Iran: రహస్యంగా వారసుడుని ఎన్నుకున్న ఖమేనీ.. కారణమేంటి?

ఇరాన్ సుప్రీం లీడర్ ఆయాతుల్లా అలీ ఖమేనీ మోజ్తాబా ఖమేనీని రహస్యంగా తన వారసుడుని నియమించినట్లు తెలుస్తోంది. ఆయాతుల్లా ఆరోగ్యం క్షీణించడంతో సెప్టెంబర్‌లోనే నియమించారట. టెహ్రాన్‌లో ఉన్న పరిస్థితుల దృష్ట్యా ఈ విషయాన్ని రహస్యంగా ఉంచినట్లు సమాచారం.

New Update
Iran..

ఇరాన్ సుప్రీం లీడర్ ఆయాతుల్లా అలీ ఖమేనీ ఆరోగ్యం రోజురోజుకీ క్షీణించినట్లు సమాచారం. ఈ క్రమంలో ఖమేనీ తన వారసుడిగా రెండో కుమారుడు అయిన మోజ్తాబా ఖమేనీని రహస్యంగా నియమించినట్లు సమాచారం. అయితే ప్రస్తుతం టెహ్రాన్‌లో ఉన్న కీలక పరిణామాల వల్ల ఈ విషయాన్ని రహస్యంగా ఉంచినట్లు తెలుస్తోంది. తీవ్ర అనారోగ్య పరిస్థితుల్లో ఉన్న ఖమేనీ త్వరలో పదవీ విరమణ కూడా చేయవచ్చని సమచారం. 

ఇది కూడా చూడండి: చైనాలో దారుణం.. కత్తి దాడిలో 8 మంది మృతి

60 మంది సభ్యుల అంగీకారంతో..

ఖమేనీ నిర్ణయంపై మొదట వ్యతిరేకత వచ్చింది. కానీ తర్వాత ఏకగ్రీవంగా ఎన్నుకున్నట్లు సమాచారం. ఖమేనీ డిమాండ్‌పై ఇరాన్‌లో 60 మంది నిపుణుల అసెంబ్లీ సభ్యులు సమావేశమయ్యి.. సెప్టెంబర్‌లోనే ఎంపిక చేసుకున్నట్లు తెలుస్తోంది. ఈ విషయం బయటకు తెలియకుండా ఉండాలని భావించారు. ఖమేనీ తర్వాత ఇబ్రహీం రైసీని వారసుడిగా భావించారు. కానీ ఇటీవల అతను హెలికాప్టర్ ప్రమాదంలో మరణించారు. 

ఇది కూడా చూడండి:  ‘నెట్ స్పీడ్ పెరిగిందో మీ పని ఖతం.. బాడీలో ఆ పార్ట్‌కు ముప్పు’

ఇదిలా ఉండగా.. తాజాగా ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు ఇంటిపై మరోసారి దాడి బాంబుల దాడి జరిగింది. ఉత్తర ఇజ్రాయెల్ సిజేరియా పట్టణంలో ఉన్న ప్రధాని బెంజమిన్ నెతన్యాహు ఇంటి గార్డెన్‌లో రెండు బాంబులను గుర్తించారు. అయితే ఈ దాడి సమయంలో ఇంట్లో నెతన్యాహు లేరు. 

ఇది కూడా చూడండి: ప్రెగ్నెంట్ చేస్తే లక్షల్లో డబ్బు అంటూ.. నిరుద్యోగ అబ్బాయిలే టార్గెట్

గార్డెన్‌లో బాంబుల దాడి జరిగినప్పుడు అక్కడ ఎవరూ లేకపోవడంతో ఎలాంటి నష్టం జరగలేదు. ఈ దాడిని ఇజ్రాయెల్ భద్రతా మంత్రి ఖండించారు. ఇంట్లో బాంబు పెట్టి రెడ్ లైన్ క్రాస్ చేశారని, దీంతో తీవ్ర పరిణామాలు ఎదుర్కొంటారని హెచ్చరించారు. అయితే ఈ బాంబుల దాడి ఇరాన్ పన్నాగమేనని ఇజ్రాయెల్ అనుమానిస్తోంది. 

ఇది కూడా చూడండి: TG Group-3: నేడే గ్రూప్-3 పరీక్ష.. అభ్యర్థులకు నిపుణుల కీలక సూచన!

Advertisment
Advertisment
తాజా కథనాలు