BIG BREAKING: బ్యాంకాక్‌లో భారీ భూకంపం.. నేలమట్టమైన భవనాలు

థాయ్‌లాండ్ రాజధాని బ్యాంకాక్‌లో శుక్రవారం భారీ భూకంపం సంభవించింది. ఒక్కసారిగా భూమి కుదుపులకు గురవ్వడంతో ప్రజలు భయంతో ఇళ్ల నుంచి పరుగులు తీశారు. రిక్టర్ స్కేల్‌పై 7.3 తీవ్రత నమోదైంది. 10 కి.మీ లోతులో భూకంప కేంద్ర ఉందని సెంటర్ ఫర్ జియోసైన్సెస్ తెలిపింది.

New Update
Earthquake in Bangkok

Earthquake in Bangkok Photograph: (Earthquake in Bangkok)

థాయ్‌లాండ్ రాజధాని బ్యాంకాక్‌లో శుక్రవారం భారీ భూకంపం సంభవించింది. ఒక్కసారిగా భూమి కుదుపులకు గురవ్వడంతో ప్రజలు భయంతో ఇళ్ల నుంచి పరుగులు తీశారు. రిక్టర్ స్కేల్‌పై 7.3 తీవ్రత నమోదైంది. భూమి కంపించి బిల్డింగ్స్ ఊగిపోయాయి. బహుళ అంతస్తు బిల్డింగ్ నేలమట్టమైంది. చుట్టుపక్కల జనం భయంతో రోడ్లమీదికి పరుగులు తీశారు. జర్మనీకి చెందిన GFZ సెంటర్ ఫర్ జియోసైన్సెస్ శుక్రవారం మధ్యాహ్నం భూకంపం సంభవించిదని ప్రకటించింది.

Also read: Mosquitoes: మనిషి రక్తాన్ని విషంగా మార్చి.. దోమల్ని చంపే ప్రయోగంలో సైంటిస్టులు సక్సెస్

ఇళ్లల్లో గోడలు పగుళ్లుబారాయి. రాట్చబురి ప్రావిన్స్‌లోని మైమార్‌లో 7.4 తీవ్రతతో భూకంపం సంభవించింది. బ్యాంకాక్ మరియు సెంట్రల్ థాయిలాండ్ అంతటా ప్రకంపనలు సంభవించాయి. భూఉపరితలం నుంచి 10 కిలోమీటర్ల లోతులో భూకంప కేంద్రం ఉందని తెలిపారు. పొరుగున ఉన్న మయన్మార్‌లో భూకంప కేంద్రం ఉందని తాత్కాలిక నివేదికలు చెబుతున్నాయి. మయన్మార్‌లో కూడా భూమి కంపించింది. ప్రాథమికంగా ఎలాంటి నష్టం జరిగిందని సమాచారం లేదు. పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.

Also read: Microplastics: బ్రెయిన్‌లో ప్లాస్టిక్ చెంచా.. డేంజర్ జోన్‌లో చూయింగ్‌గమ్ తినేవాళ్లు!

 

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

BREAKING: ఒకేరోజు ఇండియా, పాకిస్థాన్‌లో భూకంపాలు

పాకిస్థాన్ బలూచిస్థాన్, ఇండియాలోని అరుణాచల్ ప్రదేశ్, మేఘాలయ రాష్ట్రాల్లో భూకంపం సంభవించింది. మధ్యాహ్నం 2 గంటలకు అరుణాచల్ ప్రదేశ్‌లోని 3.5 తీవ్రతతో భూమి కంపించింది. ఈరోజు సాయంత్రమే బలూచిస్థాన్‌లో 4.6 తీవ్రతతో మరో భూకంపం సంభవించింది.

New Update
Earthquakes

భారత్‌తోపాటు చుట్టుపక్కల దేశాల్లో వరుస భూకంపాలు వణుకు పుట్టిస్తున్నారు. ప్రజలను భయాందోళనకు గురి చేస్తున్నాయి. సోమవారం పాకిస్థాన్‌లోని బలూచిస్థాన్, ఇండియాలోని మేఘాలయా, అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రాల్లో భూమి కంపించింది. మధ్యాహ్నం 2 గంటలకు భారత్‌లోని అరుణాచల్ ప్రదేశ్‌లోని 3.5 తీవ్రతతో భూమి కంపించింది. ఈరోజు సాయంత్రమే బలూచిస్థాన్‌లో మరో భూకంపం సంభవించింది. రెక్టర్ స్కేల్‌పై దీని తీవ్రత 4.6గా నమోదైంది.

Also read: PM Modi: ‘మరో 5 నెలల్లో ప్రధాని పదవికి మోదీ రాజీనామా.. తర్వాత ఎవరో RSS నిర్ణయం’

శాస్త్రవేత్తలు బలూచిస్థాన్‌కు 65 కిలో మీటర్ల దూరంలో భూకంప కేంద్రాన్ని గుర్తించారు. ఇటీవల మయన్మార్, థాయ్‌లాండ్, చైనా భారత్‌లోని మేఘాలయ, కోల్‌కత్తా, ఢిల్లీలో భూకంపం సంభవించిన విషయం తెలిసిందే. అంతేకాదు త్వరలో ఇండియాలో భారీ భూకంపం సంభవించే అవకాశం ఉందని కూడా సైంటిస్టులు హెచ్చరిస్తున్నారు.

Advertisment
Advertisment
Advertisment