/rtv/media/media_files/2025/03/31/cALcQUA9w4fyYiyS857l.jpg)
Iran Supreme Leader Photograph: (Iran Supreme Leader)
అణ్వాయుధాల ఒప్పందం విషయంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ హెచ్చరికలు జారీ చేసిన విషయం తెలిసిందే. వీటికి ఇరాన్ సుప్రీం లీడర్ తీవ్రంగా స్పందించారు. ట్రంప్ చేసిన వ్యాఖ్యలపై మండిపడ్డారు. అగ్రరాజ్యం అమెరికా దాడులు చేస్తే మాత్రం అసలు వెనుకాడమని, తిరిగి ఎదురు దాడులు చేస్తామని ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీ స్పష్టం చేశారు.
ఇది కూడా చూడండి: Actress Abhinaya: హీరో కాదు బిజినెస్ మ్యాన్.. కాబోయే భర్తను పరిచయం చేసిన అభినయ!
⚡️BREAKING
— Iran Observer (@IranObserver0) March 31, 2025
Iran's Supreme Leader reacts to Trump's threats
'An attack from the outside is unlikely, but if they make a mistake, they will certainly suffer a heavy blow' pic.twitter.com/3R9IyswNjK
ఇది కూడా చూడండి: Sikandar Collections: సల్మాన్ ఖాన్ కి పైరసీ దెబ్బ.. తొలిరోజు ఎంత వసూలు చేసిందంటే
ఒప్పందానికి నిరాకరిస్తే..
అణు ఒప్పందానికి అమెరికా నిరాకరిస్తే మాత్రం తప్పకుండా దాడులు చేస్తామని బెదిరించారు. ఇరాన్ వ్యాప్తంగా ఉన్న భూగర్భ ప్రయోగ కేంద్రాల దగ్గర పెద్ద సంఖ్యలో క్షిపణులు లాంచ్ ప్యాడ్‌లపై సిద్ధంగా ఉన్నట్లు వెల్లడించారు. అత్యవసర పరిస్థితుల్లో అమెరికా సంబంధిత ప్రాంతాలపై దాడులు చేసేందుకు వీటిని వినియోగించుకోనున్నట్లు తెలిపారు.
ఇదిలా ఉండగా.. ఒప్పందం కుదుర్చుకోని పక్షంలో ఇరాన్‌పై బాంబు దాడులకూ వెనుకాడబోమని ట్రంప్ హెచ్చరించిన సంగతి తెలిసిందే. ఎప్పుడు జరగని రీతిలో ఆ దేశంలో ఇవి జరుగుతాయని అన్నారు. ఈ క్రమంలోనే ఇరాన్ సుప్రీం లీడర్ హెచ్చరికలు జారీ చేశారు.
BREAKING: Trump says 'there will be bombing' if Iran doesn't make a 'peace deal' with us.
— Brian Krassenstein (@krassenstein) March 30, 2025
- Bombing Yemen
- Threatening to Bomb Iran
- Threatening to annex Greenland and Canada
- Israel/GAZA Ceasefire torn up.
Is this what you voted for MAGA?
ఇది కూడా చూడండి: Kumar Sangakkara : 51 ఏళ్ల బ్యూటీతో 47 ఏళ్ల కుమార సంగక్కర డేటింగ్!