Donald Trump: భారత ప్రధాని గ్రేట్.. మోదీపై పొగడ్తల వర్షం కురిపించిన ట్రంప్

భారత ప్రధాని నరేంద్ర మోదీపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌ ప్రశంసల వర్షం కురిపించారు. అమెరికా ఈ ఏడాది జరుపుకోనున్న 250వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల నేపథ్యంలో.. ఢిల్లీలోని అమెరికా రాయబార కార్యాలయం ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహించింది.

New Update
Modi trump

Modi trump

భారత ప్రధాని నరేంద్ర మోదీపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌ ప్రశంసల వర్షం కురిపించారు. అమెరికా ఈ ఏడాది జరుపుకోనున్న 250వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల నేపథ్యంలో.. ఢిల్లీలోని అమెరికా రాయబార కార్యాలయం ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహించింది. ప్రస్తుతం భారత పర్యటనలో ఉన్న అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో ఆధ్వర్యంలో జరిగిన ఈ వేడుకలో.. ట్రంప్ నేరుగా ఫోన్ కాల్ ద్వారా లైవ్‌లోకి వచ్చి భారతీయులను ఉద్దేశించి ప్రసంగించారు. ఈ సందర్భంగా మోదీపై ఆయన ప్రశంసంల వర్షం కురిపించారు. 

ఇది కూడా చూడండి: Bengaluru : ఘోరం: డిజిటల్ అరెస్ట్ పేరుతో వృద్ధురాలికి రూ.24 కోట్ల టోకరా!

మోదీపై ట్రంప్ ప్రశంసల వర్షం..

మోదీపై తనకున్న అభిమానాన్ని చాటుకున్నారు. భారత ప్రధాని మోదీ అంటే నాకు చాలా ఇష్టం. ఆయన చాలా గొప్ప నాయకుడు మాత్రమే కాదు.. నాకు అత్యంత సన్నిహిత మిత్రుడు. నేను మోదీకి చాలా పెద్ద అభిమాని అని అన్నారు. గతంలో కంటే ఇప్పుడు భారత్-అమెరకా దేశాలు చాలా దగ్గరయ్యాయని ట్రంప్ తెలిపారు. భారత్ ఏ అవసరం కోసమైనా.. సహాయం కోసమైనా 100 శాతం అమెరికాపై ఆధారపడవచ్చన్నారు. ఆ నమ్మకాన్ని తాము తప్పకుండా నిలబెట్టుకుంటామని హామీ ఇచ్చారు. ఏదైనా సమస్య వస్తే ఎవరికి ఫోన్ చేయాలో భారత నాయకత్వానికి తెలుసంటూ ఇరు దేశాల మధ్య ఉన్న దౌత్యపరమైన చొరవను ట్రంప్ మళ్లీ గుర్తుచేశారు.

ఇది కూడా చూడండి: ఫల్తా రీపోలింగ్‌.. లక్ష ఓట్ల తేడాతో BJP విక్టరీ!

అమెరికా ప్రస్తుతం ప్రపంచంలోనే అత్యంత బలమైన ఆర్థిక వ్యవస్థగా ఎదుగుతోందని ట్రంప్ అన్నారు. భారత్ అభివృద్ధికి కావాల్సిన ప్రతి విషయంలోనూ తాము అండగా ఉంటామని చెప్పారు. భారత్ ఏది కావాలనుకుంటే అది దక్కుతుందని ట్రంప్ తెలిపారు. విదేశాంగ మంత్రి మార్కో రూబియోపై కూడా ట్రంప్ ప్రశంసలు కురిపించారు. అమెరికా చరిత్రలోనే రూబియో అత్యంత గొప్ప విదేశాంగ మంత్రి అని కొనియాడారు.

ఇది కూడా చూడండి: Nandamuri Balakrishna: తెలుగు ఇండస్ట్రీపై బాలకృష్ణ ఫైర్.. నంది అవార్డులపై భారీ ప్రకటన!

అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో ఒక కీలక ప్రకటన చేశారు. భారత్-అమెరికా మధ్య ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందం కుదుర్చుకునే ప్రక్రియ తుది దశకు చేరుకుందని వెల్లడించారు. ఈ ఒప్పందం ఖరారైతే రెండు దేశాల జాతీయ ప్రయోజనాలకు ఎంతో మేలు జరుగుతుందని.. ఆర్థికంగా రెండు దేశాలు మరింత బలోపేతం అవుతాయని ఆశాభావం వ్యక్తం చేశారు. 

ఇది కూడా చూడండి: Gwalior : ట్విస్ట్‌ల మీద ట్విస్ట్‌లు.. ఇన్‌స్టాగ్రామ్ క్రియేటర్ పాలక్ డెత్ మిస్టరీ!

Advertisment
తాజా కథనాలు