గల్ఫ్‌లో తీవ్ర ఉద్రిక్తత.. ఒమన్‌ చమురు టర్మినల్‌పై ఇరాన్ డ్రోన్‌ దాడి

గల్ఫ్ దేశాల్లో యుద్ధ మేఘాలు కమ్ముకున్నాయి. ఇరాన్ తన యుద్ధ విమానాలు, క్షిపణులు, డ్రోన్లతో గల్ఫ్ ప్రాంతంలోని కీలక స్థావరాలపై విరుచుకుపడుతోంది. ఈ క్రమంలోనే ఒమన్‌లోని అత్యంత కీలకమైన 'మినా అల్ ఫహల్' ఆయిల్ టెర్మినల్‌ లక్ష్యంగా భారీ డ్రోన్ దాడి జరిగింది.

New Update
oman

గల్ఫ్ దేశాల్లో యుద్ధ మేఘాలు కమ్ముకున్నాయి. ఇరాన్ తన యుద్ధ విమానాలు, క్షిపణులు, డ్రోన్లతో గల్ఫ్ ప్రాంతంలోని కీలక స్థావరాలపై విరుచుకుపడుతోంది. ఈ క్రమంలోనే ఒమన్‌లోని అత్యంత కీలకమైన 'మినా అల్ ఫహల్' ఆయిల్ టెర్మినల్‌ లక్ష్యంగా భారీ డ్రోన్ దాడి జరిగింది. ఈ దాడి కారణంగా టర్మినల్‌లో భీకరమైన పేలుడు సంభవించింది. సమాచారం అందుకున్న వెంటనే అప్రమత్తమైన స్థానిక అధికారులు, అగ్నిమాపక సిబ్బంది ఫైరింజన్ల సహాయంతో మంటలను అదుపు చేయడానికి తీవ్రంగా శ్రమిస్తున్నారు. ఇరాన్ ప్రయోగించిన డ్రోన్ వల్లే ఈ ఘోర ప్రమాదం జరిగిందని ఒమన్ స్థానిక అధికారులు తెలిపారు. 

ఇది కూడా చూడండి: Mina Ala Fahal terminal : ఒమన్‌ ఆయిల్ టర్మినల్‌పై డ్రోన్‌ దాడి.. నిలిచిపోయిన చమురు లోడింగ్!

టర్మినల్‌లో చిక్కుకున్న ట్యాంకర్లు..

ఈ భారీ పేలుడు, అగ్నిప్రమాదం కారణంగా మినా అల్ ఫహల్ టర్మినల్‌లో చమురు లోడింగ్ కార్యకలాపాలను అధికారులు పూర్తిగా నిలిపివేశారు. గల్ఫ్ నుంచి చమురును తరలించడానికి ప్రపంచంలోని వివిధ దేశాల నుంచి వచ్చిన పలు సూపర్ ట్యాంకర్లు ప్రస్తుతం ఆ టర్మినల్‌లోనే చిక్కుకుపోయాయి. అక్కడ మళ్లీ పరిస్థితులు సాధారణ స్థితికి చేరుకుని.. చమురు సరఫరా పునరుద్ధరించే వరకు ఆ భారీ నౌకలు అక్కడే వేచి ఉండక తప్పని పరిస్థితి నెలకొంది. ఈ పరిణామం అంతర్జాతీయంగా చమురు సరఫరాపై ప్రభావం చూపే అవకాశం ఉందని మార్కెట్ నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

ఒమన్ సముద్ర జలాల్లో ఉన్న అమెరికా సైనిక నౌకను తాము విజయవంతంగా లక్ష్యంగా చేసుకున్నట్లు ఇరాన్ ప్రభుత్వ అధికారిక మీడియా ప్రకటించింది. తమ దేశ సముద్ర జలాల్లోకి చొరబడటానికి ప్రయత్నిస్తున్నందు వల్లే అమెరికా నౌకపై దాడి చేసినట్లు ఇరాన్ సైన్యం పేర్కొంది. అయితే టెహ్రాన్ చేసిన ఈ ప్రకటనను అమెరికా సెంట్రల్ కమాండ్ తీవ్రంగా ఖండించింది. ఒమన్ సముద్రంలో ఉన్న తమ సైనిక ఆస్తులన్నీ సురక్షితంగా ఉన్నాయని, అమెరికాకు చెందిన ఏ ఒక్క నౌకపై కూడా ఎలాంటి దాడి జరగలేదని అమెరికా రక్షణ శాఖ స్పష్టం చేసింది. 

ఇది కూడా చూడండి: Operation Sindoor : ఆపరేషన్ సిందూర్ ఎఫెక్ట్:  చైనా, టర్కీ ఆయుధాలపై పాక్ కన్ను!

Advertisment
తాజా కథనాలు