నెతన్యాహును చంపేస్తామంటున్న ఇరాన్ ! ఇరాన్, ఇజ్రాయెల్ మధ్య హెటెన్షన్ నెలకొంది. ఇరాన్ హిట్‌లిస్టులో ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు ఉన్నట్లు ప్రచారం నడుస్తోంది. నెతన్యాహుని కచ్చితంగా చంపి తీరుతామని ఇరాన్ ప్రకటించినట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి. By B Aravind 03 Oct 2024 in ఇంటర్నేషనల్ Latest News In Telugu New Update షేర్ చేయండి ఇరాన్, ఇజ్రాయెల్ మధ్య హెటెన్షన్ నెలకొంది. ఇరాన్ హిట్‌లిస్టులో ఇజ్కాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు ఉన్నట్లు ప్రచారం నడుస్తోంది. కచ్చితంగా చంపి తీరుతామని ఇరాన్ ప్రకటించినట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి. ఇక వివరాల్లోకి వెళ్తే.. ఇరాన్ కీలక నేతలను అంతం చేయాలన్న అంశంపై ఇజ్రాయెల్ భద్రతా క్యాబినేట్‌లో చర్చ జరిగింది. ఇందులో భాగంగా ఓ జాబితాలో సుప్రీం నేత అయాతుల్లా ఖమేనితో పాటు రివల్యూషనరీ దళంలోని కీలక కమాండర్ల పేర్లు ఉన్నట్లు వార్తలు వచ్చాయి. Also Read: నేటి నుంచి మహిళల పొట్టి కప్.. ఇక అమ్మాయిల వంతే! అయితే ఇప్పుడు ఇరాన్ హిట్‌లిస్ట్ అంటూ కూడా కొన్ని పేర్లు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. వాళ్లలో ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యూహుతో పాటు ఆ దేశ రక్షణ మంత్రి యోవ్ గాలంట్ ఉన్నట్లు తెలుస్తోంది. అలాగే ఆర్మీ, నావి, ఎయిర్‌ఫోర్స్‌కు చెందిన కమాండర్ల పేర్లు కూడా ఆ జాబితాలో ఉన్నట్లు సమాచారం. ప్రస్తుతం ఈ అంశం చర్చనీయాంశమవుతోంది. ఇరాన్, ఇజ్రాయెల్ మధ్య మరింత ఉద్రిక్త పరిస్థితులు నెలకొంటాయని పలువురు నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేని కోసం ఇజ్రాయెల్ వేట ప్రారంభించింది. ఇప్పటికే లెబనాన్‌లోకి ఆ దేశ భద్రతా దళాలు ప్రవేశించాయి. ఈ క్రమంలోనే హెజ్‌బొల్లా.. ఇజ్రాయెల్ ట్యాంకర్‌ను పేల్చేసింది. దీంతో గాయపడిన సైనికులను లెబనాన్ నుంచి ఇజ్రాయెల్‌కు తరలిస్తున్నారు. ఇదిలాఉండగా.. మంగళవారం రాత్రి ఇజ్రాయెల్‌పై ఇరాన్ క్షిపణులతో విరుచుకుపడ్డ సంగతి తెలిసిందే. ఈ దాడుల అనంతరం.. ఇరాన్ పెద్ద తప్పు చేసిందని, తప్పకుండా మూల్యం చెల్లించుకుంటుందని ప్రధాని నెతన్యూహూ హెచ్చరించారు. #telugu-news #israel #netanyahu మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి