/rtv/media/media_files/2026/06/15/deepti-sharma-2026-06-15-13-04-36.jpg)
Deepti Sharma
Deepti Sharma : ఐసీసీ మహిళల టీ20 ప్రపంచకప్ 2026లో టీమిండియా స్టార్ ఆల్‌రౌండర్ దీప్తి శర్మ సరికొత్త ప్రపంచ రికార్డుతో చరిత్ర సృష్టించింది. ప్రత్యర్థి పాకిస్థాన్‌తో జరిగిన హై-వోల్టేజ్ మ్యాచ్‌లో అద్భుత ఆల్‌రౌండ్ ప్రదర్శనతో భారత్‌కు భారీ విజయాన్ని అందించడమే కాకుండా, మహిళల టీ20 క్రికెట్ చరిత్రలోనే అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా అగ్రపీఠాన్ని కైవసం చేసుకుంది.
Champions play like champions.🔥#DeeptiSharma shines with a brilliant 5-fer as the World Champions begin their campaign with a commanding victory over Pakistan. 🇮🇳👊🏻
— Star Sports (@StarSportsIndia) June 14, 2026
[ #T20WorldCup, #INDvsPAK, #TeamIndiaWomen, #RichaGhosh, #SmritiMandhana ] pic.twitter.com/hhbgLCpyjA
ఐసీసీ మహిళా టీ20 వరల్డ్ కప్ 2026లో టీమిండియా ఘనవిజయం సాధించింది. నిన్న పాకిస్థాన్‌తో జరిగిన హోరాహోరీ పోరులో భారత్ 64 పరుగుల భారీ తేడాతో ఘన విజయాన్ని అందుకుంది. ఈ విజయంతో పాటు భారత్‌కు మరో చిరస్మరణీయమైన క్షణం దక్కింది. టీమిండియా స్టార్ ఆల్‌రౌండర్ దీప్తి శర్మ బౌలింగ్‌లో ఐదు వికెట్లతో చెలరేగి ప్రపంచ రికార్డును తన పేరిట లిఖించుకుంది. బ్యాటింగ్‌లో విలువైన పరుగులు చేయడంతో పాటు, బౌలింగ్‌లో ఐదు వికెట్లు, ఫీల్డింగ్‌లో ఒక రనౌట్ చేసి మ్యాచ్ విన్నర్‌గా నిలిచిన దీప్తి శర్మకు 'ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్' అవార్డు దక్కింది.
ప్రపంచంలోనే నంబర్ 1 బౌలర్‌గా దీప్తి శర్మ
పాకిస్థాన్‌తో జరిగిన ఈ మ్యాచ్‌లో ఐదు వికెట్ల ప్రదర్శన (Five-wicket haul) నమోదు చేయడం ద్వారా మహిళల అంతర్జాతీయ టీ20 క్రికెట్‌లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా దీప్తి శర్మ (166 వికెట్లు) ప్రపంచ రికార్డు సృష్టించింది. గతంలో 165 వికెట్లతో అగ్రస్థానంలో ఉన్న థాయ్‌లాండ్‌కు చెందిన తిపాట్చా పుట్టావాంగ్‌ను దీప్తి రెండో స్థానానికి నెట్టేసింది. ఈ జాబితాలో రువాండాకు చెందిన హెన్రిట్టే ఇష్విమే (160) మూడో స్థానంలో, ఆస్ట్రేలియాకు చెందిన మేగన్ షట్ (152) నాలుగో స్థానంలో, థాయ్‌లాండ్‌కు చెందిన ఒన్నిచా కమ్‌చోఫూ (148) ఐదో స్థానంలో కొనసాగుతున్నారు.
జులన్ గోస్వామి రికార్డుకు అడుగు దూరంలో..
కేవలం టీ20ల్లోనే కాకుండా, అంతర్జాతీయంగా అన్ని ఫార్మాట్లు (టెస్టులు, వన్డేలు, టీ20లు) కలిపి అత్యధిక వికెట్లు తీసిన మహిళా క్రికెటర్ల జాబితాలోనూ దీప్తి శర్మ సరికొత్త మైలురాయిని అందుకుంది. ప్రస్తుతం ఆమె 354 వికెట్లతో ప్రపంచంలోనే రెండో స్థానంలో కొనసాగుతోంది. భారత మాజీ దిగ్గజ బౌలర్ జులన్ గోస్వామి 355 వికెట్లతో మొదటి స్థానంలో ఉండగా, ఆమె రికార్డును సమం చేయడానికి దీప్తికి కేవలం ఒకే ఒక్క వికెట్ అవసరం. ఈ జాబితాలో ఇంగ్లండ్‌కు చెందిన కేథరిన్ బ్రంట్ (335) మూడో స్థానంలో, ఆస్ట్రేలియాకు చెందిన ఎలీస్ పెర్రీ (332) నాలుగో స్థానంలో ఉన్నారు.
Patience. Belief. Performance. 💙#DeeptiSharma shares the mindset behind her match-winning spell. 🎙️
— Star Sports (@StarSportsIndia) June 14, 2026
Watch her next on ICC Women’s #T20WorldCup 2026 👉 #INDvNED | WED, 17th June, 6 PM! pic.twitter.com/FxJ6mmb9BY
హనుమాన్ జీ ఆశీస్సులు, జట్టు కృషి వల్లే ఈ విజయం: దీప్తి శర్మ
మ్యాచ్ అనంతరం ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు అందుకున్న దీప్తి శర్మ తన సంతోషాన్ని పంచుకుంటూ.. "ఈ గెలుపు క్రెడిట్ మొత్తం నా జట్టుకే చెందుతుంది. నా ఈ విజయానికి హనుమాన్ జీ ఆశీస్సులు కూడా ముఖ్య కారణం. నాకు ఐసీసీ టోర్నమెంట్లు అంటే ఎప్పుడూ ప్రత్యేకమే, ఇలాంటి పెద్ద వేదికలపై ఆడటం నాకు ఎంతో ఇష్టం. ముఖ్యంగా స్పిన్నర్లకు అనుకూలించే పిచ్‌లపై బౌలింగ్ చేయడాన్ని బాగా ఆస్వాదిస్తాను. ప్రతి బంతికి వేగాన్ని మారుస్తూ, బ్యాటర్లను ఇబ్బంది పెట్టే సరైన లైన్ అండ్ లెంగ్త్‌లో బంతులు వేయడమే నా విజయ రహస్యం" అని వెల్లడించింది. దీప్తి శర్మ సాధించిన ఈ అరుదైన ప్రపంచ రికార్డుపై సోషల్ మీడియా వేదికగా భారత క్రికెట్ అభిమానులతో పాటు పలువురు మాజీ క్రికెటర్లు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.
Follow Us