/rtv/media/media_files/2026/04/01/war-on-iran-2026-04-01-13-59-26.jpg)
ఇరాన్-ఇజ్రాయెల్ యుద్ధం ప్రపంచ దేశాల మధ్య దశాబ్దాలుగా ఉన్న స్నేహాన్ని ముక్కలు చేస్తోంది. అగ్రరాజ్యం అమెరికా చరిత్రలో ఎన్నడూ లేని విధంగా తన మిత్రదేశాల నుంచే తీవ్ర వ్యతిరేకతను ఎదుర్కొంటోంది. అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీసుకుంటున్న ఏకపక్ష నిర్ణయాలు, యుద్ధ కాంక్షతో అటు ఆర్థికంగా, ఇటు వ్యూహాత్మకంగా అమెరికా ఒంటరిగా మారుతోంది. ఈ యుద్ధం వల్ల ఇప్పటివరకు అమెరికాకు రూ. 2.63 లక్షల కోట్లకు పైగా ఖర్చయింది. ఇరాన్ తన అస్తిత్వం కోసం పోరాడుతోంది. ఈ 'ఎపిక్ ప్యూరీ' విధ్వంసం ఎప్పుడు ఆగుతుందో, ప్రపంచ శాంతి ఎప్పుడు పునరుద్ధరించబడుతుందో తెలియక యావత్ ప్రపంచం ఆందోళనతో ఎదురుచూస్తోంది.
1. హార్ముజ్ జలసంధిపై ఇరాన్ పట్టు
ప్రపంచ చమురు సరఫరాలో 20% వాటా కలిగిన 'హార్ముజ్ జలసంధి'ని ఇరాన్ అదుపులోకి తీసుకోవడం అంతర్జాతీయంగా పెను సంచలనంగా మారింది. మిడిల్ ఈస్ట్ నుండి వచ్చే ఆయిల్ అంతా ఈ మార్గం ద్వారానే వెళ్లాల్సి ఉండటంతో ప్రపంచ దేశాలు ఇబ్బందుల్లో పడ్డాయి. ఈ పరిస్థితిని ఇరాన్ తనకు అనుకూలంగా మార్చుకుంటోంది. తమ జలాల గుండా వెళ్లే నౌకలపై భారీగా ట్యాక్స్ వసూలు చేయాలని నిర్ణయించింది. అమెరికా, ఇజ్రాయెల్ నౌకలకు ప్రవేశం నిరాకరిస్తూనే, ఇతర దేశాల నుంచి ఆర్థికంగా లాభం పొందాలని ఇరాన్ చూస్తోంది.
2. ట్రంప్‌పై మిత్రదేశాల తిరుగుబాటు
యుద్ధాన్ని కోరి తెచ్చుకున్నారంటూ ట్రంప్‌పై నాటో సభ్య దేశాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. నాటో చరిత్రలో ఎన్నడూ లేని విధంగా అమెరికా ఒంటరిగా మిగిలిపోయింది. స్పెయిన్, ఫ్రాన్స్, ఇటలీ వంటి దేశాలు అమెరికా యుద్ధ విమానాలకు తమ ఎయిర్‌స్పేస్‌ను నిరాకరించాయి. తమ భూభాగంలోని ఆర్మీ బేస్‌లను వాడుకోవద్దని స్పష్టం చేశాయి. మిత్రదేశాల తీరుపై అసహనం వ్యక్తం చేసిన ట్రంప్.. "మీ రక్షణ మీరే చూసుకోండి" అంటూ నాటో నుంచి తప్పుకుంటానని హెచ్చరించారు. ప్రతి దేశం తమ GDPలో 5% రక్షణ కోసం ఖర్చు చేయాలన్న ట్రంప్ నిబంధన ఈ చీలికను మరింత పెంచింది.
3. గ్రీన్‌ల్యాండ్ వివాదం.. ప్రత్యేక సైనిక కూటమి!
గ్రీన్‌ల్యాండ్‌పై ట్రంప్ అనుసరిస్తున్న వైఖరి కూడా నాటో దేశాలకు మింగుడు పడటం లేదు. ఫలితంగా, అమెరికాపై ఆధారపడకుండా యూరప్ దేశాలు తమ కోసమే ఒక ప్రత్యేక సైనిక కూటమిని ఏర్పాటు చేసుకునే దిశగా అడుగులు వేస్తున్నాయి. ఇది అమెరికా ప్రపంచాధిపత్యానికి చావుదెబ్బ వంటిదని విశ్లేషకులు భావిస్తున్నారు.
4. రష్యా, చైనాలకు వరం
నాటో పతనం అంచుకు చేరడం, అమెరికా-యూరప్ మధ్య విభేదాలు పెరగడం రష్యా, చైనాలకు సానుకూలంగా మారుతున్నాయి. అమెరికాను నమ్మలేమని ప్రపంచ దేశాలు భావిస్తున్న తరుణంలో, గ్లోబల్ పవర్ సెంటర్ అటువైపు మొగ్గు చూపే అవకాశం ఉంది. మొత్తానికి, ట్రంప్ చర్యల వల్ల అమెరికా తన పాత మిత్రులను కోల్పోవడమే కాకుండా, ప్రపంచ ఆర్థిక వ్యవస్థను కూడా ప్రమాదంలోకి నెట్టేసింది. ఈ సంక్షోభం ఎటు దారితీస్తుందోనని యావత్ ప్రపంచం ఆందోళన చెందుతోంది.
5. గ్రీన్ ఎనర్జీ వైపు మళ్లుతున్న ప్రపంచం
క్రూడ్ ఆయిల్ కోసం గల్ఫ్ కంట్రీపై ఆధారపడ్డ శ్రీలంక, బంగ్లాదేశ్, భారత్ దేశాల్లో ఆర్థిక వ్యవస్థ ప్రమాదంలో పడింది. ఆయా దేశాల్లో పెట్రోల్, గ్యాస్, ఎరువుల ధరలు పెరిగాయి. దీంతో ఆయా దేశాలు చమురు సంక్షోభం నుంచి బయటపడటానికి ప్రపంచ దేశాలు ప్రత్యామ్నాయ ఇంధనాల వైపు వేగంగా అడుగులు వేస్తున్నాయి. సౌర శక్తి, విండ్ ఎనర్జీ, ఎలక్ట్రిక్ వాహనాల (EV) ప్రాధాన్యత పెరిగింది. యుద్ధం వల్ల కలిగే ఆర్థిక నష్టాన్ని తట్టుకోవడానికి ఇది ఏకైక మార్గమని అనేక దేశాలు గుర్తించాయి.
6.సైబర్ యుద్ధం
ఆపరేషన్ ఎపిక్ ప్యూరీ కేవలం క్షిపణులకే పరిమితం కాలేదు. రెండు దేశాల మధ్య తీవ్రమైన సైబర్ యుద్ధం జరుగుతోంది. ప్రభుత్వ వెబ్‌సైట్లు, బ్యాంకింగ్ వ్యవస్థలు, విద్యుత్ గ్రిడ్లపై హ్యాకర్లు దాడులు చేస్తున్నారు. దీనివల్ల డిజిటల్ భద్రతపై ప్రపంచ దేశాలు భారీగా పెట్టుబడులు పెడుతున్నాయి.
Follow Us