కాల్పులు జరిగిన చోటుకే మళ్లీ రానున్న ట్రంప్‌.. అతిథిగా ఎలాన్ మస్క్

ఈ ఏడాది జులైలో పెన్సిల్వేనియాలో నిర్వహించిన ఓ ప్రచార సభలో ట్రంప్‌పై కాల్పులు జరిగిన సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడు అదే ప్రాంతంలో ట్రంప్‌ మరోసారి సభను నిర్వహించనున్నారు. ఈ సభకు ప్రపంచ కుబేరుడు ఎలాన్‌ మస్క్‌ కూడా హాజరుకానుండటం విశేషం.

New Update
trump and musk

నవంబర్ 5న అమెరికా అధ్యక్ష ఎన్నికలు జరగనున్నాయి. మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్.. డెమోక్రటిక్ పార్టీ నుంచి అధ్యక్ష బరిలోకి దిగిన కమలా హారిస్‌ మధ్య గట్టి పోటీ నెలకొంది. ఈ ఏడాది జులైలో పెన్సిల్వేనియాలో నిర్వహించిన ఓ ప్రచార సభలో ట్రంప్‌పై కాల్పులు జరిగిన సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడు అదే ప్రాంతంలో ట్రంప్‌ మరోసారి సభను నిర్వహించనున్నారు. ఈ సభకు ప్రపంచ కుబేరుడు ఎలాన్‌ మస్క్‌ కూడా రానున్నారు. ఈ విషయాన్ని తానే స్వయంగా ప్రకటించారు. ' ఐ యామ్ కమింగ్ బ్యాక్ టు బట్లర్' అంటూ ట్రంప్‌ తన ఎక్స్‌ ఖాతాలో పోస్ట్ చేశారు. ఈ పోస్టుకు ఎలాన్ మస్క్‌ రీ పోస్టు చేశారు. నేను మీకు మద్ధతుగా అక్కడ ఉంటానని పేర్కొన్నారు.  

Also Read: యువతకు కేంద్రం శుభవార్త.. నెలకు రూ.5 వేలు.. ఇలా అప్లై చేయండి!

ఇదిలాఉండగా.. జులైలో పెన్సిల్వేనియాలోన బట్లర్‌లో ట్రంప్ ప్రచార సభ నిర్వహించారు. ప్రజలనుద్దేశించి ట్రంప్ ప్రసంగిస్తున్న సమయంలో థామస్ మాథ్యూ క్రూక్స్ అనే యువకుడు ట్రంప్‌పై కాల్పులు జరిపాడు. ఈ దాడిలో ట్రంప్ కుడి చెవి పైభాగం నుంచి బుల్లె్ట్ దూసుకెళ్లింది. అక్కడున్న సీక్రెట్ సర్వీస్ సిబ్బంది ఆయన్ని కాపాడారు. తనపై కాల్పులు జరిగిన ప్రాంతంలోనే మళ్లీ ర్యాలీ నిర్వహిస్తానని ట్రంప్ గతంలోనే ప్రకటించారు. ఇటీవల ఫ్లోరిడాలో కూడా ట్రంప్ గోల్ఫ్ ఆడుతుండగా.. ఆయనపై హత్యాయత్నం జరిగింది. ఫెన్సింగ్ నుంచి ఓ నిందితుడు తుపాకితో రావడంతో భద్రతా సిబ్బంది ఆయన్ని గమనించారు. వెంటనే నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. అమెరికా అధ్యక్ష ఎన్నికలపై ప్రపంచ దేశాలు ఆసక్తిగా ఎదురుచూస్తున్నాయి. ఈసారి ఎవరు అధ్యక్ష పీఠాన్ని అధిరోహిస్తారనే దానిపై ఆసక్తి నెలకొంది. 

Advertisment
Advertisment
తాజా కథనాలు