ఆన్‌లైన్ లవర్ కోసం ఆశపడి భర్తకు విడాకులు.. తీరా చూస్తే అది AI స్కామ్

ఆన్‌లైన్‌లో పరిచమైన హాలీవుడ్ హీరో కోసం అన్నా అనే ఫ్రెంచ్ మహిళ భర్తను, డబ్బులను పోగొట్టుకుంది. బ్రాడ్‌పిట్ ఏఐ ఫొటోలు వాడి అన్నా మోసం చేసి రూ.7కోట్ల స్కామ్ చేశాడు. అన్నా బ్రాడ్‌పిట్ కోసం బిలియనీర్ భర్తకు విడాకులు ఇచ్చి వచ్చిన భరణాన్ని అతనికి పింపింది.

New Update
anna scam

anna scam Photograph: (anna scam)

హాలీవుడ్ యాక్టర్ బాయ్ ఫ్రెండ్‌గా కావాలనుకొని ఓ ఫ్రెంచ్ మహిళ బిలియనీర్ భర్తకు విడాకులు ఇచ్చింది. అన్నా అనే ఫ్రెంచ్ మహిళకు బిలియనీర్‌తో వివాహమైంది. 2023లో ఆమె తన ఫ్యామిలీతో కలిసి స్కీ రిసార్ట్‌లో పిక్‌నిక్‌కు వెళ్లింది. రిసార్ట్‌లో మంచి అందమైన ఫొటోలు తీసి సోషల్ మీడియాలో పెట్టింది. ఆమెకు అప్పటిదాకా సోషల్ మీడియా అకౌంట్ లేదు. కొత్తగా ఓ సోషల్ మీడియా అకౌంట్ తీసి అందులో తన ఫొటోస్ అప్లోడ్ చేసుకుంది. హాలీవుడ్ హీరో, ప్రొడ్యుసర్ బ్రాడ్‌పిట్ పేరుతో తన అకౌంట్‌‌కు ఓ ఫ్రెండ్ రిక్వెస్ట్ వచ్చింది. బ్రాడ్ ఫిట్ అన్నా ఫొటోలకు లైక్స్ కొట్టి, కవితలతో పొగిడే వాడు. అన్నాను పొగడ్తలు ముంచ్చెత్తేవాడు. దీంతో అన్నా బాగా ఇప్రెస్ అయ్యింది. ఆమెకు ఖరీదైన హ్యాండ్‌బ్యాగ్‌లు, నగలు గిఫ్ట్‌గా ఇచ్చేవాడు. అయితే, వాటి డెలివరీ, కస్టమ్స్ ఫీజులు కోసం అన్నా 5,000 యూరోలు తీసుకునేవాడు. ఎలాంటి డౌట్ లేకుండా అన్నా అతనికి డబ్బులు కొట్టింది.

Also Read: హమాస్‌- ఇజ్రాయెల్‌ మధ్య కాల్పుల విరమణ ఒప్పందం !

సడెన్‌గా ఓ రోజు బ్రాడ్ పిట్ అనారోగ్యానికి గురైయ్యానని, తనకు లంగ్ క్యాన్సర్ వచ్చిందని అన్నాతో చెప్పాడు. ఏంజెలీనా జోలీతో విడాకులు తీసుకున్నందకు అతని బ్యాంక్ బ్యాలెన్స్ ఫ్రీజ్ అయ్యాయని ఆమెతో చెప్పాడు. ఆపరేషన్ కోసం డబ్బులు కావాలని అన్నాను అడిగాడు. దీంతో అన్నా తన భర్తకు విడాకులు ఇచ్చి వచ్చిన భరణాన్ని బ్రాడ్ పిట్ ఆపరేషన్ కోసం ఇచ్చింది. అతని లంగ్ క్యాన్సర్ శస్త్రచికిత్స కోసం అన్నా 830,000 యూరోలు అంటే ఇండియన్ కరెన్సీలో రూ.7కోట్ల 36లక్షల 53వేలు 995 లు పంపింది. బ్రాడ్ పిట్ హాస్పిటల్లో బెడ్ మీద ఉన్న ఫొటోలు కూడా అన్నాకు పంపాడు. ఆపరేషన్‌కు హెల్ప్ చేసినందుకు ట్యాక్స్ చెప్పాడు. 

Also Read: నీ గూగుల్ సెర్చ్‌కు గత్తర రాను.. చావు తర్వాత ఏమిటని వెతికి..!

వాస్తవానికి బ్రాడ్ పిట్ ఇనెస్ డి రామన్ అనే మహిళతో డేటింగ్ చేస్తున్నాడని వార్తలు వచ్చాయి. ఆమెను బ్రాడ్ పిట్ డబ్బుల కోసం వాడుకున్నాడని అన్నాకు అర్థమైంది. అతను పంపిన ఫొటోలు అన్నీ AIతో క్రియేట్ చేసినవని తర్వాత తెలిసింది. ఆమె మోస పోయిందని తెలుసుకునే లోపే 830,000 యూరోలు స్కామ్‌కు గురైంది. పాపం అన్నా బిలియనీర్ భర్త నుంచి విడాకులు తీసుకుంటే వచ్చిన భరణం మొత్తం బ్రాడ్‌పిట్ కోసం ఖర్చు చేసింది.

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు