యుద్ధంలో బిగ్ ట్విస్ట్.. హార్మూజ్ జలసంధి ఓపెన్.. కానీ, ఇరాన్ ఓ కండీషన్!

కొంతకాలంగా మూసివేసిన హార్మూజ్ జలసంధిని తెరవడానికి సిద్ధమని ఇరాన్ ప్రకటించింది. అయితే, యుద్ధం వల్ల తాము నష్టపోయినందుకు గాను "యుద్ధ పరిహారం" చెల్లించాలని, అప్పుడే హార్మూజ్‌ను ప్రపంచ వాణిజ్యానికి అందుబాటులోకి తెస్తామని ఇరాన్ సంచలన ప్రకటన చేసింది.

New Update
_Strait of Hormuz

పశ్చిమాసియాలో యుద్ధం మరో కీలక మలుపు తిరిగింది. ప్రపంచ చమురు రవాణాకు గుండెకాయ వంటి హార్మూజ్ జలసంధి చుట్టూ ఇప్పుడు తీవ్ర ఉత్కంఠ నెలకొంది. ఇరాన్ వేసిన ఎత్తుగడకు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చాడు. 48 గంటల డెడ్‌లైన్‌కు ఇరాన్ తలవంచింది. కానీ యుద్ధం ఆపేయడానికి, హర్మూజ్ జలసంధి తెరవడానికి ఇరాన్ ఓ కండీషన్ పెట్టింది. ట్రంప్‌ తల వంచేలా ఇరాన్ మెలిక పెట్టింది.

యుద్ధ పరిహారం ఇస్తేనే జలసంధి ఓపెన్ 

గత కొంతకాలంగా మూసివేసిన హార్మూజ్ జలసంధిని తిరిగి తెరవడానికి సిద్ధమని ఇరాన్ ప్రకటించింది. అయితే, ఇందుకోసం ఒక వివాదాస్పద షరతును విధించింది. యుద్ధం వల్ల తాము నష్టపోయినందుకు గాను "యుద్ధ పరిహారం" చెల్లించాలని, అప్పుడే హార్మూజ్‌ను ప్రపంచ వాణిజ్యానికి అందుబాటులోకి తెస్తామని ఇరాన్ సంచలన ప్రకటన చేసింది. చమురు ధరలు మండిపోతున్న తరుణంలో ఇరాన్ ఈ నిర్ణయం తీసుకోవడం విశేషం. ఇరాన్ డిమాండ్లపై ఆగ్రహం వ్యక్తం చేసిన అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్, ఆ దేశానికి 48 గంటల గడువు విధించారు. ఎలాంటి షరతులు లేకుండా హార్మూజ్ జలసంధిని వెంటనే తెరవాలని ఆదేశించారు. భారత కాలమానం ప్రకారం మంగళవారం రాత్రి 8 గంటలతో ఈ డెడ్‌లైన్ ముగియనుంది. ట్రంప్ తనదైన శైలిలో హెచ్చరిస్తూ.. "నిర్ణీత సమయంలోగా జలసంధిని తెరవకపోతే, ఇరాన్‌కు నరకం చూపిస్తాను. ఆ తర్వాత జరిగే పరిణామాలకు మీరే బాధ్యులు" అని వార్నింగ్ ఇచ్చారు. 

ట్రంప్ హెచ్చరికలు కేవలం మాటలకే పరిమితం కాలేదు. ఇప్పటికే ఇరాన్ సరిహద్దుల్లో అమెరికా తన సైనిక బలగాలను భారీగా మోహరించింది. వేలాది మంది సైనికులు, అత్యాధునిక యుద్ధ విమానాలు, నౌకలు దాడులకు సిద్ధంగా ఉన్నాయని సమాచారం. గడువు ముగిసిన తర్వాత ఇరాన్ జలసంధిని తెరవకపోతే అమెరికా నేరుగా సైనిక చర్యకు దిగే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు.

ప్రపంచం చూపు మంగళవారం రాత్రిపైనే!
ఇరాన్ తన డిమాండ్‌పై వెనక్కి తగ్గుతుందా? లేక ట్రంప్ అన్నంత పని చేస్తారా? అన్నది ఇప్పుడు మిలియన్ డాలర్ల ప్రశ్న. ఒకవేళ యుద్ధం మొదలైతే ప్రపంచ ఆర్థిక వ్యవస్థ కుప్పకూలే ప్రమాదం ఉందని నిపుణులు ఆందోళన చెందుతున్నారు. గడువు ముగియడానికి కొద్ది గంటల సమయం మాత్రమే ఉండటంతో, అగ్రరాజ్యం అడుగులు ఎటువైపు పడతాయోనన్న ఉత్కంఠ సర్వత్రా నెలకొంది.

Advertisment
తాజా కథనాలు