Jag Vikram LPG tanker : ఇండియాకు గుడ్‌ న్యూస్‌..హార్మూజ్‌ను దాటిన భారత ఎల్‌పీజీ నౌక

అమెరికా. ఇరాన్ మధ్య కాల్పుల విరమణ ఒప్పందం కుదిరిన తర్వాత  ఎల్‌పీజీతో బయలుదేరిన భారత రిజిస్టర్డ్ నౌక జగ్ విక్రమ్ హార్మూ్‌జ్‌ జలసంధిని సురక్షితంగా దాటింది. శుక్రవారం రాత్రి నౌక జలసంధిని దాటినట్టు జాతీయ మీడియాలో కథనాలు వచ్చాయి.

New Update
FotoJet (37)

Jag Vikram LPG tanker

Jag Vikram LPG tanker : పశ్చిమాసియాలో నెలకొన్న యుద్ధ వాతావరణం మూలంగా ఇరాన్‌ హార్మూ్‌జ్‌ జలసంధి మీద ఆంక్షలు విధించిన విషయం తెలిసిందే. దీని కారణంగా ప్రపంచవ్యాప్తంగా పలు దేశాలకు ఇంధనం, ఎల్‌పీజీ నిలిచిపోయింది. అయితే ఇటీవల ఇరాన్‌, అమెరికా సీజ్‌ ఫైర్‌ ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా తొలిసారి ఒక భారత నౌక హార్మూజ్‌ను దాటింది. శుక్రవారం రాత్రి జలసంధిని దాటిన ఈ నౌక మరికొద్ది రోజుల్లో భారత్‌కు చేరుకుంటుందని అధికారులు వెల్లడించారు.

అమెరికా. ఇరాన్ మధ్య కాల్పుల విరమణ ఒప్పందం కుదిరిన తర్వాత  ఎల్‌పీజీతో బయలుదేరిన భారత రిజిస్టర్డ్ నౌక జగ్ విక్రమ్ హార్మూ్‌జ్‌ జలసంధిని సురక్షితంగా దాటింది. శుక్రవారం రాత్రి నౌక జలసంధిని దాటినట్టు జాతీయ మీడియాలో కథనాలు వచ్చాయి. దీంతో, యుద్ధం మొదలైన తర్వాత మార్చి నుంచి ఇప్పటివరకూ హార్మూ్‌జ్‌ను దాటిన భారత సరుకు రవాణా నౌకల సంఖ్య 9కి చేరినట్లయింది. వీటికి తోడు  ప్రస్తుతం పర్షియన్ గల్ఫ్ జలాల్లో మరో 15 భారత రిజిస్టర్డ్ నౌకలు వేచి ఉన్నట్లు తెలుస్తుంది. అన్ని రకాలుగా అనుమతులు లభిస్తే ఈ నౌకలు కూడా త్వరలో హార్మూ్‌జ్‌ను దాటనున్నట్టు అధికారులు వెల్లడించారు.

జాతీయ మీడియా కథనాల ప్రకారం, ఈ మధ్యహ్నం జగ్ విక్రమ్ నౌక హోర్ముజ్‌‌కు తూర్పున ఉన్న గల్ఫ్ ఆఫ్ ఒమాన్ జలాల్లో ప్రయాణం సాగిస్తోంది. ఈ నౌకలో సుమారు 20 వేల టన్నుల ఎల్‌పీజీ ఉన్నట్టు తెలుస్తోంది. ఈ నౌక ముంబై‌లోని గ్రేట్ ఈస్టర్న్ కంపెనీకి చెందింది. ఇది మధ్యస్థాయి సరుకు రవాణా సామర్థ్యం కలిగిన నౌక. ఇది మరికొన్ని రోజుల్లో భారత్‌కు చేరుకోనుంది.

కాగా, ఇరాన్‌, ఇజ్రాయెల్‌, అమెరికా వార్‌ మూలంగా గల్ఫ్‌లో ఉద్రిక్తతలు మొదలయ్యాయి.  నాటి నుంచీ అనేక దేశాలకు చెందిన నౌకలు హోర్ముజ్‌కు పశ్చిమాన ఉన్న పర్షియన్ గల్ఫ్‌ జలాల్లో నిలిచిఉన్నాయి. జగ్ విక్రమ్‌తో కంటే  రెండింతల సామర్థ్యం ఉన్న గ్యాస్ క్యారియర్లు కూడా ఈ నౌకల్లో ఉన్నాయి. ఇక ప్రస్తుతం పర్షియన్ గల్ఫ్‌లో నిలిచిపోయిన భారత నౌకల్లో ఒక ఎల్‌పీజీ ట్యాంకర్,ఒక కెమికల్ ఉత్పత్తుల ట్యాంకర్,  ఒక ఎల్‌ఎన్‌జీ క్యారియర్, మూడు కంటెయినర్ ట్యాంకర్లు, నాలుగు ముడి చమురు ట్యాంకర్లు, రెండు బల్క్ క్యారియర్లు ఉన్నట్లు తెలుస్తోంది. వీటితో పాటు కొన్ని ట్యాంకర్లకు రిపేర్లు కూడా జరుగుతున్నట్టు తెలుస్తోంది.

Advertisment
తాజా కథనాలు