Hamas : ఇజ్రాయెల్ భారీ సక్సెస్.. హమాస్ కొత్త చీఫ్ ఖతం!

హమాస్ మిలిటరీ విభాగానికి కమాండర్-ఇన్-చీఫ్‌గా వ్యవహరిస్తున్న అత్యంత కీలక నేత ఇజ్ అల్-దిన్ అల్-హద్దాద్ శుక్రవారం రాత్రి గాజా సిటీలో జరిగిన ఒక ఖచ్చితమైన వైమానిక దాడిలో మరణించారు.

New Update
hamas

మిడిల్ ఈస్ట్ లో తీవ్ర ఉద్రిక్తతల మధ్య ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్సెస్ సంచలన ప్రకటన చేసింది. హమాస్ మిలిటరీ విభాగానికి కమాండర్-ఇన్-చీఫ్‌గా వ్యవహరిస్తున్న అత్యంత కీలక నేత ఇజ్ అల్-దిన్ అల్-హద్దాద్ శుక్రవారం రాత్రి గాజా సిటీలో జరిగిన ఒక ఖచ్చితమైన వైమానిక దాడిలో మరణించినట్లు ఇజ్రాయెల్ అధికారికంగా వెల్లడించింది. హమాస్ సైతం ఈ విషయాన్ని అంగీకరిస్తూ అధికారిక ప్రకటన విడుదల చేసింది.

ఇజ్రాయెల్ రక్షణ వర్గాల సమాచారం ప్రకారం.. హద్దాద్ సాధారణ కమాండర్ కాదు. గత ఏడాది మేలో ఇజ్రాయెల్ దాడుల్లో మహమ్మద్ సినార్ మరణించిన తర్వాత, హమాస్ మిలిటరీ విభాగానికి చీఫ్‌గా హద్దాద్ పగ్గాలు చేపట్టాడు. 2023 అక్టోబర్ 7న ఇజ్రాయెల్‌పై జరిగిన రక్తాపాత దాడికి ప్రణాళికలు రచించిన చివరి అగ్రశ్రేణి ప్లానర్లలో ఇతను ఒకడు. అత్యంత రహస్యంగా ఉండే ఇతనికి ది ఘోస్ట్ అనే నిక్ నేమ్ కూడా ఉంది. గతంలో ఇజ్రాయెల్ ఇతనిపై జరిపిన ఆరు రకాల హత్యాయత్నాల నుండి తృటిలో తప్పించుకున్నాడు.

యుద్ధం ప్రారంభమైనప్పటి నుండి గాజాలో ఇజ్రాయెల్ బందీలను దాచిపెట్టి, వారిని పర్యవేక్షించే వ్యవస్థను హద్దాద్ స్వయంగా నడిపించాడని ఐడీఎఫ్ తెలిపింది. ఇజ్రాయెల్ వైమానిక దాడుల నుండి తనను తాను రక్షించుకోవడానికి ఇతను ఎప్పుడూ తన చుట్టూ ఇజ్రాయెల్ బందీలను హ్యూమన్ షీల్డ్స్ లాగా ఉంచుకునేవాడని రక్షణ వర్గాలు వెల్లడించారు.

ఇంటెలిజెన్స్ సమాచారంతో

ఇజ్రాయెల్ ప్రధాన మంత్రి నెతన్యాహు, రక్షణ మంత్రి ఇజ్రాయెల్ కాట్జ్ సంయుక్తంగా విడుదల చేసిన ప్రకటనలో.. గాజాలో శాంతిని నెలకొల్పడానికి, హమాస్ నిరాయుధీకరణ కోసం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ నేతృత్వంలో వచ్చిన అక్టోబర్ 2025 శాంతి ఒప్పందాన్ని హద్దాద్ తీవ్రంగా వ్యతిరేకించాడని, మళ్లీ ఇజ్రాయెల్ పౌరులపై దాడులకు వ్యూహాలు రచిస్తున్న తరుణంలోనే ఇంటెలిజెన్స్ సమాచారంతో ఈ దాడి చేసినట్లు తెలిపారు.

గాజా సిటీలోని అల్-రిమాల్ పరిసరాల్లో ఉన్న ఒక నివాస భవనంపై, దాని పక్కనే వెళ్తున్న వాహనంపై ఇజ్రాయెల్ యుద్ధ విమానాలు మూడు దాడులు చేశాయి. ఈ దాడుల్లో హద్దాద్‌తో పాటు అతని భార్య, 19 ఏళ్ల కుమార్తె సహా మొత్తం ఏడుగురు మరణించినట్లు పాలస్తీనా రెడ్ క్రాస్ హెల్త్ అధికారులు తెలిపారు. శనివారం గాజా సిటీలోని అల్-అక్సా మసీదులో వీరి అంత్యక్రియలు నిర్వహించారు. ఈ అగ్రనేత మరణంతో హమాస్ మిలిటరీ నెట్‌వర్క్ పూర్తిగా కుప్పకూలిందని రక్షణ రంగ నిపుణులు విశ్లేషిస్తున్నారు.

Advertisment
తాజా కథనాలు