ICC Arrest Warrant: ఇజ్రాయెల్ ప్రధానికి ఐసీసీ అరెస్ట్ వారెంట్

ఇజ్రాయెల్‌ ప్రధానమంత్రి బెంజమిన్‌ నెతన్యాహుపై ఇంటర్నేషనల్‌ క్రిమినల్‌ కోర్టు అరెస్టు వారెంట్ జారీ చేసింది.  గాజాలో యుద్ధ నేరాలు, మానవత్వం లేకుండా అందరినీ చంపించడం వంటి నేరాలపై అరెస్ట్ వారెంట్‌ను జారీ చేసింది.

New Update
Israel-Hamas war:మీకు వేరే దారి లేదు..హమాస్‌కు నెతన్యాహు అల్టిమేటం

Israel Prime Minsiter Netanyahu: 

ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు మీద ఐసీసీ చర్యలకు సిద్ధమైంది. నెతన్యాహు, ఇజ్రాయెల్ మాజీ రక్షణశాఖ మంత్రి యోఆవ్‌ గల్లాంట్‌పైనా ఇవి జారీ అయ్యాయి. గాజాలో యుద్ధ నేరాలు, మానవత్వానికి వ్యతిరేకంగా చర్యల కొనసాగింపు ఆరోపణలపై.. ఈ ఇద్దరిపై ఐసీసీ అరెస్టు వారెంట్‌ జారీ చేసింది. ఐక్యరాజ్యసమితి, ఇతర దేశాలు ఎప్పటి నుంచో యుద్ధాన్ని ఆపమని కోరుతున్నాయి. అయినా కూడా ఇజ్రాయెల్ అందరి మాటను పెడచెవిన పెడుతోంది. హమాస్, హెజ్బెల్లాలు అంతమొందించే వరకూ యుద్ధాన్ని ఆపేది లేదని చెబుతోంది. దాని కోసం గాజా, లెబనాన్‌ల మీద అటాక్‌ చేస్తూ వేలమంది ప్రాణాలు తీసింది. 

ఇది కూడా చూడండి:  బద్దశ‌త్రువుకు కీలక పదవి ఇచ్చిన చంద్రబాబు.. వ్యూహం అదేనా?

44వేలమందికి పైనే..

మరోవైపు గాజాలో ఇప్పటివరకు 44 వేలకు పైగా ప్రాణాలు కోల్పోయినట్లు పాలస్తీనా మంత్రిత్వశాఖ తెలిపింది. హమాస్‌ అంతమే లక్ష్యంగా ఇజ్రాయెల్‌  ప్రారంభించిన దాడులు గాజాలో పౌరుల భవిష్యత్తులకు శాపంగా మారాయి. దాడులతో అక్కడ ప్రజలు చనిపోతుండడమే కాకుండా దుర్భర పరిస్థితులు నెలకొన్నాయి. దాదాపు 13 నెలలుగా కొనసాగుతున్న ఈ భీకర పోరులో వేలాది మంది గాజా వాసులు ప్రాణాలు కోల్పోయారు. దాంతో పాటూ సరైన తిండి, వసతులు లేక ప్రజలు అల్లల్లాడుతున్నారు. బాంబుల వల్ల కొందరు ప్రాణాలు పోగొట్టుకుంటే...తిండి లేక మరికొందరు చనిపోతున్నారు. ఇలా ఇప్పటివరకు 44 వేల మందికి పైగా చనిపోయినట్లు పాలస్తీనా ఆరోగ్య మంత్రిత్వ శాఖ అధికారులు తెలిపారు.

Also Read: Russia: ఉక్రెయిన్‌పై రష్యా ఖండాంతర క్షిపణి ప్రయోగం

ఇది కూడా చూడండి: షమీ-మంజ్రేకర్ మధ్య ఐపీఎల్ వివాదం.. దాన్ని దాచుకోమంటూ కౌంటర్స్!

ఇది కూడా చూడండి: ఓటీటీలో ప్రశాంత్ నీల్ యాక్షన్ ఎంటర్ టైనర్.. మీరు చూశారా..?

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

BIG BREAKING: పాక్ కి భారీ షాక్‌..10 మంది సైనికులు హతం!

భారత్‌తో యుద్ధం తప్పదన్నవేళ పాకిస్థాన్‌ కు పెద్ద షాక్ తగిలింది.శుక్రవారం పాక్‌ లోని క్వెట్టాలో బలూచిస్థాన్‌ లిబరేషన్‌ ఆర్మీ జరిపిన దాడుల్లో 10 మంది పాక్‌ సైనికులు మృతి చెందారు.

New Update
pak

BLA

భారత్‌తో యుద్ధం తప్పదన్నవేళ పాకిస్థాన్‌ కు పెద్ద షాక్ తగిలింది.శుక్రవారం పాక్‌ లోని క్వెట్టాలో బలూచిస్థాన్‌ లిబరేషన్‌ ఆర్మీ జరిపిన దాడుల్లో 10 మంది పాక్‌ సైనికులు మృతి చెందారు. మార్గల్‌ ఏరియాలో రోడ్డు పక్కన బాంబు పెట్టి, రిమోట్‌ కంట్రోల్‌ తో పేల్చేశారు.

Also Read: CSK vs SRH : హర్షల్ పటేల్ దెబ్బకి చెన్నై విలవిల.. 154 పరుగులకు ఆలౌట్

ఆ దాడికి సంబంధించిన వీడియోను బీఎల్ఏ విడుదల చేసింది. కాగా మార్చిలో బీఎల్‌ఏ జరిపిన దాడుల్లో 60 మంది హతమైన సంగతి తెలిసిందే.పాక్‌ నుంచి స్వాతంత్య్రం కోసం బీఎల్‌ఏ పోరాడుతోంది.

ఇదిలా ఉంటే పహల్గామ్ అటాక్‌కు పాల్పడిన ఉగ్రవాదులకు భారత్ ధీటైన సమాధానం చెప్పడానికి రెడీ అయ్యింది. జమ్మూ కశ్మీర్ అంతా భద్రతా బలగాలతో జల్లెడపడుతున్నారు. బండిపోరాలో భద్రతా దళాలతో జరిగిన ఎన్‌కౌంటర్‌లో లష్కరే తోయిబా టాప్ కమాండర్ అల్తాఫ్ లల్లి మరణించాడు. ఏప్రిల్ 22న పహల్గామ్‌లో జరిగిన ఉగ్రవాద దాడిలో 26 మంది మృతి చెందిన విషయం తెలిసిందే. ఎల్‌ఇటి ఉగ్రవాదులను పట్టుకునే ప్రయత్నాల్లో భాగంగా ఈ ఆపరేషన్ జరిగింది.

Also Read: BIG BREAKING: హైదరాబాద్ పోలీసుల అదుపులో పాకిస్తానీయుడు.. యువతిని పెళ్లి చేసుకుని

భారత సైన్యం మరియు జమ్మూ కాశ్మీర్ పోలీసులు బండిపోరాలో శుక్రవారం ఉదయం ఉగ్రవాదులు ఉన్నట్లు ఇంటెలిజెన్స్ సమాచారం అందింది. దీంతో పోలీసులు, ఇండియన్ ఆర్మీ సెర్చ్ ఆపరేషన్ ప్రారంభించారు. ఆర్మీ చీఫ్ జనరల్ ఉపేంద్ర ద్వివేది శ్రీనగర్ చేరుకున్నారు. అక్కడ బండిపోరాలో కొనసాగుతున్న ఆపరేషన్ గురించి ఆయనకు వివరించారు. ఆయన పరిస్థితిని సమగ్రంగా సమీక్షించారు.

Also Read: Marriage News: ఎవడ్రా వీడు.. ఒకే మండపంలో ఇద్దరు యువతులకు తాళికట్టిన తెలంగాణ యువకుడు- వీడియో చూశారా?

Also Read: AP Govt : ఏపీ ప్రభుత్వం కొత్త పథకం.. కుటుంబానికి రూ.20వేలు..రేపటి నుంచి అకౌంట్లోకి!

attack | soldiers | army-soldiers | latest-news | telugu-news | latest-telugu-news | latest telugu news updates 

Advertisment
Advertisment
Advertisment