Epstein files: వామ్మో.. ఎప్‌స్టీన్‌ మరణానికి ఒకరోజు ముందే అది జరిగిందా ? వెలుగులోకి సంచలన నిజాలు

లైంగిక నేరాలకు సంబంధించిన కేసులో అరెస్టయిన ఎప్‌స్టీన్‌.. 2019 ఆగస్టు 10న మృతి చెందిన సంగతి తెలిసిందే. జైల్లో ఉండగానే అతడు అనుమానస్పద స్థితిలో చనిపోయాడు. అయితే అతడు చనిపోవడానికి ఒకరోజు ముందే మరణ ప్రకటన తయారు చేసినట్లు అనుమానాలు వస్తున్నాయి.

New Update
Epstein Death Statement Was Drafted A Day Before He Died

Epstein Death Statement Was Drafted A Day Before He Died

ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా ఎప్‌స్టీన్‌ ఫైల్స్‌ వ్యవహారం సంచలనం రేపుతున్న సంగతి తెలిసిందే. దీనికి సంబంధించిన విషయాలు ఒక్కొక్కటి వెలుగులోకి వస్తున్నాయి. ఈ కేసులో ప్రధాన సూత్రధారి అయిన జెఫ్రీ ఎప్‌స్టీన్‌కు సంబంధించి తాజాగా ఓ సంచలన విషయం బయటపడింది. లైంగిక నేరాలకు సంబంధించిన కేసులో అరెస్టయిన ఎప్‌స్టీన్‌.. 2019 ఆగస్టు 10న మృతి చెందిన సంగతి తెలిసిందే. జైల్లో ఉండగానే అతడు అనుమానస్పద స్థితిలో చనిపోయాడు. అయితే అతడు చనిపోవడానికి ఒకరోజు ముందే మరణ ప్రకటన తయారు చేసినట్లు అనుమానాలు వస్తున్నాయి. 

Also Read: సుప్రీం లీడర్ అలీ ఖమేనీ సంచలనం.. 37 ఏళ్ల ఇరాన్ సంప్రదాయానికి బ్రేక్‌

అమెరికా న్యాయశాఖ తాజాగా రిలీజ్ చేసిన ఫైళ్లలో ఎప్‌స్టీన్ మరణించిన తేదీ తొమ్మిదిగా ఉండటం కలకలం రేపుతోంది. ఎప్‌స్టీన్‌ తన జైలు గదిలోనే ఉరేసుకుని సూసైడ్ చేసుకున్నాడని అప్పట్లోనే అధికారులు స్పష్టం చేశారు. అతడు అకస్మాత్తుగా మరణించడంతో అప్పటినుంచే ఈ వ్యవహారంపై అనేక అనుమానాలున్నాయి. ఆగస్టు 9న రాత్రి 10.30 గంటల సమయంలో ఆరెంజ్‌ కలర్‌ డ్రెస్‌లో ఉన్న ఓ వ్యక్తి ఎప్‌స్టీన్ ఉన్న జైలు గది వైపు వెళ్తున్నట్లు కొన్ని సీసీటీవి దృశ్యాలు బయటపడ్డాయి. అయితే ఆ కదులుతున్న వ్యక్తి ఖైదీ కావొచ్చని కొత్తగా విడుదలైన రికార్డులు పేర్కొన్నాయి. కానీ న్యాయశాఖ మాత్రం అతడు జైలు అధికారి అని చెబుతోంది. 

Also Read: జపాన్‌లో చరిత్ర సృష్టించిన తొలి మహిళా ప్రధాని.. చెప్పి మరీ కొట్టింది

అంతేకాదు ఎప్‌స్టీన్ చనిపోయాడని గుర్తించిన తర్వాత తీసిన ఫొటోలను సైతం తాజాగా బయటపెట్టారు. ఎప్‌స్టీన్ చనిపోయాడని గుర్తించిన 16 నిమిషాల తర్వాత స్ట్రెచర్‌పై ఉన్న అతడ్ని బతికించేందుకు డాకర్లు యత్నిస్తున్నట్లు ఓ ఫొటోలో కనిపించింది. ఆస్పత్రిలో అతడి మృతిని ధ్రువీకరించిన అనంతరం తీసిన ఫొటోల్లో పేరును తప్పుగా రాశారు. మొత్తానికి ఎవరైనా కుట్రకు పాల్పడి ఎప్‌స్టీన్‌ను హతమార్చి ఉంటారా అనే అనుమానాలు మరింత పెరుగుతున్నాయి. 

Advertisment
తాజా కథనాలు