/rtv/media/media_files/2025/01/31/2uoCwwor1Z9GFQ62NhzK.jpg)
Donald Trump
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కు కోర్టులో ఊరట లభించింది. విదేశాల నుంచి అమెరికాకు దిగుమతి అయ్యే వస్తువులపై ట్రంప్ ప్రభుత్వం విధించిన 10 శాతం అదనపు సుంకాలను వాషింగ్టన్‌లోని ఫెడరల్ సర్క్యూట్ అప్పీల్స్ కోర్టు సమర్థించింది. ఈ తీర్పుతో సుంకాలను వసూలు చేసే ప్రక్రియను యథావిధిగా కొనసాగించేందుకు ట్రంప్‌కు అవకాశం కల్పించింది. గతేడాది భారత్‌తో సహా పలు దేశాల నుంచి దిగుమతి అయ్యే వస్తువులపై ట్రంప్ ప్రభుత్వం భారీగా పన్నులు విధించింది. దీనిపై వచ్చిన వ్యతిరేకతతో సుప్రీంకోర్టు ఒకసారి వీటిని కొట్టివేసింది. అయితే ట్రంప్ ప్రభుత్వం వదలకుండా 'ట్రేడ్ యాక్ట్ 1974' లోని సెక్షన్ 122ను ఉపయోగించి జులై 24 వరకు అమల్లో ఉండేలా తాత్కాలికంగా 10 శాతం సుంకాలను మళ్లీ విధించింది.
The Trump administration scored a key win over a group of states and businesses challenging the 10% global tariffs, after a federal appeals court ruled the government can enforce the levies while a legal challenge plays out https://t.co/g6ZmEbfJrn
— Bloomberg (@business) June 11, 2026
ఈ సుంకాలను సవాలు చేస్తూ ఇద్దరు వ్యాపారవేత్తలు కోర్టుకు వెళ్లారు. తొలుత న్యూయార్క్ కోర్టు, "సుంకాలను నిర్ణయించే అధికారం కేవలం పార్లమెంటు (కాంగ్రెస్)కే ఉంది.. అధ్యక్షుడికి లేదు" అని చెబుతూ ట్రంప్‌నకు వ్యతిరేకంగా తీర్పునిచ్చింది. దీనిపై ట్రంప్ యంత్రాంగం అప్పీల్ చేయగా, ఇప్పుడు ఫెడరల్ కోర్టు ట్రంప్ నిర్ణయాన్ని సమర్థిస్తూ, సుంకాల వసూలును కొనసాగించవచ్చని స్పష్టం చేసింది. ఈ నిర్ణయం వల్ల అమెరికాలో తయారయ్యే వస్తువులకు డిమాండ్ పెరుగుతుందని, స్థానిక పరిశ్రమలు బలోపేతం అవుతాయని ప్రభుత్వం భావిస్తోంది. అయితే, భారత్ వంటి దేశాల నుంచి ఎగుమతి అయ్యే వస్తువుల ధరలు పెరగడం వల్ల మన దేశ ఎగుమతిదారులపై కొంత భారం పడవచ్చు.
ఇది కూడా చూడండి:Ireland: : ఐర్లాండ్‌లో అల్లర్లు.. వలసదారులను లక్ష్యంగా చేసుకున్న హింస
The U.S. Court of Appeals for the Federal Circuit on June 11 temporarily extended a pause of a lower ruling that struck down President Donald Trump’s 10-percent global tariffs.
— The Epoch Times (@EpochTimes) June 12, 2026
The appeals court granted the Trump administration’s motion to extend the stay of an injunction… pic.twitter.com/jdddYPYeEd
Follow Us