America: హరికేన్‌ విధ్వంసం..30 మంది మృతి!

అమెరికాలోని నాలుగు రాష్ట్రాలను గత రెండు రోజులుగా నాలుగు రాష్ట్రాలను గత రెండు రోజులుగా హెలెన్‌ తుపాన్‌ గడగడలాడిస్తుంది.హెలెన్‌ తుఫాను కారణంగా మరణించిన వారి సంఖ్య 30 కి చేరుకుంది.

New Update
helen

Hurricane Helene Storm in America: అమెరికాలోని నాలుగు రాష్ట్రాలను గత రెండు రోజులుగా హెలెన్‌ తుఫాన్‌ ను ఎదుర్కొంటున్నాయి. వీటిలో ఫ్లోరిడా, జార్జియా, నార్త్‌ కరోలినా, సౌత్‌ కరోలినా వంటి రాష్ట్రాలు అతలాకుతాలం అవుతున్నాయి. ఈ రాష్ట్రాల్లో తుఫాను కారణంగా మరణించిన వారి సంఖ్య 30 కి చేరుకుంది. ‘హెలెన్’ హరికేన్ ఫ్లోరిడా, జార్జియాతో సహా మొత్తం ఆగ్నేయ అమెరికాలో శుక్రవారం భారీ విధ్వంసం సృష్టించింది. నేషనల్ హరికేన్ సెంటర్ ప్రకారం.. హెలెన్ హరికేన్ గురువారం రాత్రి 11:10 గంటలకు ఫ్లోరిడాలోని బిగ్ బెండ్ గ్రామీణ ప్రాంతంలో తీరాన్ని తాకినట్లు అధికారులు వివరించారు.

ఆ సమయంలో దీని గరిష్ట వేగం గంటకు 225 కిలోమీటర్లు. హెలెన్ శుక్రవారం ఉదయం జార్జియాను తీవ్రంగా దెబ్బతీసింది. జార్జియాని తాకినప్పుడు దాని గాలి వేగం గంటకు 177 కిలోమీటర్లు. హెలెన్ హరికేన్ కారణంగా జార్జియా రోడ్లు అన్ని నీటిలో మునిగిపోయాయి. జార్జియాలో ఇప్పటికే ఇద్దరు చనిపోయారు. అయితే దీని సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది. తుఫాను కారణంగా ఆగ్నేయ అమెరికాలోని చాలా ప్రాంతాల్లో బలమైన గాలులు, భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నాయని వాతావరణ నిపుణులు తెలిపారు. 

బలమైన గాలులు, ఆకస్మిక వరదలు ముంచెత్తే అవకాశాలున్నాయని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. హెలెన్ తుఫాను ఉత్తర దిశగా కదులుతున్నట్లు అధికారులు చెబుతున్నారు. తుఫాను రాకముందే ఫ్లోరిడాలో బలమైన గాలుల కారణంగా దాదాపు 9 లక్షల ఇళ్లు, వ్యాపార సంస్థలకు విద్యుత్ సరఫరా ఆగిపోయింది.

ఎన్ డబ్ల్యూఎస్ అట్లాంటా, పరిసర ప్రాంతాలతో సహా సెంట్రల్ జార్జియాకు భారీ వరద హెచ్చరికలను జారీ చేసింది. ఈ ప్రాంతంలో 246 పాఠశాలలు, 23 ఆసుపత్రులు ఉన్నాయని, ఒక మిలియన్ కంటే ఎక్కువ మంది నివాసితులు ప్రమాదంలో ఉన్నారని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. ఫ్లోరిడా, జార్జియా, అలబామా, కరోలినాస్, వర్జీనియా గవర్నర్లు తమ తమ రాష్ట్రాల్లో ఎమర్జెన్సీని అధికారులు ప్రకటించారు.

తుఫానును ఎదుర్కొనేందుకు జార్జియా గవర్నర్ అదనపు బలగాలను, సహాయక సిబ్బంది మోహరించారు. నేషనల్ వెదర్ సర్వీస్ ప్రకారం, హెలీన్ హరికేన్ సౌత్ కరోలినాకు చేరే అవకాశాలు కనిపిస్తున్నాయి.

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

India-China: ట్రంప్‌ టారిఫ్‌ దెబ్బకి మెరుగుపడుతున్న భారత్-చైనా సంబంధాలు

ట్రంప్ టారిఫ్‌ల వల్ల స్టాక్ మార్కెట్లు పతనమవుతున్నాయి. కానీ భారత్, చైనా మధ్య సంబంధాలు మెరుగుపడుతున్నాయి. గతంతో పోలిస్తే ఇరు దేశాల సంబంధాలు మెరుగుపడ్డాయని విదేశాంగ శాఖ మంత్రి జై శంకర్ వెల్లడించారు.

New Update
Jai shankar

Jai shankar

ట్రంప్ టారిఫ్‌ల వల్ల స్టాక్ మార్కెట్లు పతనమవుతున్నాయి. కానీ భారత్-చైనా సంబంధాలు మాత్రం బలపడే దిశగా వెళ్తున్నాయి. తాజాగా ఇరుదేశాల సంబంధాలపై విదేశాంగ శాఖ మంత్రి జై శంకర్ స్పందించారు. ఆ సంబంధాలు సానుకూల దిశ వైపు పయనిస్తున్నాయన్నారు. గతంతో పోలిస్తే ఇరు దేశాల సంబంధాలు మెరుగుపడ్డాయని.. వీటిని సాధారణ స్థితికి తెచ్చేందుకు ఎంతో కృషి చేయాల్సి ఉందని అన్నారు. 

Also Read: ట్రంప్ టారిఫ్‌లు వేస్తే మోదీ ఎందుకు మౌనంగా ఉంటున్నారు.. రాహుల్‌గాంధీ ఫైర్

ఇదిలాఉండగా 202-0 లో తూర్పు లడఖ్‌లోని గల్వాన్‌ లోయలో ఇరు దేశాల జవాన్ల మధ్య ఘర్షణలు చెలరేగిన సంగతి తెలిసిందే. ఆ సమయంలో భారత్-చైనా మధ్య సంబంధాలు దిగజారిపోయాయి. అనంతరం సైనిక, దౌత్యపరంగా చర్చలు జరగడం, గస్తీ ఒప్పందం కుదిరిన సంగతి తెలిసిందే. ఈ ఒప్పందం ప్రకారం 2020లో గస్తీ నిర్వహించిన పెట్రోలింగ్ పాయింట్లకు ఇరుదేశాలకు స్వేచ్ఛగా వెళ్లొచ్చు .  

Also Read: రేవ్ పార్టీలో అడ్డంగా బుక్కైన ఆర్మీ, రాజకీయ నేతల కూతుర్లు.. వీడియో వైరల్ 

ఇటీవల చైనాపై అమెరికా అధ్యక్షుడు ట్రంప్ 108 శాతం టారిఫ్‌లు ప్రకటించిన సంగతి తెలిసిందే. దీంతో తాజాగా చైనా కూడా అమెరికాపై 84 శాతం సుంకాలు విధించింది. దీంతో ట్రేడ్ వార్‌ మరింత ముదిరింది. ఇదిలాఉండగా.. న్యూఢిల్లీలోని చైనా ఎంబసీ అధికార ప్రతినిధి యూ జింగ్ టారిఫ్‌ల స్పందించారు. అమెరికా టారిఫ్‌ సవాళ్లను ఎదుర్కొనేందుకు భారత్, చైనా జత కట్టాలన్నారు. పరస్పర సహకారం, ప్రయోజనాలపై ఇరు దేశాల మధ్య ఆర్థిక, వాణిజ్యం సంబంధాలు ఆధాపడి ఉన్నాయన్నారు. అమెరికా విధించిన టారిఫ్‌ల వల్ల అనేక దేశాలు, ముఖ్యంగా పేద దేశాలు అభివృద్ధి పొందే హక్కును కోల్పోతున్నాయని చెప్పారు. ఇలాంటి కఠిన పరిస్థితుల నుంచి బయటపడేందుకు మన ఇరు దేశాలు కలిసి ఎదుర్కోవాలన్నారు. 

Also read: Viral video: రన్నింగ్ ట్రైన్‌ కిటికీలో ఇరుక్కున్న దొంగ.. కిలోమీటర్ ఈడ్చుకెళ్లిన ప్యాసింజర్

telugu-news | rtv-news 

Advertisment
Advertisment
Advertisment