China: కండోమ్‌ల పేరుతో.. 63 హోటళ్లను మోసం చేసిన యువకుడు..

చైనాకి చెందిన ఓ యువకుడు కాలేజీ అడ్మిషన్ కోసం ఏకంగా 63 హోటళ్లను మోసం చేశాడు. హోటల్ గదుల్లో బొద్దింకలు, మురికి కండోమ్‌లు ఉన్నాయంటూ.. వారిని బ్లాక్ మెయిల్ చేసి నష్టపరిహారం తీసుకున్నాడు. చివరకిి హోటల్ సిబ్బంది మోసాన్ని గుర్తించడంతో విషయం వెలుగులోకి వచ్చింది.

New Update
Hotels

హోటళ్లలో బస చేసి వారి సర్వీసులు బాలేదని డబ్బులు పరిహారంగా తీసుకున్న ఘటన చైనాలో చోటుచేసుకుంది. కాలేజీ అడ్మిషన్ కోసం డబ్బులు లేకపోవడంతో ఓ యువకుడు ఏకంగా 63 హోటళ్లలను మోసం చేశాడు. జియాంగ్ అనే 21 ఏళ్ల యువకుడు హోటళ్లకు వెళ్లేవాడు. అక్కడ గదుల్లో బొద్దింక, విరిగిన జుట్టు, కండోమ్‌లు వంటివి పడేసేవాడు.

ఇది కూడా చూడండి: రైతు బంధు బంద్.. హరీష్ రావు ఫైర్!

కొన్ని నెలల నుంచి..

వీటిని వీడియో తీసి హోటల్ యాజమాన్యానికి చూపించి ఫిర్యాదు చేస్తానని, వైరల్ చేస్తానని బెదిరించేవాడు. ఉచితంగా స్టే లేదా నష్ట పరిహారం ఇవ్వాలని లేకపోతే సోషల్ మీడియాలో అప్‌లోడ్ చేస్తామని వారిని మోసం చేశాడు. ఇలా మొత్తం 63 హోటళ్లను మోసం చేసి డబ్బు కాజేసుకున్నాడు. ఇలా కొన్ని నెలల నుంచి హోటళ్లలో ఉంటూ మోసం చేస్తున్నాడు. చివరికి ఓ హోటల్‌లో కూడా ఇలా చేస్తుంటే అక్కడ పనిచేస్తున్న సిబ్బంది చెప్పడంతో ఈ విషయం బయటకు వచ్చింది.

ఇది కూడా చూడండి: చెన్నై ఎయిర్‌పోర్టు మూసివేత.. ఎందుకో తెలుసా ?

ఈ హోట్‌లో పనిచేస్తున్న సిబ్బంది.. గతంలో ఓ హోటల్‌లో పనిచేస్తున్నప్పుడు కూడా ఇదే ఘటన జరిగింది. దీంతో ఆ సిబ్బంది హోటల్ యాజమాన్యానికి తెలపగా.. ఆ యువకుడు బ్యాగ్ అన్ని చెక్ చేశారు. దీంతో అతని బ్యాగ్‌లో మురికి కండోమ్‌లు, బొద్దింకలు అన్ని కనిపించాయి. దీంతో ఆ హోటల్ యాజమాన్యం పోలీసులకు ఫిర్యాదు చేశారు. 

ఇది కూడా చూడండి: బిగ్ ట్విస్ట్ ! పృథ్వీ, నబీల్ ఎలిమినేటెడ్.. టాప్ 5 వీళ్ళే

చైనాలో వేర్వేరు ప్రదేశాల్లో గత కొన్ని రోజుల నుంచి హోటళ్లను బ్లాక్ మెయిల్ చేశాడని పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో వెంటనే పోలీసులు జియాంగ్‌ను అరెస్ట్ చేశారు. అలాగే హోటళ్లను మోసం చేసి కాజేసిన డబ్బు రూ.4.3 లక్షలను పోలీసులు సేకరించారు. 

ఇది కూడా చూడండి: నాగ చైతన్య - శోభిత మధ్య అన్నేళ్ల ఏజ్ గ్యాప్ ఉందా?

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

India-China: ట్రంప్‌ టారిఫ్‌ దెబ్బకి మెరుగుపడుతున్న భారత్-చైనా సంబంధాలు

ట్రంప్ టారిఫ్‌ల వల్ల స్టాక్ మార్కెట్లు పతనమవుతున్నాయి. కానీ భారత్, చైనా మధ్య సంబంధాలు మెరుగుపడుతున్నాయి. గతంతో పోలిస్తే ఇరు దేశాల సంబంధాలు మెరుగుపడ్డాయని విదేశాంగ శాఖ మంత్రి జై శంకర్ వెల్లడించారు.

New Update
Jai shankar

Jai shankar

ట్రంప్ టారిఫ్‌ల వల్ల స్టాక్ మార్కెట్లు పతనమవుతున్నాయి. కానీ భారత్-చైనా సంబంధాలు మాత్రం బలపడే దిశగా వెళ్తున్నాయి. తాజాగా ఇరుదేశాల సంబంధాలపై విదేశాంగ శాఖ మంత్రి జై శంకర్ స్పందించారు. ఆ సంబంధాలు సానుకూల దిశ వైపు పయనిస్తున్నాయన్నారు. గతంతో పోలిస్తే ఇరు దేశాల సంబంధాలు మెరుగుపడ్డాయని.. వీటిని సాధారణ స్థితికి తెచ్చేందుకు ఎంతో కృషి చేయాల్సి ఉందని అన్నారు. 

Also Read: ట్రంప్ టారిఫ్‌లు వేస్తే మోదీ ఎందుకు మౌనంగా ఉంటున్నారు.. రాహుల్‌గాంధీ ఫైర్

ఇదిలాఉండగా 202-0 లో తూర్పు లడఖ్‌లోని గల్వాన్‌ లోయలో ఇరు దేశాల జవాన్ల మధ్య ఘర్షణలు చెలరేగిన సంగతి తెలిసిందే. ఆ సమయంలో భారత్-చైనా మధ్య సంబంధాలు దిగజారిపోయాయి. అనంతరం సైనిక, దౌత్యపరంగా చర్చలు జరగడం, గస్తీ ఒప్పందం కుదిరిన సంగతి తెలిసిందే. ఈ ఒప్పందం ప్రకారం 2020లో గస్తీ నిర్వహించిన పెట్రోలింగ్ పాయింట్లకు ఇరుదేశాలకు స్వేచ్ఛగా వెళ్లొచ్చు .  

Also Read: రేవ్ పార్టీలో అడ్డంగా బుక్కైన ఆర్మీ, రాజకీయ నేతల కూతుర్లు.. వీడియో వైరల్ 

ఇటీవల చైనాపై అమెరికా అధ్యక్షుడు ట్రంప్ 108 శాతం టారిఫ్‌లు ప్రకటించిన సంగతి తెలిసిందే. దీంతో తాజాగా చైనా కూడా అమెరికాపై 84 శాతం సుంకాలు విధించింది. దీంతో ట్రేడ్ వార్‌ మరింత ముదిరింది. ఇదిలాఉండగా.. న్యూఢిల్లీలోని చైనా ఎంబసీ అధికార ప్రతినిధి యూ జింగ్ టారిఫ్‌ల స్పందించారు. అమెరికా టారిఫ్‌ సవాళ్లను ఎదుర్కొనేందుకు భారత్, చైనా జత కట్టాలన్నారు. పరస్పర సహకారం, ప్రయోజనాలపై ఇరు దేశాల మధ్య ఆర్థిక, వాణిజ్యం సంబంధాలు ఆధాపడి ఉన్నాయన్నారు. అమెరికా విధించిన టారిఫ్‌ల వల్ల అనేక దేశాలు, ముఖ్యంగా పేద దేశాలు అభివృద్ధి పొందే హక్కును కోల్పోతున్నాయని చెప్పారు. ఇలాంటి కఠిన పరిస్థితుల నుంచి బయటపడేందుకు మన ఇరు దేశాలు కలిసి ఎదుర్కోవాలన్నారు. 

Also read: Viral video: రన్నింగ్ ట్రైన్‌ కిటికీలో ఇరుక్కున్న దొంగ.. కిలోమీటర్ ఈడ్చుకెళ్లిన ప్యాసింజర్

telugu-news | rtv-news 

Advertisment
Advertisment
Advertisment