/rtv/media/media_files/2026/03/27/fotojet-16-2026-03-27-17-33-02.jpg)
Iran warns Gulf countries
Iran warns Gulf countries : ఇరాన్, ఇజ్రాయెల్ యుద్దం మరింత ముదిరింది. యుద్ధానికి అమెరికా కొంత విరామం ఇస్తున్నప్పటికీ ఇజ్రాయెల్ మాత్రం ఇరాన్‌పై విరుచుకుపడుతూనే ఉంది. ఇరాన్ కూడా తనేం తక్కువ తినలేదంటూ అంతే ధీటుగా సమాధానమిస్తోంది. ఈ రోజు ఇజ్రాయెల్ ఇరాన్‌లోని చమురు కేంద్రాలు, బాలిస్టిక్ క్షిపణి స్థావరాలను లక్ష్యంగా చేసుకుని దాడులు చేసింది. ఈ క్రమంలోనే ఇరాన్ మరోసారి గల్ఫ్ దేశాలకు సీరియస్ వార్నింగ్ ఇచ్చింది. ఇప్పటికే ఆయా దేశాల్లో అమెరికా స్థావారాలను ఏర్పాటు చేసుకోవడానికి అవకాశం ఇచ్చారన్న కారణంగా గల్ఫ్ దేశాలపై దాడులు చేస్తు్న్న ఇరాన్ ఈసారి మరోసారి గట్టిగా హెచ్చరించింది.
ఇరాన్‌తో యుద్ధం చేస్తున్న వారికి గల్ఫ్ దేశాల్లోని హోటళ్లలో ఆశ్రయం ఇస్తున్నారని, వాటిని మానుకోవాలని హెచ్చరించింది. అలా కాదని మాపై డాడులు చేసే వారికి మీ హోటళ్లలో ఆశ్రయం ఇస్తే మాత్రం మరోసారి తీవ్ర పరిణామాలు తప్పవని హెచ్చరించింది. కాగా పలువురు అమెరికా సైనికులు గల్ఫ్‌లోని పలు స్థావరాల్లో ఉంటూ ఇరాన్ పై దాడులు చేశారు. అయితే ఆ స్థావరాలపై ఇరాన్ దాడులు చేయడంతో వాటిని వదిలేసిన అమెరికా సైనికులు ఐరోపా అంతటా ఉన్న హోటళ్లు, కార్యాలయాల్లో ఆశ్రయం పొందుతున్నారు. వారంతా దూరంగా ఉంటూనే యుద్ధంలో పాల్గొంటున్నారని మాకు సమాచారం ఉందని ఇరాన్ ఆరోపించింది. మేం ఆ హోటళ్లని లక్ష్యంగా చేసుకుని దాడులు చేస్తాం. ముందుగానే మీకు చెబుతున్నాం. అమెరికా సైనికులకు గల్ఫ్ దేశాల్లోని హోటళ్లలో ఆతిథ్యం ఇవ్వొద్దు. అలా ఇచ్చే పక్షంలో భారీ మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుంది’ అని ఇరాన్ వార్నింగ్ ఇచ్చింది.
ఇదిలా కొనసాగుతుండగా,. ఇరాన్ ఆయుధ తయారీ కేంద్రాలపై ఇజ్రాయెల్ మరోసారి భీకరమైన దాడులకు పాల్పడింది. ఇరాన్ ప్రధాన నావికా క్షిపణి, సముద్ర మైన్ల తయారీ కేంద్రంతో పాటు బాలిస్టిక్ క్షిపణి, వాయు రక్షణ లక్ష్యాలపై ఇజ్రాయెల్ దాడులు కొనసాగించింది. అదే సమయంలో ఇరాన్ కూడా ఏమాత్రం తగ్గకుండా దాడులను తీవ్రతరం చేసింది. ఇరాన్ ప్రయోగించిన క్షిపణిని ఇజ్రాయెల్ వాయు రక్షణ దళం సమర్థవంతంగా అడ్డుకున్నట్లు వెల్లడించింది.
Follow Us