హెజ్బొల్లా కొత్త చీఫ్‌గా నయూం ఖాసీ.. ఇజ్రాయెల్ సంచలన వార్నింగ్ హెజ్బొల్లా కొత్త చీఫ్‌గా షేక్ నయూం ఖాసీం ఎంపికైన నేపథ్యంలో ఇజ్రాయెల్ మరో వార్నింగ్ ఇస్తూ కీలక ప్రకటన చేసింది. కొత్త చీఫ్‌గా బాధ్యతలు స్వీకరించిన నయీం ఖాసీంను కూడా హతం చేస్తామని ప్రకటించింది. ఇప్పటికే అతనికి కౌంట్‌డౌన్ మొదలైందని హెచ్చరించింది. By B Aravind 30 Oct 2024 in ఇంటర్నేషనల్ Latest News In Telugu New Update షేర్ చేయండి ఇజ్రాయెల్ ఇరాన్ మధ్య ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతూనే ఉన్నాయి. ఏ క్షణాన ఏ చోట బాంబులు పడతాయో అని ప్రజలు బిక్కుబిక్కుమంటు కాలం వెల్లదీస్తున్నారు. ఇటీవల హెబ్బొల్లా చీఫ్ హసన్ నస్రల్లా ఇజ్రాయెల్ చేసిన దాడిలో మరణించిన సంగతి తెలిసిందే. అయితే మంగళవారం హెజ్బొల్లా కొత్త చీఫ్‌గా షేక్ నయీం ఖాసీంను ఎంపికయ్యారు. హెజ్బొల్లా వ్యవస్థాపుకుల్లో ఖాసీం కూడా ఒకరు. ఈ నేపథ్యంలోనే ఇజ్రాయెల్ తాజాగా మరో వార్నింగ్ ఇస్తూ కీలక ప్రకటన చేసింది. Also Read: 500 ఏళ్ల తరువాత అక్కడ దీపావళి సంబరాలు నయీంను ఖతం చేస్తాం కొత్త చీఫ్‌గా బాధ్యతలు స్వీకరించిన నయీం ఖాసీంను కూడా హతం చేస్తామని ప్రకటించింది. ఇప్పటికే అతనికి కౌంట్‌డౌన్ మొదలైందని హెచ్చరించింది. మరోవైపు హెజ్బొల్లాకు చెందిన 80 శాతం ఆయుధాలను ఇప్పటికే ధ్వంసం చేశామని పేర్కొంది. యుద్ధానికి ముందు హెజ్బొల్లా వద్ద లక్షా 50 వేల రాకెట్లు, క్షిపణలు ఉండేవని.. ఇప్పడు అవి కేవలం 30 వేలు మాత్రమే ఉన్నాయని ప్రకటించింది. ఇజ్రాయెల్ ఈ వ్యాఖ్యలు చేయడం ప్రధాన్యం సంతరించుకుంది. ఇదిలాఉండగా.. ఇరాన్ సైనిక స్థావరాలు, క్షిపణి తయారీ కేంద్రాలే లక్ష్యంగా ఇజ్రాయెల్ ప్రతీకార దాడులు చేస్తూనే ఉంది. ఈ క్రమంలోనే ఇరాన్‌కు మరోసారి హెచ్చరికలు జారీ చేసింది. తమపై ప్రతిదాడులు చేస్తే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని చెప్పింది. అక్టోబర్ 1న ఇజ్రాయెల్‌పై దాదాపు 200 క్షిపణులతో ఇరాన్ దాడులు చేసిన సంగతి తెలిసిందే. దీంతో ఇరాన్ మూల్యం చెల్లించుకుంటుందని ఇజ్రాయెల్ హెచ్చరించింది. ఈ క్రమంలోనే ఇరాన్‌ను సంబంధించిన సైనిక స్థావరాలు, క్షిపణి తయారీ కేంద్రాలపై వైమానికి దాడులు చేస్తోంది. Also Read: ఇజ్రాయెల్ కొత్త స్కెచ్.. ఇదే జరిగితే యుద్ధం తప్పదా? మరోవైపు గాజాలో కూడా ఇజ్రాయెల్ కూడా భీకర దాడులు చేస్తోంది. తాజాగా జరిగిన దాడుల్లో మృతుల సంఖ్య 143కు చేరింది. మరోవైపు లెబనాన్ జరిపిన దాడుల్లో 77 మందికి పైగా చనిపోయినట్లు మీడియాలో వార్తలు వస్తున్నాయి. గతకొంతకాలంగా పశ్చిమాసియాలో ఉద్రిక్త పరిస్థితులు జరుగుతూనే ఉన్నాయి. రోజురోజుకి పరిస్థితులు ముదురుతున్నాయే తప్ప తగ్గడం లేదు. #telugu-news #israel #iran #israel iran war #middle east news మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి