Donald Trump : మీడియా సమావేశంలో ట్రంప్‌ దురుసు ప్రవర్తన..మండిపడుతున్న ఇండియన్స్‌

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇటీవల తరచుగా సహనం కోల్పోతున్నారు. ఇటీవల ఒక మీడియా సమావేశంలో స్ట్రెయిట్ ఆఫ్ హోర్ముజ్ జలసంధిలో భారతీయ ఆయిల్ ట్యాంకర్లపై జరిగిన దాడుల గురించి ప్రశ్నించిన విలేఖరిపై ట్రంప్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.

New Update
Trump

Trump

 Donald Trump : అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇటీవల తరచుగా సహనం కోల్పోతున్నారు. ఇరాన్‌తో యుద్ధం నేపథ్యంలో ట్రంప్ పై తీవ్ర వ్యతిరేకత వస్తున్న నేపథ్యంలో ఆయన ప్రవర్తనపై తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది.ఇటీవల ఒక మీడియా సమావేశంలో స్ట్రెయిట్ ఆఫ్ హోర్ముజ్ జలసంధిలో భారతీయ ఆయిల్ ట్యాంకర్లపై జరిగిన దాడుల గురించి ప్రశ్నించిన విలేఖరిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రస్తుతం పశ్చిమాసియాలో నెలకొన్న యుద్ధ ఉద్రిక్తతల నేపథ్యంలో జరిగిన ఈ పరిణామం ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశమైంది.

అమెరికా, ఇరాన్‌ దేశాల మధ్య జరుగుతున్న యుద్ధం నేపథ్యంలో ప్రపంచ దేశాలు తీవ్రంగా నష్టపోతున్నాయి. ముఖ్యంగా దేశాలన్నీ  ఆయిల్, గ్యాస్ కొరతను ఎదుర్కొంటున్నాయి. ఈ క్రమంలో శుక్రవారం హోర్ముజ్‌ను పూర్తిగా తెరుస్తున్నట్లు ఇరాన్ ప్రకటించడంతో ప్రపంచ దేశాలు ఊపిరి పీల్చుకున్నాయి. అంతలోనే హార్మూజ్‌ దిగ్బంధనాన్ని కొనసాగిస్తామని ట్రంప్ ప్రకటించటం కీలకంగా మారింది. దీంతో సమస్య మళ్లీ మొదటికి వచ్చింది. అమెరికా ప్రకటనతో ఇరాన్ మళ్లీ హార్మూజ్‌జలసంధిని మూసి వేసింది. అంతేకాదు.. హోర్ముజ్ జలసంధి గుండా వెళ్తున్న రెండు భారత వాణిజ్య నౌకలపై ఐఆర్‌జీసీకి చెందిన ఇరాన్ గన్‌బోట్లు కాల్పులు జరపడం కలకలం రేపింది.'దేశ్ గరిమ' వంటి భారతీయ జెండా ఉన్న ట్యాంకర్లను లక్ష్యంగా చేసుకుని కాల్పులు జరిపినట్లు వార్తలు వచ్చాయి. దీనిపై భారతదేశం ఇప్పటికే ఇరాన్ రాయబారిని పిలిపించి నిరసన వ్యక్తం చేసింది. ఇదే విషయంపై మీడియా ప్రతినిధి ప్రశ్నించగా, ట్రంప్ అసహనానికి గురయ్యారు.

నౌకలపై భారత జెండాలు ఉన్నప్పటికి ఈ దాడి జరగడం గమనార్హం. ఈ దాడిలో ఎలాంటి ప్రాణ నష్టం సంభవించనప్పటికీ  కాల్పుల నేపథ్యంలో రెండు మిలియన్ బ్యారెళ్ల ముడి చమురును భారత్‌కు తీసుకొస్తున్న ఆ రెండు నౌకలు హార్మూజ్‌  జలసంధి నుంచి వెనక్కి మళ్లినట్టు సమాచారం. ఈ దాడిఇపై  ఓ జర్నలిస్ట్‌పై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ను ప్రశ్నించారు. దీంతో ట్రంప్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆ జర్నలిస్ట్ ‘హార్మూజ్ జలసంధిలో భారత జెండా కలిగిన నౌకలపై కాల్పులు జరిగాయి. దీని గురించి ఏమంటారు?’ అని ప్రశ్నించారు.

దీంతో ట్రంప్ కోపంగా .. ‘అవుట్’ అన్నారు. ఇందుకు సంబంధించిన వీడియోను శశాంక్ మట్టు అనే వ్యక్తి ఎక్స్ ఖాతాలో షేర్ చేయడంతో విషయం వెలుగు చూసింది. ఆ వీడియో కాస్తా సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ట్రంప్ ప్రవర్తనపై నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మరీ ముఖ్యంగా భారతీయులు ట్రంప్ తీరు పట్ల తీవ్రంగా మండిపడుతున్నారు. ట్రంప్ కారణంగానే ప్రపంచ దేశాలకు ఆయిల్, గ్యాస్ కష్టాలు వచ్చాయని మండిపడుతున్నారు.విలేఖరి ప్రశ్నను మధ్యలోనే అడ్డుకుంటూ ట్రంప్.. "నువ్వు ఫేక్ న్యూస్ ప్రచారం చేస్తున్నావు. ఇరాన్ మమ్మల్ని బ్లాక్‌మెయిల్ చేయలేదు, చేయనివ్వం" అని పేర్కొన్నారు. సదరు విలేఖరి అడిగిన ప్రశ్నలోని వాస్తవాలను తప్పుబడుతూ, "నీకు ఏమీ తెలియదు, తప్పుడు ప్రశ్నలు అడగకు" అంటూ దురుసుగా సమాధానమిచ్చారు.
 ఇరాన్ తన సముద్ర జలాల్లోకి వచ్చే నౌకలపై దాడులు చేయడం, అమెరికా దిగ్బంధం విధించడం వంటి చర్యల వల్ల ప్రస్తుతం అక్కడ యుద్ధ వాతావరణం నెలకొంది. భారతీయ సిబ్బంది ఉన్న నౌకలు ప్రమాదంలో పడటం పట్ల భారత ప్రభుత్వం తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తుండగా, ట్రంప్ ఇలా విలేఖరులపై చిందులు తొక్కడం గమనార్హం. ఈ సమావేశం అనంతరం వైట్ హౌస్, మీడియా ప్రతినిధుల మధ్య సంబంధాలు మరింత క్షీణించినట్లు విశ్లేషకులు భావిస్తున్నారు.

Advertisment
తాజా కథనాలు