వ్యక్తి ఖాతాలోకి పొరపాటున రూ.16 లక్షలు.. చివరికి ఊహించని షాక్ సింగాపూర్‌లో ఉంటున్న భారత్‌కు చెందిన ఓ వ్యక్తి ఖాతాలో ఓ సంస్థ నుంచి పొరపాటున రూ.16 లక్షలు పడ్డాయి. వాటిని అతడు తిరిగి ఇవ్వకపోవడంతో ఆ సంస్థ పోలీసులకు ఫిర్యాదు చేసింది. చివరికి ఈ వ్యవహారంపై విచారించిన కోర్టు అతడికి 9 వారాల జైలుశిక్ష విధించింది. By B Aravind 14 Oct 2024 in ఇంటర్నేషనల్ నేషనల్ New Update షేర్ చేయండి ఈ మధ్యకాలంలో కొన్ని తప్పుల వల్ల వేరేవాళ్ల ఖాతాలోకి భారీగా నగదు బదిలీ అవుతున్న సందర్భాలు జరుగుతున్నాయి. వీటిని చూసి ఖాతాదారులు కూడా షాకవుతున్నారు. ఆయా సంస్థలు, బ్యాంకులు తమ తప్పిదాలను తెలుసుకొని మళ్లీ డబ్బును రికవరీ చేస్తున్నాయి. అయితే సింగపూర్‌లో కూడా ఇలాంటి ఘటనే జరిగింది. కానీ డబ్బులు తిరిగి బ్యాంకుకు ఇవ్వనందుకు అతడికి జైలు శిక్ష పడింది. ఒకటి కాదు, రెండు కాదు ఏకంగా తొమ్మిదవారాల పాటు ఈ శిక్ష పడింది. ఇంతకీ అసలేం జరిగిందో తెలియాలంటే ఈ స్టోరీ చదవాల్సిందే. Also Read: ఎన్నికల వేళ షిండే సర్కార్ సంచలన నిర్ణయం.. ఇకనుంచి నో టోల్ ఫీజు! అప్పులు తీర్చుకున్నాడు ఇక వివరాల్లోకి వెళ్తే.. భారత్‌కు చెందిన పెరియసామీ మథియాళగన్ (47) అనే వ్యక్తి సింగపూర్‌లో పనిచేస్తున్నాడు. అయితే ఆయన బ్యాంకు అకౌంట్లోకి పొరపాటున వేరే ఖాతా నుంచి 25000 డాలర్లు బదిలీ అయ్యాయి. అంటే మన కరెన్సీలో దాదాపు రూ.16 లక్షలు. వేరే వాళ్ల డబ్బు తన అకౌంట్లోకి వచ్చాయని మథియాళగన్‌కు కూడా తెలుసు. అయితే ఆ డబ్బులతో తన అప్పులు తీర్చుకున్నాడు. అలాగే కొంత మొత్తాన్ని భారత్‌లో ఉన్న తన కుటుంబానికి పంపాడు. అయితే కొన్ని నెలల క్రితం జరిగిన ఈ వ్యవహారంపై అతడు గతంలో పనిచేసిన ఓ కంపెనీ నుంచి బ్యాంకుకు ఫిర్యాదు వచ్చింది. Also Read: ఆర్థిక శాస్త్రంలో ముగ్గురికి నోబెల్ పురస్కారాలు.. ఏం చేశారంటే ? బ్యాంకు అధికారులు లేఖ ఆ సంస్థ జరిగిన తప్పును బ్యాంకుకు వివరించింది. దీంతో సంస్థ విజ్ఞప్తి మేరకు బ్యాంకు అధికారులు మథియాళగన్‌కు లేఖ రాశారు. అవి పొరపాటున బ్యాంకు అకౌంట్‌కు బదిలీ అయ్యాయని చెప్పారు. వాటిని తిరిగి ఇచ్చేయాలని కోరారు. అంతేకాదు ఆ సంస్థ డైరెక్టర్ కూడా మథియాళగన్‌కు వ్యక్తిగతంగా ఫిర్యాదు చేశాడు. కానీ మథియాళగన్ ఊహించని కారణాలు చెప్పాడు. ఆ డబ్బు ప్రస్తుతం తనవద్ద లేదని అన్నాడు. Also Read: Bishnoi Gang సల్మాన్ ఖాన్‌ను చంపాలనుకోవడానికి అసలు కారణం ఇదే? వాటితో తన అప్పులు తీర్చుకున్నానని.. అలాగే ఇంటికి కూడా పంపించానని సమాధానం ఇచ్చాడు. ఆ తర్వాత అతడి నుంచి ఎలాంటి స్పందన రాకపోవడంతో సంస్థ యాజమాన్యం, బ్యాంకు అధికారులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ వ్యవహారానికి సంబంధించి నవంబర్ 2023లో పోలీసులు అతడిని అదుపులోకి తీసుకని విచారించారు. నెలకు కొంత ఇస్తానని చెప్పినప్పటికీ కూడా అలా ఇవ్వలేకపోయాడు. చివరికి ఈ కేసుపై తాజాగా విచారించిన న్యాయస్థానం.. అతడికి 9 వారాల పాటు జైలు శిక్ష విధించింది. Also read: బుద్ధి పోనిచ్చుకోని కెనడా..అనుమానితుల జాబితాలో భారత దౌత్యవేత్త #telugu-news #singapore #bank-account మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి