/rtv/media/media_files/2025/03/12/enSAJwX4kLn2Ag3igexD.jpg)
Coward Pakistan accuses India of involvement in Balochistan train hijack
పాకిస్థాన్‌లో బలూచ్ లిబరేషన్ ఆర్మీ(BLA) రైలును హైజాక్ చేయడం సంచలనం రేపిన సంగతి తెలిసిందే. 182 మంది ప్రయాణికులను మిలిటెంట్లు బందీలుగా తీసుకెళ్లారు. రంగంలోకి దిగిన పాక్ ఆర్మీ 104 మంది ప్రయాణికులను రక్షించారు. అలాగే 16 మంది ఉగ్రవాదులను కూడా హతమార్చినట్లు తెలిపారు. బలోచిస్థాన్ ప్రావిన్సులోని పర్వతప్రాంతమైన క్వెట్టా నుంచి ఖైబర్ పఖ్తుంఖ్వా ప్రావిన్సులోని పెషావర్‌కు వెళ్తున్న జాఫర్ ఎక్స్‌ప్రెస్‌ను మిలిటెంట్లు హైజాక్ చేశారు.
అయితే తాజాగా పాకిస్థాన్ ఈ ఘటనపై విచిత్ర వాదన చేస్తోంది. ఆ దేశ ప్రధాని షాబాజ్ షరీఫ్ రాజకీయ సలహాదారు రాణా సనావుల్లా మాట్లాడుతూ.. ట్రైన్ హైజాక్‌కు భారత్ సహరించిందంటూ ఆరోపించారు. రైలును హైజాక్ చేసేందుకు BLA, తెహ్రిక్ ఈ తాలిబన్ పాకిస్థాన్ (TTP)కు భారత్ సాయం చేసిందని అన్నారు. అక్కడి వార్తా సంస్థతో మాట్లాడూతూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.
Also Read: కుక్క కరిచిందని గొంతు కోసుకున్న వ్యక్తి.. ఆపరేషన్ థియేటర్‌లో ఏరులై పారిన నెత్తురు!
న్యూస్ యాంకర్.. టీటీడీ, బీఎల్‌ఏ ఉగ్రవాదుల మధ్య ఏదైనా సంబంధం ఉందా అని సనావుల్లాను ప్రశ్నించారు. దీనికి ఈయన స్పందిస్తూ.. అవునని తెలిపారు. భారత్ ఈ రెండు గ్రూపులకు మద్దతిస్తోందని అన్నారు. అలాగే ఈ మిలిటెంట్లకు అఫ్ఘానిస్థాన్ సురక్షితమైన స్వర్గధామంగా ఉందని పేర్కొన్నారు. తాలిబన్లు రాకముందు వాళ్లు ఇలాంటి దాడులు చేయలేకపోయారని.. ఇప్పుడు వాళ్ల కార్యకలాపాలు పెరిగిపోయాయని తెలిపారు. ఇలాంటివి అన్నీ ఆపేయాలని మేము ఇప్పటికే అఫ్ఘానిస్థాన్‌కు చెప్పామని.. లేకుంటే వాళ్లనే మేము లక్ష్యంగా చేసుకుంటామంటూ వార్నింగ్ ఇచ్చారు.
کیا ٹی ٹی پی کے خوارج اور بی ایل اے کے دہشتگردوں کے آپس میں nexus ہیں ؟ عادل شاہ زیب
— Adil Shahzeb (@adilshahzeb) March 11, 2025
جی ان دونوں کی backing انڈیا کر رہا ہے اور ان کو افغانستان جیسی safe heaven دستیاب ہے۔ افغانستان میں ان کو کمین گاہیں دستیاب ہونے سے ان کی کاروائیوں میں اضافہ ہوا ہے ۔ یہ کمین گاہیں طالبان کے… pic.twitter.com/HTAXd1IUMi
ఇదిలాఉండగా మంగళవారం ఉదయం 9 గంటలకు రైలు క్వెట్టా నుంచి పెషావర్‌కు జాఫర్ ఎక్స్‌ప్రెస్ బయలుదేరింది. మొత్తం 400 మంది ప్రయాణిస్తున్న రైలుపై మిలిటెంట్లు దాడులకు పాల్పడ్డారు. రైలు మార్గంలో మొత్తం 17 సొరంగాలు ఉండగా.. 8వ సొరంగం వద్ద మిలిటెంట్లు రైల్వే ట్రాక్‌ను పేల్చేశారు. ఆ తర్వాత రైలును తమ నియంత్రణలోకి తెచ్చుకున్నారు. ట్రైన్ హైజాక్ తామే చేశామని ప్రకటించింది. దీంతో వెంటనే పాకిస్థాన్ ప్రభుత్వం అప్రమత్తమైంది. ట్రైన్ హైజాక్ అయిన చోటుకి భద్రతా బలగాలను పంపించింది.
Also Read: ఆన్‌లైన్ గేమ్ మోసానికి 17 ఏళ్ల బాలుడు బలి.. ఫోన్‌కు ఫోరెన్సిక్ పరీక్ష!
మంగళవారం ఉదయం 9 గంటలకు బయలుదేరింది. మొత్తం 400 మంది ప్రయాణిస్తున్న ఈ రైలుపై మిలిటెంట్లు దాడికి తెగబడ్డారు. రైలు మార్గంలో 17 సొరంగాలు ఉండగా.. 8వ సొరంగం వద్ద మిలిటెంట్లు ట్రాక్‌ను పేల్చి జాఫర్ ఎక్స్‌ప్రెస్‌ను తమ నియంత్రణలోకి తీసుకున్నారు. బలోచ్ లిబరేషన్ ఆర్మీ (బీఎల్‌ఏ) ఈ దాడి తామే చేశామని ప్రకటించింది. వెంటనే అప్రమత్తమైన పాక్ ప్రభుత్వం ట్రైన్ హైజాక్ అయిన చోటుకి భద్రతా బలగాలను పంపించి ప్రయాణికులను రక్షించేందుకు ఆపరేషన్ చేపట్టింది. ఇప్పటివరకు104 మంది ప్రయాణికులను పాక్ ఆర్మీ రక్షించారు. మిగిలిన వాళ్లని రక్షించేందుకు ఆపరేషన్ కొనసాగుతోంది.