/rtv/media/media_files/2026/04/11/asim-munir-met-iran-leaders-in-combat-gear-but-jd-vance-in-a-suit-2026-04-11-16-23-40.jpg)
Asim Munir met Iran leaders in combat gear but JD Vance in a suit
పశ్చిమాసియాలో శాంతిని నెలకొల్పేందుకు పాకిస్థాన్ పన్నిన వ్యూహాలు తలకిందులయ్యాయి. ఇరాన్, అమెరికా యుద్ధంలో మధ్యవర్తిత్వం చేస్తామని ముందు నడిచిన పాకిస్తాన్‌ను ఇప్పుడు రెండు దేశాలు చీదరించుకుంటున్నాయి. ముస్లీం దేశమైన ఇరాన్ అసీం మునీర్‌ను నమ్మడం లేదు. పాకిస్తాన్ ఎవరికి చెప్పే మాటలు వారికి చెపుతున్నట్లు అమెరికా అనుమానిస్తోంది. మొదటి దశ ఇస్లామాబాద్ చర్చలు ఫైయిల్ అవ్వగా.. రెండో దశ చర్చల్లో అసలు పాల్గొనమని ఇరాన్ కుండ బద్దలుకొట్టింది. ఇక అమెరికా నిఘా సంస్థలు పాక్ మీడియేషన్‌ను నమ్మోదని ట్రంప్ సర్కార్‌ను హెచ్చరిస్తున్నారు. అమెరికా, ఇరాన్ మధ్య మధ్యవర్తిత్వం వహించి ‘గ్లోబల్ హీరో’ అనిపించుకోవాలనుకున్న పాక్ ఆర్మీ చీఫ్ జనరల్ ఆసిమ్ మునీర్ ప్రయత్నాలకు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఇస్లామాబాద్ వేదికగా జరగాల్సిన రెండో విడత శాంతి చర్చలకు ఇరాన్ ‘నో’ చెప్పడంతో పరిస్థితి ఒక్కసారిగా ఉద్రిక్తంగా మారింది.
వివాదానికి కారణమైన ‘కార్గో షిప్’ సీజ్
ఇరు దేశాల మధ్య కుదిరిన కాల్పుల విరమణ ఒప్పందం రేపటితో ముగియనుంది. ఈ తరుణంలో హార్మూజ్ జలసంధి సమీపంలో ఇరాన్‌కు చెందిన ఒక కార్గో షిప్‌ను అమెరికా నేవీ సీజ్ చేయడం అగ్నికి ఆజ్యం పోసింది. అమెరికా చర్యను ‘సముద్రపు దొంగతనం’గా అభివర్ణించిన ఇరాన్, ఇలాంటి పరిస్థితుల్లో చర్చల ప్రసక్తే లేదని తెగేసి చెప్పింది. తమ దేశంపై విధించిన ఆర్థిక ఆంక్షలను ఎత్తివేయకుండా, సీజ్ చేసిన ఆస్తులను విడుదల చేయకుండా చర్చల ముందుకు వచ్చేది లేదని ఇరాన్ విదేశాంగ శాఖ స్పష్టం చేసింది.
పాక్ ఆశలు అడియాశలు
అగ్రరాజ్యం అమెరికాతో సంబంధాలు మెరుగుపరుచుకోవడానికి, అలాగే అరబ్ దేశాల ముందు తన పట్టు నిరూపించుకోవడానికి పాకిస్థాన్ ఈ చర్చలను ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. జనరల్ మునీర్ స్వయంగా రంగంలోకి దిగి ఇరు పక్షాలను ఒప్పించే ప్రయత్నం చేసినప్పటికీ, అమెరికా తన మొండివైఖరి వీడకపోవడం, ఇరాన్ అపనమ్మకంతో వెనక్కి తగ్గడంతో ఇస్లామాబాద్ తీవ్ర నిరాశలో కూరుకుపోయింది.
అమెరికా డిమాండ్లు - ఇరాన్ కండీషన్లు
ఈ చర్చలు విఫలం కావడానికి ఇరు దేశాల మధ్య ఉన్న కఠిన నిబంధనలే కారణం.
అమెరికా డిమాండ్: ఇరాన్ తన యురేనియం శుద్ధిని పూర్తిగా నిలిపివేయాలని, అంతర్జాతీయ చమురు సరఫరాకు కీలకమైన హార్మూజ్ జలసంధిని బేషరతుగా తెరిచి ఉంచాలని అమెరికా పట్టుబడుతోంది.
ఇరాన్ స్పందన: విదేశాల్లో స్తంభింపజేసిన తమ దేశ ఆస్తులను తక్షణమే విడుదల చేయాలని, ఇరాన్ ఆర్థిక వ్యవస్థను దెబ్బతీస్తున్న ఆంక్షలను తొలగించాలని డిమాండ్ చేస్తోంది.
ఇరాన్ ‘NO’ చెప్పడానికి ప్రధాన కారణాలు
అమెరికాపై నమ్మకం లేకపోవడం: ఒప్పందాలను అమెరికా పదే పదే ఉల్లంఘిస్తోందని ఇరాన్ ఆగ్రహం.
ఆర్ధిక ఆంక్షలు: ఆస్తుల సీజ్, వాణిజ్య ఆంక్షల వల్ల ఇరాన్ తీవ్రంగా నష్టపోతోంది.
యురేనియం వివాదం: తమ అణు కార్యక్రమంపై అమెరికా పెడుతున్న ఆంక్షలను ఇరాన్ అంగీకరించడం లేదు.
అంతర్గత ఒత్తిడి: ఇరాన్ సైనిక విభాగం (IRGC) అమెరికాతో చర్చలను తీవ్రంగా వ్యతిరేకిస్తోంది.
ప్రాంతీయ భద్రత: పశ్చిమాసియాలో అమెరికా సైనిక కదలికలు ఇరాన్‌కు ముప్పుగా మారాయి.
మొత్తానికి, పాకిస్థాన్ మధ్యవర్తిత్వం విఫలమవ్వడంతో పశ్చిమాసియాలో మళ్లీ యుద్ధ మేఘాలు కమ్ముకుంటున్నాయి. కాల్పుల విరమణ గడువు ముగిశాక పరిస్థితులు ఎంత భయంకరంగా మారుతాయోనని ప్రపంచ దేశాలు ఆందోళన చెందుతున్నాయి.
Follow Us