Iran : అమెరికాకు అత్యంత సమీపంలోనే "కొత్త ఆయుధం'...ఇరాన్ చెబుతున్న ఆ ఆయుధం ఏంటీ?

ఇరాన్ నేవీ కమాండర్ రేర్ అడ్మిరల్ షారమ్ ఇరానీ చేసిన హెచ్చరికలు పశ్చిమాసియాలో తీవ్ర ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. శత్రు బలగాలకు "గుండెపోటు" తెప్పించే ఒక రహస్య కొత్త ఆయుధాన్ని త్వరలోనే ప్రయోగిస్తామని ఆయన చేసిన వ్యాఖ్యలు అంతర్జాతీయంగా చర్చనీయాంశ మయ్యాయి.

New Update
FotoJet - 2026-04-30T112912.885

Iran : అమెరికా-ఇరాన్ మధ్య యుద్ధ మేఘాలు కమ్ముకుంటున్న వేళ, ఇరాన్ నేవీ కమాండర్ రేర్ అడ్మిరల్ షారమ్ ఇరానీ చేసిన హెచ్చరికలు పశ్చిమాసియాలో తీవ్ర ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. శత్రు బలగాలకు "గుండెపోటు" తెప్పించే ఒక రహస్య కొత్త ఆయుధాన్ని త్వరలోనే ప్రయోగిస్తామని ఆయన చేసిన వ్యాఖ్యలు అంతర్జాతీయంగా చర్చనీయాంశ మయ్యాయి. అమెరికాకు అత్యంత సమీపంలోనే ఈ ఆయుధం ఉందని, దాని ప్రభావం శత్రువులను కోలుకోలేని విధంగా దెబ్బతీస్తుందని ఆయన పేర్కొన్నారు. అయితే ఆ ఆయుధం ఏంటీ అనే వివరాలు మాత్రం వెల్లడించలేదు. అయితే ఈ క్రమంలో అసలు ఇరాన్‌ వద్ద ఉన్న ఆ శక్తివంతమైన ఆయుధం ఏంటీ అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.  ఇరాన్‌ వద్ద ఉన్న ప్రత్యేక ఆయుధాలలో మ్యాన్ ప్యాడ్స్, క్షిపణులు ముఖ్యమైనవి. 
 
మ్యాన్‌ప్యాడ్స్ (MANPADS):

కోట్ల రూపాయల విలువైన అమెరికా యుద్ధ విమానాలను, ఇరాన్ కేవలం కొన్ని వేల డాలర్ల విలువ చేసే చిన్న క్షిపణులతో కూల్చివేస్తూ అగ్రరాజ్యానికి సవాలు విసురుతోంది.  దీంతో అమెరికాకు కొత్త తలనొప్పి మొదలైంది. ఇరాన్ ప్రధానంగా 'మ్యాన్‌ప్యాడ్స్' (Man-Portable Air Defense Systems) అని పిలిచే క్షిపణులను ఎక్కువగా ఉపయోగిస్తోంది. ఇవి ఒక సాధారణ వ్యక్తి తన భుజంపై పెట్టుకుని ప్రయోగించగలిగే అతి చిన్న వైమానిక రక్షణ వ్యవస్థ. కేవలం 50 వేల నుండి 1.5 లక్షల డాలర్ల మధ్య ధర ఉండే ఈ చిన్న అస్త్రాలు, కోట్ల డాలర్ల విలువైన అమెరికా ఫైటర్ జెట్లను నేలమట్టం చేస్తున్నాయి.

 ఈ క్షిపణులు ధ్వని కంటే రెండు రెట్ల వేగంతో ప్రయాణిస్తూ, సుమారు 3.2 మైళ్ల పరిధిలోని లక్ష్యాలను ఛేదించగలవు.15,000 అడుగుల ఎత్తులో ప్రయాణించే యుద్ధ విమానాలను కూడా ఇవి సులువుగా ధ్వంసం చేయగలవు.ఇవి చాలా చిన్నవిగా ఉండటం వల్ల వీటిని రాడార్ల ద్వారా గుర్తించడం అమెరికా సైన్యానికి కష్టమవుతోంది. ఒక చిన్న కారు డిక్కీలో కూడా వీటిని దాచి ఎక్కడికైనా తరలించవచ్చు.అమెరికా ఇంటెలిజెన్స్ నివేదికల ప్రకారం, ఇరాన్ సుమారు 1,000కి పైగా ఇటువంటి క్షిపణులను చైనా నుంచి పొందుతున్నట్లు సమాచారం. అమెరికాతో నేరుగా ఘర్షణ రాకుండా ఉండటానికి చైనా వీటిని ఇతర దేశాల ద్వారా ఇరాన్‌కు చేరుస్తున్నట్లు తెలుస్తోంది. ఈ చవకైన క్షిపణుల దాడి వల్ల అమెరికాకు చెందిన అత్యంత ఖరీదైన F-15E, A-10 వంటి యుద్ధ విమానాలు ఇప్పటికే కూలిపోయినట్లు నివేదికలు చెబుతున్నాయి.

 క్షిపణులు :
 ఇరాన్ క్షిపణి సామర్ధ్యాన్ని అమెరికా ఇంతవరకు అంచనా వేయలేదు. ఆ రహాస్యాలు కూడా అమెరికాకు చిక్కలేదు. అందుకే మిస్సైళ్ల తయారీలో ఇరాన్ ఒక ప్రత్యేక శైలిని అవలంబిస్తోంది. అణ్వాయుధాలను నేరుగా తయారు చేయలేకపోయినా, శక్తిమంతమైన మిస్సైళ్ల ద్వారా అమెరికాను ఢీకొట్టాలని ఆ దేశ ఇస్లామిక్ రెజిమ్ ఏళ్లుగా కృషి చేస్తోంది. ఇన్నాళ్లూ తమ క్షిపణి పరిధి కేవలం గల్ఫ్ దేశాల వరకే పరిమితమని నమ్మబలికిన ఇరాన్, ఇప్పుడు యుద్ధ సమయంలో తన అసలు విశ్వరూపాన్ని ప్రదర్శిస్తోంది. ఇరాన్ అధికారులు తమ మిస్సైళ్ల గరిష్ట రేంజ్ 2,000 కిలోమీటర్లని చెబుతున్నప్పటికీ, అమెరికా ఇంటెలిజెన్స్ ప్రకారం సెజిల్, ఖొర్రమ్‌షాహ్, ఎమాద్ వంటి క్షిపణులు 2,500 నుండి 3,000 కిలోమీటర్ల దూరం వరకు ప్రయాణించగలవని సమాచారం.

ఖండంతర క్షిపణి (ICBM) సామర్థ్యంపై ఉత్కంఠ

అమెరికా, ఇరాన్ మధ్య సుమారు 10,000 కిలోమీటర్ల దూరం ఉంది. టెహ్రాన్ నుండి వాషింగ్టన్ డీసీని టార్గెట్ చేయాలంటే ఇంటర్‌ కాంటినెంటల్ బాలిస్టిక్ మిస్సైల్ (ICBM) అవసరం. ప్రస్తుతం ఇరాన్ వద్ద నేరుగా ICBMలు లేవని అమెరికా ఆయుధ నియంత్రణ సంఘం చెబుతున్నప్పటికీ, ఇరాన్ తన స్పేస్ లాంచ్ వెహికల్స్‌ను ICBMలుగా మార్చుకునే అవకాశం ఉందనే వార్తలు అమెరికాను ఆందోళనకు గురిచేస్తున్నాయి. ఇటీవల 2026 యుద్ధ పరిణామాల్లో ఇరాన్ 500కి పైగా బాలిస్టిక్ మిస్సైళ్లను ప్రయోగించిందని అమెరికా రక్షణ శాఖ ధృవీకరించింది. ఇరాన్ కు చెందిన కొన్ని రహస్య  క్షిపణులను అమెరికా చుట్టూ మొహరించినట్లు తెలుస్తోంది. వాటిని అమెరికా రాడార్ వ్యవస్థకు చిక్కకుండా జాగ్రత్తపడుతుందన్న ప్రచారం ఉంది. దీంతో అమెరికాకు భయం పట్టుకుంది.

Advertisment
తాజా కథనాలు