China : చైనా సాయంతో అమెరికా స్థావరాలపై ఇరాన్ నిఘా!

మధ్యప్రాచ్యంలో జరుగుతున్న యుద్ధంలో ఇరాన్ సరికొత్త ఎత్తుగడలు వేస్తోంది. అమెరికా సైనిక స్థావరాలను లక్ష్యంగా చేసుకోవడానికి ఇరాన్, చైనా తయారు చేసిన ఒక రహస్య గూఢచారి శాటిలైట్‌ను వాడుకున్నట్లు తాజాగా ఒక పరిశోధనలో తేలింది.

New Update
iran (1)

మధ్యప్రాచ్యంలో జరుగుతున్న యుద్ధంలో ఇరాన్ సరికొత్త ఎత్తుగడలు వేస్తోంది. అమెరికా సైనిక స్థావరాలను లక్ష్యంగా చేసుకోవడానికి ఇరాన్, చైనా తయారు చేసిన ఒక రహస్య గూఢచారి శాటిలైట్‌ను వాడుకున్నట్లు తాజాగా ఒక పరిశోధనలో తేలింది.ఇరాన్ తన సైనిక కార్యకలాపాల కోసం 'TEE-01B' అనే చైనా ఉపగ్రహాన్ని వినియోగించుకుంది. ఈ శాటిలైట్ ద్వారా అమెరికాకు చెందిన విమాన వాహక నౌకలు, సైనిక స్థావరాల కదలికలను ఇరాన్ ఎప్పటికప్పుడు కనిపెడుతోంది. ఈ ఉపగ్రహాన్ని ఇరాన్ మిలిటరీ విభాగానికి చెందినఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ కార్ప్స్ (IRGC) రహస్యంగా కొనుగోలు చేసినట్లు కొన్ని లీకైన పత్రాల ద్వారా తెలుస్తోంది.

ఈ శాటిలైట్ సాయంతో సౌదీ అరేబియా, జోర్డాన్, బహ్రెయిన్, ఇరాక్, కువైట్‌లలో ఉన్న అమెరికా సైనిక స్థావరాలను ఇరాన్ నిశితంగా గమనించింది. మార్చి నెలలో జరిగిన క్షిపణి దాడులకు ముందు, తర్వాత కూడా ఈ ప్రాంతాల ఫోటోలను ఇరాన్ సేకరించినట్లు ఆధారాలు ఉన్నాయి. ముఖ్యంగా సౌదీ అరేబియాలోని ప్రిన్స్ సుల్తాన్ ఎయిర్ బేస్ ఫోటోలను ఈ శాటిలైట్ తీయగా, అక్కడ నిలిపి ఉంచిన ఐదు అమెరికా ఇంధన విమానాలు దెబ్బతిన్నాయని మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ధృవీకరించడం గమనార్హం. కేవలం సైనిక స్థావరాలే కాకుండా గల్ఫ్ దేశాల్లోని ఓడరేవులు, విద్యుత్ కేంద్రాలు,  పరిశ్రమలపై కూడా ఈ ఉపగ్రహం కన్నేసి ఉంచింది.

ఈ శాటిలైట్ కోసం ఇరాన్ దాదాపు 36 మిలియన్ డాలర్లు (సుమారు 250 మిలియన్ చైనా యువాన్లు) ఖర్చు చేసినట్లు సమాచారం. ఇది గతంలో ఇరాన్ వద్ద ఉన్న ఉపగ్రహాల కంటే ఎంతో శక్తివంతమైనది. పాత శాటిలైట్లు భూమిపై ఉన్న వస్తువులను స్పష్టంగా చూపించలేకపోయేవి, కానీ ఈ కొత్త చైనా శాటిలైట్ అర మీటరు పరిమాణంలో ఉండే వస్తువులను కూడా అత్యంత స్పష్టంగా ఫోటో తీయగలదు. దీనివల్ల ఏ బేస్‌లో ఎన్ని విమానాలు ఉన్నాయి, ఎక్కడెక్కడ సైనికులు ఉన్నారో ఇరాన్ సులభంగా తెలుసుకోగలుగుతోంది. చైనాకు చెందిన ఎర్త్ ఐ అనే కంపెనీ దీన్ని తయారు చేయగా, ఎంపోశాట్ అనే సంస్థ దీనికి కావాల్సిన సాంకేతిక సహాయాన్ని అందిస్తోంది.

తీవ్రంగా ఖండించిన చైనా

అయితే ఈ ఆరోపణలను చైనా తీవ్రంగా ఖండించింది. ఇరాన్‌కు తాము ఎలాంటి సైనిక సాయం చేయడం లేదని, ఇవన్నీ కల్పిత కథలని చైనా విదేశాంగ శాఖ స్పష్టం చేసింది. ఒకవేళ ఈ నెపంతో అమెరికా తమపై కొత్త పన్నులు విధిస్తే తాము కూడా గట్టిగా బదులిస్తామని హెచ్చరించింది. మరోవైపు, ఇరాన్ తన సొంత శాటిలైట్ కేంద్రాలను ఇజ్రాయెల్ దాడుల నుండి రక్షించుకోవడానికే ఇలా చైనా సాయం తీసుకుంటోందని నిపుణులు విశ్లేషిస్తున్నారు. చైనాలోని కేంద్రాలను ఇజ్రాయెల్ లేదా అమెరికా నేరుగా కొట్టలేవు కాబట్టి, ఇరాన్ తెలివిగా చైనా సాంకేతికతను వాడుకుంటోంది. ఈ పరిణామాలు ఇప్పుడు అమెరికాకు కొత్త తలనొప్పిగా మారాయి.

Advertisment
తాజా కథనాలు