చైనా డ్యామ్‌తో మానవాళికి ముప్పు.. హెచ్చరిస్తున్న శాస్త్రవేత్తలు

ప్రపంచంలోనే అతి పెద్దదైన చైనాకి చెందిన త్రీ గోర్జెస్ డ్యామ్‌ వల్ల మానవాళికి ప్రమాదం పొంచి ఉందని బ్రిటన్‌ శాస్త్రవేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దీనివల్ల భూ గమనంలో మార్పులు జరుగుతున్నాయని హెచ్చరిస్తున్నారు. మరింత సమాచారం కోసం ఈ ఆర్టికల్ చదవండి.

New Update
China Dam

China Three Gorges Dam: చైనాలో ఉన్న త్రీ గోర్జెస్ డ్యామ్‌ ప్రపంచంలోనే అతిపెద్దది. ఈ డ్యామ్‌ వల్ల మానవాళికి ప్రమాదం పొంచి ఉందని బ్రిటన్‌ శాస్త్రవేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తుండటం కలకలం రేపుతోంది. దీనివల్ల భూ గమనంలో మార్పులు జరుగుతున్నాయని.. ఇది ఏ మాత్రం మంచిది కాదని హెచ్చరిస్తున్నారు. ఇక వివరాల్లోకి వెళ్తే.. చైనాలోని యాంగ్జీ నదిపై దాదాపు 2.33 కిలోమీటర్ల పొడవు, 181 మీటర్ల ఎత్తులో త్రీగోర్జెస్‌ డ్యామ్‌ను నిర్మించారు. అయితే ఇది అందుబాటులోకి వచ్చాక యాంగ్జి నదిలో పెద్ద మొత్తంలో నీరు నీల్వ ఉండటం వల్ల భూ పరిభ్రమణ వేగం 0.06 మైక్రో సెకండ్ల వరకు తగ్గిపోయిందని అప్పట్లో శాస్త్రవేత్తలు గుర్తించారు. అలాగే సూర్యుడి నుంచి భూమి దురం కూడా 2 సెంటిమీటర్ల వరకు దూరం జరిగిందని పేర్కొన్నారు. ప్రస్తుతం ఈ డ్యామ్‌ ప్రభావం ఇంకా పెరుగుతోందని సైంటిస్టులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

Also Read: సూసైడ్ పాడ్ సాయంతో మహిళ ఆత్మహత్య.. చివరికి

 వాస్తవానికి భూమిపై పెద్ద మొత్తంలో ఏమైనా మార్పులు జరిగితే అప్పుడు దాని ప్రభావం భూ గమనంపై పడుతుంది. ఇదే విషయాన్ని అమెరికాకి చెందిన అంతరిక్ష పరిశోధనా సంస్థ 'నాసా' కూడా ఇదే విషయాన్ని చెబుతోంది. 2004లో హిందూ మహా సముద్రంలో భూకంపం వచ్చి సునామీ వచ్చింది. అప్పుడు భూ గమనంలో మార్పులు జరగడం స్పష్టంగా కనిపించింది. దీని ప్రభావం వల్ల రోజు నిడివి దాదాపు 2.68 మైక్రో సెకండ్లు తగ్గింది. ఇప్పుడు ఇలాంటి పరిస్థితే చైనాలో ఉన్న త్రీ గోర్జెస్‌ డ్యామ్‌ వల్ల కూడా జరుగుతోందని శాస్త్రవేత్తలు అంటున్నారు.   

త్రీ గోర్జెస్‌ డ్యామ్‌కు మూడు నదుల నుంచి నీరు వస్తుంది. దాదాపు 10 ట్రిలియన్‌ గ్యాలన్ల నీరు డ్యామ్‌లో స్టోర్‌ అవుతోంది. ఇంత భారీగా ఒకేచోట నీరు నిల్వ ఉండటం భూమిపై ప్రభావం చూపిస్తోంది. అంతరిక్ష నుంచి చూస్తే సాధారణంగా కంటికి కనిపించే అతి తక్కువ కట్టడాల్లో ఈ డ్యామ్‌ కూడా ఉంది. ఈ డ్యామ్ నుంచి 22,500 మెగావాట్ల జల విద్యుత్తు ఉత్పత్తి అవుతుంది. ప్రపంచంలోనే అతిపెద్ద మూడు అణు విద్యుత్‌ కేంద్రాల ఉత్పత్తికి ఈ డ్యామ్‌ దాదాపు సమానంగా ఉంది. మరో విషయం ఏంటంటే ఈ డ్యామ్‌లో పెద్ద మొత్తంలో నీరు నిల్వ ఉండటం వల్ల భూమి అడుగున ఒత్తిడి పెరిగి భూకంపాలు వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి. 

Also Read: జపాన్‌ను దాటేసిన భారత్..మూడో శక్తివంతమైన దేశంగా ఎదుగుదల

త్రీ గార్జెస్ ప్రాజెక్టు పనులను 1994లో ప్రారంభించారు. 2006లో ఇవి పూర్తయ్యాయి. చైనా ప్రభుత్వం.. కేవలం డ్యామ్‌ నిర్మాణం కోసం 114 పట్టణాలను, 1,680 గ్రామాలను సైతం నేలమట్టం చేసింది. ఇందుకు ప్రత్యామ్నాయంగా 14 లక్షల మందికి పునరావాసం కల్పించింది. అయితే యాంగ్జీ నదికి వరదలు వచ్చిప్పుడల్లా ప్రతిసారీ లక్షలాది మంది నిరాశ్రయులు అవుతున్నారు. ఒకవేళ వరద ప్రభావం పెరిగి ఈ డ్యామ్‌కు ఏదైనా ప్రమాదం జరిగితే దిగువ ప్రాంతాలకు వినాశనం తప్పదని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

Advertisment
Advertisment
తాజా కథనాలు