Trump : ట్రంప్‌కు బిగ్‌షాక్‌..ఇరాన్ -పాకిస్తాన్ మధ్య సీక్రేట్ డీల్స్ ?

ఇజ్రాయెల్ మీడియా సంస్థ ‘C14’ పాకిస్తాన్, ఇరాన్ దేశాల మధ్య జరిగిన ఒక సంచలన రహస్య ఒప్పందాన్ని (టేబుల్ కింద డీల్) బయటపెట్టింది. అమెరికా, ఇరాన్‌ మధ్య నెరపుతున్న మధ్య వర్తిత్వ శాంతి ఒప్పందాన్ని పాక్ ఒక వ్యాపారంగా వాడుకుంటోందని వెల్లడించింది.

New Update
FotoJet - 2026-05-21T175401.196

Pakistan-Iran

 Trump : ఇజ్రాయెల్ మీడియా సంస్థ ‘C14’ పాకిస్తాన్, ఇరాన్ దేశాల మధ్య జరిగిన ఒక సంచలన రహస్య ఒప్పందాన్ని (టేబుల్ కింద డీల్) బయటపెట్టింది. లీకైన నివేదికల ప్రకారం.. పాకిస్తాన్ తన దేశ ఆర్థిక దివాళా స్థితిని  పోగొట్టుకోవడానికి అమెరికా, ఇరాన్‌ మధ్య నెరపుతున్న మధ్య వర్తిత్వ శాంతి ఒప్పందాన్ని ఒక వ్యాపారంగా వాడుకుంటోంది. ఇందులో భాగంగా ఇరాన్, పాకిస్తాన్ ప్రధాని షాబాజ్ షరీఫ్ - ఆర్మీ చీఫ్ అసిమ్ మునీర్ కూటమికి ఒక పెద్ద టాస్క్ అప్పగించింది. దీని కోసం పాకిస్తాన్ ఏకంగా తమకు ఆర్థిక సాయం చేసే అమెరికా వెన్నుపోటు పొడిచేందుకు కూడా సిద్ధపడింది.

పాకిస్తాన్ పాలకులు తమ దేశాన్ని అంతర్జాతీయంగా మరింత అవమానపరిచేలా ప్రవర్తిస్తున్నారు. షాబాజ్ షరీఫ్, అసిమ్ మునీర్, మొహసిన్ నఖ్వీలు తమ స్వార్థం కోసం దేనికైనా సిద్ధపడుతున్నారు. రెండు పెద్ద దేశాల మధ్య ‘మధ్యవర్తి’ (రాయబారి) పాత్రను కూడా పాకిస్తాన్ తన ఆర్థిక కష్టాలను తీర్చుకునే వ్యాపారంగా మార్చుకుంది. గత కొన్ని రోజులుగా అమెరికా, ఇరాన్ దేశాలు తమను పదే పదే తిరస్కరిస్తున్నప్పటికీ.. పాకిస్తాన్ ఆ దేశాల కాళ్లు పట్టుకోవడానికి ప్రయత్నిస్తుండటం వెనుక అసలు రహస్యం ఇప్పుడే బయటపడింది. ‘పీస్ టేబుల్ కింద’ ఇరాన్‌తో పాకిస్తాన్ కుదుర్చుకున్న సీక్రెట్ డీల్ లీక్ అవ్వడంతో అంతర్జాతీయ వేదికపై పాకిస్తాన్ పరువు మరోసారి గంగలో కలిసింది.

ఇజ్రాయెలీ మీడియా ‘C14’ క్లెయిమ్ ప్రకారం.. పాకిస్తాన్ ఈ శాంతి ఒప్పందాన్ని ఎలాగైనా సరే త్వరగా పూర్తి చేయాలని చూస్తోంది. దీని వెనుక ప్రపంచ శాంతిని కాపాడాలనే మంచి ఉద్దేశం ఏమాత్రం లేదు, కేవలం పాక్ స్వంత లాభం మాత్రమే ఉంది. ప్రస్తుతం పాకిస్తాన్ తీవ్రమైన ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. ఇరాన్, పాకిస్తాన్ మధ్య జరిగిన రహస్య ఒప్పందం ప్రకారం.. అమెరికా ముందు ఇరాన్‌కు లాభం చేకూర్చేలా ఒక ‘సీజ్‌ఫైర్ డీల్’ (కాల్పుల విరమణ ఒప్పందం) కుదిర్చడంలో పాకిస్తాన్ సహాయం చేయాలి. దీనికి బదులుగా.. అమెరికాతో ఒప్పందం కుదిరిన వెంటనే ఇరాన్‌పై ఉన్న కఠినమైన అంతర్జాతీయ ఆంక్షలు తొలగిపోతాయి. అప్పుడు ఇరాన్‌కు సంబంధించిన బిలియన్ల డాలర్ల ఫ్రీజ్ అయిన ఫండ్స్ (నిధులు) విడుదలవుతాయి. అలా విడుదలైన భారీ మొత్తంలో నుండి ఒక పెద్ద భాగాన్ని ఇరాన్ పాకిస్తాన్‌కు బహుమతిగా ఇస్తుంది. ఆ డబ్బుతో పాకిస్తాన్ తనకున్న విదేశీ అప్పులను తీర్చుకోవాలని ప్లాన్ వేసింది.

ప్రస్తుతం పశ్చిమాసియా (Middle East) లో శాంతి ఒప్పందాల పేరుతో ఒక హై-వోల్టేజ్ డ్రామా నడుస్తోంది. ఇరాన్, అమెరికా దేశాలు నిరంతరం కొత్త శాంతి ప్రతిపాదనలు సిద్ధం చేయడం, మళ్లీ వాటిని తిరస్కరించడం చేస్తున్నాయి. ఏదో ఒక నెపంతో కాల్పుల విరమణ గడువును పెంచుకుంటూ పోతున్నారే తప్ప, వారి అసలు పోరాటం మాత్రం ముగియడం లేదు. మరోవైపు ఈ ఉద్రిక్తతల వల్ల ‘స్ట్రైట్ ఆఫ్ హోర్ముజ్’ (Hormuz) మూతపడటంతో ప్రపంచవ్యాప్తంగా చమురు కొరత ఏర్పడింది. ఈ యుద్ధంతో ఎలాంటి సంబంధం లేకపోయినప్పటికీ ప్రపంచవ్యాప్తంగా ఉన్న సామాన్య ప్రజలు చమురు ధరల పెరుగుదల వల్ల భారీగా నష్టపోతున్నారు. ఈ పరిస్థితుల మధ్య ఆర్థికంగా ఎందుకు పనికిరాని పాకిస్తాన్ లాంటి దేశం ఇరాన్-అమెరికా మధ్య శాంతి చర్చలు జరుపుతామంటూ రంగంలోకి దిగి పదే పదే విఫలమవుతోంది. ఒకవేళ పాక్ కుయుక్తులు పారితే మాత్రం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కు ఇది కోలుకోలేని పెద్ద షాక్ అవుతుందని విశ్లేషకులు భావిస్తున్నారు.

Advertisment
తాజా కథనాలు