సిరియాలో 50 ఏళ్ల పాటు సాగిన అసద్ కుటుంబ పాలన అంతమైంది. ఇస్లామిక్ తిరుగుబాటుదారులు ఆ దేశాన్ని స్వాధీనం చేసుకోవడంతో అధ్యక్షుడు బషర్ అల్-అసద్ సిరియాను విడిచి పారిపోయారు. దాదాపు 13 ఏళ్ల క్రితం అసద్ కుటుంబ పాలనపై మొదలైన ఈ తిరుగుబాటు.. నియంతృత్వ పాలనను కూకటి వెళ్లతో పెకలించింది. ఈ తిరుగుబాటుకు బీజం నాటింది ఓ 14 ఏళ్ల బాలుడు అంటే ఆశ్చర్యం వేస్తోంది. అసలు సిరియాలో అంతర్యుద్ధం ఎలా మొదలైంది, అసద్ కుటుంబ పాలన ముగియడానికి గల కారణాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ఇక వివరాల్లోకి వెళ్తే.. 2010-11లో త్యనీషియాలో ఓ చిరు వ్యాపారి మమ్మద్ బువాజీజీతో ఓ అధికారి దురుసుగా ప్రవర్తించాడు. దీంతో ఆ వ్యాపారి మనస్తాపంతో ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన తర్వాత ఆందోళనలు మొదలయ్యాయి. చివరికి ఇవి ఈజిప్ట్, యెమెన్, లిబియా వరకు విస్తరించి అక్కడి నియంతృత్వ పాలకులను వణికించాయి. అయితే సిరియాలో సున్నీల జనాభా ఎక్కువగా ఉంది. చాలాకాలంగా అసద్ కుటుంబమే ఆ దేశాన్ని పాలిస్తోంది. ఆ దేశ అధ్యక్షుడు హఫీజ్ అల్‌అసద్ 2000లో మరణించడంతో లండన్ నుంచి తిరిగివచ్చిన బషర్ అల్-అసద్ అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించారు. Also Read: జాడలేని సిరియా అధ్యక్షుడి ఆచూకి.. రష్యా కీలక ప్రకటన.. Al Assad ఆ తర్వాత కొన్నేళ్ల పాటు కరవు నెలకొనడంతో 2011 నాటికి బషర్ పాలనపై ప్రజల్లో వ్యతిరేకత పెరిగిపోయింది. ఈ క్రమంలోనే బషర్.. దేశవ్యాప్తంగా తన సైన్యం, పోలీసులను అప్రమత్తం చేశారు. ఎవరి నుంచైన చిన్న వ్యతిరేకత వచ్చిన ఉపేక్షించొద్దని ఆదేశించారు. అయితే 2011 ఫిబ్రవరి 26న దారా అనే నగరంలో 14 ఏళ్ల బాలుడు మౌవియా సియాస్నే.. పాఠశాల గోడపై 'ఎజాక్ ఎల్ దూర్ య డాక్టర్'(ఇప్పుడు నీ వంతు వచ్చింది డాక్టర్) అని పెద్ద అక్షరాలతో రాశాడు. వాస్తవానికి కంటి వైద్యుడైన బషర్‌ను సిరియాలో డాక్టర్ అని పిలుస్తుంటారు. Also Read: Urfi Javed : ఉర్ఫీ మ్యాజికల్ గౌన్ పై నటి సమంత పోస్ట్.. వైరలవుతున్న వీడియో..! అయితే ఆ బాలుడు ఇలా పాఠశాల గోడపై రాసిన విషయం ప్రాంతీయ భద్రతాధికారి ఆతిఫ్ నజీబ్‌కు తెలిసింది. దీంతో అతడి ఆదేశాల మేరకు దాదాపు 20 వేల మంది పిల్లలను భద్రతా దళాలు బంధించి తీసుకెళ్లాయి. ఆ తర్వాత సిబ్బంది వాళ్లని చిత్రహింసలకు గురిచేశారు. తమ పిల్లలను విడిచిపెట్టాలని వారి కుటుంబ సభ్యులు ఎంత వేడుకున్నా కూడా దళాలు మాత్రం ఇందుకు అంగీకరించలేదు. దీంతో ప్రజలు వీధుల్లోకి వచ్చి ఆందోళనలు చేశారు. ఆ తర్వాత ఈ ఆందోళనలు దేశం మొత్తం వ్యాపించడంతో చాలామంది ఆందోళనకారులను జైళ్లో వేశారు. చివరికి పరిస్థితులు చేజారిపోతుండటంతో బషర్ అల్- అసద్ తరఫున వచ్చిన కొందరు దారాలోని పెద్దలను కలిసి పిల్లలను విడిపించారు. దాదాపు 26 రోజుల తర్వాత పిల్లలు ఈ నిర్బంధం నుంచి విడుదలయ్యారు. Also Read: ఉదయించే సూర్యుడికి శత్రువుగా ఉంది రెండాకుల గుర్తే..! ఆ తర్వాత పాలకులకు వ్యతిరేకంగా ఆందోళనలు చేయమని వాళ్లతో భద్రతా దళాలు సంతకాలు పెట్టించుకున్నాయి. ఇలా జరిగిన కొన్ని నెలలకు సిరియా సైన్యంలో చీలికలు ఏర్పడ్డాయి. 2011న ఫ్రీ సిరియా ఆర్మీ(ఎఫ్‌ఎస్‌ఏ)గా ఏర్పడి అసద్ కుటుంబంపై పోరాటానికి దిగాయి. ఇందులోకి ఐసిస్, జబాత్ అల్ నుస్రా, అల్‌ఖైదా, ఖుర్దు గ్రూపులు కూడా చొరబడ్డాయి. వీటికి తోడు అమెరికా, రష్యా, ఇరాన్, తుర్కియే, ఇజ్రాయెల్ దేశాలు ఈ అంతర్యుద్ధంలోకి చేరిపోయాయి. రష్యా, ఇరాన్‌ల సహకారంతో బషర్ అల్-అసద్.. తిరుగుబాటుదారులను అణిచివేస్తూ వచ్చారు. Also Read: మహాకుంభమేళా కోసం 13 వేల రైళ్లు.. అశ్వినీ వైష్ణవ్ కీలక ప్రకటన దీంతో కొన్నాళ్లపాటు తిరుగుబాటుదారులు ఇడ్లిబ్ ప్రాంతానికే పరిమితం అయ్యారు. ప్రస్తుతం రష్యా-ఉక్రెయిన్, ఇజ్రాయెల్, హమాస్ యుద్ధం జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఇరాన్, రష్యా బలహీనపడినట్లు అంచనాలు రావడంతో హెచ్‌టీఎస్(హయాత్ తహరీర్ అల్-షామ్) మరికొన్ని గ్రూపులు కలిసి మెరుపు దాడులకు పాల్పడ్డాయి. చివరికీ బషర్ అసద్‌ను దేశం నుంచి తరిమేశాయి. గత 13 ఏళ్లుగా బషర్ పాలనకు వ్యతిరేకంగా కొనసాగిన ఆందోళలనల్లో దాదాపు 5 లక్షల మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. వేల కోట్ల రూపాయల ఆస్తి నష్టం జరిగింది. ఎట్టకేలకు అసద్ కుటుంబ పాలన నుంచి సిరియా ప్రజలకు విముక్తి లభించింది.