భారత్‌లోకి స్టార్‌లింక్.. అంబానీకి చెక్ పెట్టనున్న ఎలాన్ మస్క్ ! ఎలాన్ మస్క్‌కు చెందిన శాటిలైట్ ఇంటర్నెట్ సేవల సంస్థ స్టార్‌లింక్ భారత్‌లో ప్రవేశానికి రెడీ అవుతోంది. ఇండియాలో ఎంట్రీ ఇచ్చిన వెంటనే అది అంబానీ కంపెనీ జియో నెట్‌కు చెక్ పెడుతుందన్న విశ్లేషణలు ఇప్పటినుంచే మొదలయ్యాయి. By B Aravind 23 Oct 2024 in ఇంటర్నేషనల్ నేషనల్ New Update షేర్ చేయండి ఎలాన్ మస్క్.. ముఖేశ్ అంబానీ.. ఇద్దరికి ఇద్దరే.. బిజినెస్ ఏదైనా నో కాంప్రమైజ్ అంతే..! అయితే ఈ ఇద్దరూ ఒకరిని ఒకరు ఢీకోంటే ఎలా ఉంటుందని ఎప్పుడైనా ఆలోచించారా? అది త్వరలోనే నిజం కాబోతోంది. మస్క్ ఇండియాలోకి ఎంట్రీ ఇవ్వనున్నాడు. ఆయన శాటిలైట్ ఇంటర్నెట్ సేవల సంస్థ స్టార్‌లింక్ భారత్‌లో ప్రవేశానికి రెడీ అవుతోంది. స్టార్‌లింక్‌కు లైసెన్స్‌లు అల్‌మోస్ట్ వచ్చేసినట్టే కనిపిస్తోంది. తమ ఇంటర్‌నెట్ సేవలను గ్రామీణ, మారుమూల ప్రాంతాల్లో నివసించే ప్రజలకు ప్రయోజనం చేకూర్చేలా ఉంటాయని గతంలోనే మస్క్ కంపెనీ ప్రకటించింది. అయితే స్టార్‌లింక్ ఇండియాలో ఎంట్రీ ఇచ్చిన వెంటనే అది అంబానీ కంపెనీ జియో నెట్‌కు చెక్ పెడుతుందన్న విశ్లేషణలు ఇప్పటినుంచే మొదలయ్యాయి. ప్రపంచంలోని అత్యంత ధనవంతులైన మస్క్, ముఖేష్ అంబానీల మధ్య పోటీ తీవ్రమవుతున్న సందర్భం ఇది. బ్రాడ్‌బ్యాండ్ కోసం శాటిలైట్ స్పెక్ట్రమ్‌ను వేలం ద్వారా కాకుండా పరిపాలనాపరంగా కేటాయిస్తామని భారత ప్రభుత్వం గత వారం ప్రకటించిన తర్వాత ఈ పోరు మరింత వేడెక్కింది. అయితే స్టార్‌లింక్‌కు ఎర్త్ స్టేషన్‌లను ఏర్పాటు చేయడానికి ఇండియన్ నేషనల్ స్పేస్ ప్రమోషన్ అండ్ ఆథరైజేషన్ సెంటర్ నుంచి అనుమతి కూడా అవసరం. Also Read: రెచ్చిపోయిన ఉగ్రవాదులు.. టర్కీలో భారీ పేలుడు మారుమూల ప్రాంతాలకు ఇంటర్నెట్ స్టార్‌లింక్ అనేది మస్క్ నేతృత్వంలోని సంస్థ స్పెస్X అందించిన ఉపగ్రహ ఇంటర్నెట్ సేవ. భూగర్భ కేబుల్స్ లేదా మొబైల్ టవర్లపై ఆధారపడే సాంప్రదాయ ఇంటర్నెట్ ప్రొవైడర్ల లాగా కాదు. స్టార్‌లింక్ వినియోగదారులకు ఇంటర్నెట్‌ని అందించడానికి భూమి చుట్టూ తిరిగే ఉపగ్రహాల నెట్‌వర్క్‌ను ఉపయోగిస్తుంది. స్టార్‌లింక్ ప్రధాన లక్ష్యం రిమోట్ లేదా మంచి బ్రాడ్‌బ్యాండ్ ఆప్షన్స్ లేని ప్రాంతాలకు హై-స్పీడ్ ఇంటర్నెట్‌ను అందించడం. అంటే భారత్‌లోని గ్రామీణ ప్రాంతాలకు ఇంటర్నెట్ సదుపాయం కలిగించడం. ఇది నిజంగా గ్రామీణ ప్రాంతాలకు వరంగా మారుతుందని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. అత్యంత వేగంతో సేవలు స్టార్‌లింక్ వినియోగదారులు సాధారణంగా 25 నుంచి 220 Mbps మధ్య డౌన్‌లోడ్ వేగాన్ని పొందుతారు. చాలా మంది వినియోగదారులు 100 Mbps కంటే ఎక్కువ వేగాన్ని కూడా పొందవచ్చు. అటు అప్‌లోడ్ వేగం సాధారణంగా 5 నుంచి 20 Mbps మధ్య ఉంటుంది. ఇప్పటికీ చాలా గ్రామాల్లో టవర్లు లేదా ఆప్టికల్ ఫైబర్ లాంటి సాంప్రదాయ ఇంటర్నెట్ సదుపాయాల లేవు. అలాంటి మారుమూల ప్రాంతాల్లోని వినియోగదారులకు ఈ టెక్నాలజీ ఎంతో ఉపయోగపడనుంది.స్టార్‌లింక్ అనేది వేలకొద్దీ ఉపగ్రహాల సముదాయం. ఇవి గ్రహం చుట్టూ భూమికి చాలా దగ్గరగా ఉంటాయి. దాదాపు 550 కిలోమీటర్ల దూరంలో మాత్రమే తిరుగుతాయి. మొత్తం భూగోళాన్ని కవర్ చేస్తాయి. స్టార్‌లింక్ ఉపగ్రహాలు తక్కువ కక్ష్యలో ఉండడం కారణంగా వినియోగదారులకు సిగ్నల్ చేరే జాప్యం చాలా తక్కువగా ఉంటుంది. ఇక స్టార్‌లింక్‌ని యాక్సెస్ చేయడానికి, వినియోగదారులు శాటిలైట్ డిష్, Wi-Fi రూటర్, అవసరమైన అన్ని కేబుల్‌లను కలిగి ఉన్న ప్రత్యేక కిట్‌ను కొనుగోలు చేయాలి. అయితే ఈ సెటప్ అంతా చాలా ఈజీగా ఉంటుందట!. Also Read: కేటీఆర్‌కు బిగ్ షాక్.. అట్రాసిటీ కేసు నమోదు ! స్టార్‌లింక్ ఇప్పటికే యునైటెడ్ స్టేట్స్, కెనడా, యునైటెడ్ కింగ్‌డమ్, జర్మనీ, ఫ్రాన్స్, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్‌తో సహా అనేక దేశాలలో అందుబాటులో ఉంది. ఇది తన సేవలను స్పెయిన్, ఇటలీ, మెక్సికోలకు విస్తరించింది. అటు లాటిన్ అమెరికాలో స్టార్‌లింక్ ఉపగ్రహ ఇంటర్నెట్ సేవల నుంచి ప్రయోజనం పొందిన తొలి దేశంగా చిలీ నిలిచింది. ఇటు స్కాండినేవియా దేశాల్లోని నార్వే, స్వీడన్‌లో కూడా స్టార్ లింక్ అందుబాటులో ఉంది. ఇప్పుడు ఇండియాలో కూడా అన్ని అనుకున్నట్టుజరిగితే ఎయిర్‌టెల్, జియోకు స్టార్ లింక్ నుంచి గట్టి పోటీ ఎదురుకావడం పక్కా! #telugu-news #elon-musk #amabni మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి