య పరిస్థితి విషమించినట్లు తెలుస్తోంది. ఆయన వారసుడిగా ఎవరు బాధ్యతలు స్వీకరిస్తారనే దానిపై చర్చలు జరుగుతున్నట్లు సమాచారం. ఖమేనీ రెండో కుమారుడు మెజ్తాబా ఈ బాధ్యతలు స్వీకరించే ఛాన్స్ ఉన్నట్లు తెలుస్తోంది.

New Update
khameni 2


పశ్చిమాసియాలో ఉద్రిక్త పరిస్థితులు కారణంగా ఇజ్రాయెల్, ఇరాన్‌ దేశాలు పరస్పర దాడులతో విరుచుకుపడుతున్నాయి. అయితే తాజాగా ఓ కీలక విషయం బయటపడింది. ఇరాన్ సుప్రీం లీడర్ అయతొల్లా అలీ ఖమేనీ ఆరోగ్య పరిస్థితి విషమించినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే ఆయన వారసుడిగా ఎవరు బాధ్యతలు స్వీకరిస్తారనే దానిపై చర్చలు జరుగుతున్నట్లు సమాచారం. దీనికి సంబంధించి న్యూయార్క్ టైమ్స్‌లో ఓ కథనంలో వెల్లడైంది. 

Also Read: డిజిటల్ అరెస్టులపై కేంద్రం చర్యలు.. మన్‌కీ బాత్‌లో ప్రధాని మోదీ

అయితే 1989లో రుహోల్లా ఖొమేనీ మరణించిన తర్వాత ఇరాన్ సుప్రీం లీడర్‌గా అలీ ఖమేనీ బాధ్యతలు చేపట్టారు. ప్రస్తుతం ఆయనకు 85 ఏళ్లు నిండాయి. అలాగే ఆయన వారసుడిగా భావించిన ఇబ్రహీం రైసీ కూడా ఇటీవల హెలీకాప్టర్ ప్రమాదంలో మరణించారు. ఇప్పుడు ఖమేనీ ఆరోగ్య పరిస్థితి విషమించడంతో ఆయన తర్వాత ఎవరు అనే చర్చ మొదలైంది.  

Also Read :  ముందుగానే యాంకర్ ఇన్వెస్టర్ల కోసం..మార్కెట్లోకి స్విగ్గీ ఐపీఓ ఎంట్రీ?

ఖమేనీ వారసుడు ఎవరు ?

అలీ ఖమేనీ రెండో కుమారుడు మెజ్తాబా (55) ఆయన వారసుడిగా బాధ్యతలు స్వీకరించే ఛాన్స్ ఉన్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఇజ్రాయెల్, ఇరాన్ మధ్య పరస్పర దాడులు జరుగుతున్న సంగతి తెలిసిందే. అయితే ఇజ్రాయెల్‌పై ప్రతీకార దాడులు ఎలా స్పందించాలనేదానిపై ప్రస్తుతం చర్చలు కొనసాగుతూనే ఉన్నాయి. ఈ క్రమంలోనే ఖమేనీ వారసుడిగా మెజ్తాబా బాధ్యతలు స్వీకరిస్తారనే ప్రచారం మొదలైంది. అయితే ఈ విషయంపై ఇంతవరకు ఎలాంటి ప్రకటన రాలేదు. దీనిపై మరింత స్పష్టత రావాల్సి ఉంది. 

Also Read: రైల్వేస్టేషన్‌లో తొక్కిసలాట.. 9 మందికి తీవ్రంగా గాయాలు

గతకొంతకాలంగా పశ్చిమాసియాలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న సంగతి తెలిసిందే. అయితే తాజాగా శనివారం తెల్లవారుజామున జరిగిన ఇజ్రాయెల్ వైమానిక దాడులు ఇరాన్ క్షిపణి స్థావరాలను తీవ్రంగా దెబ్బతీశాయి. ఇరాన్ క్షిపణుల్లో వినియోగించే ఘన ఇంధన మిశ్రమాన్ని తయారుచేసే ప్రదేశాలను ధ్వంసం చేశాయి. అలాగే ఇజ్రాయెల్ దళాలు ఉత్తర గాజాపై దాడులకు పాల్పడ్డాయి. ఈ దాడుల్లో సుమారు 45 మంది మృతి చెందినట్లు తెలుస్తోంది. 

Also Read :  కాజోల్ చనిపోయిందని వార్తలు!.. నటి కామెంట్స్ వైరల్

Advertisment
Advertisment
తాజా కథనాలు