దుబాయ్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు!

దుబాయ్ లో బతుకమ్మ సంబరాలు ఘనంగా జరుగుతున్నాయి. ఎమిరేట్స్ తెలంగాణ కల్చరల్ & వెల్ఫేర్ అసోసియేషన్ (ETCA) ఆధ్వర్యంలో జరుగుతున్న సంబరాలకు వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. RTV మీడియా పార్ట్‌నర్‌గా వ్యవహరిస్తోంది.

New Update

Batukamma: దుబాయ్‌లో బతుకమ్మ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. ఎమిరేట్స్ తెలంగాణ కల్చరల్ & వెల్ఫేర్ అసోసియేషన్ (ETCA) ఆధ్వర్యంలో 14వ బతుకమ్మ వారోత్సవాలు అంగరంగ వైభవంగా మొదలయ్యాయి. ఏఎల్ ముల్లా ప్లాజా అల్ అహ్లీ స్పోర్ట్స్ క్లబ్ వేదికగా జరుగుతున్న వేడుకలకు వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ ముఖ్య అతిథిగా హాజరవగా.. RTV మీడియా పార్ట్‌నర్‌గా వ్యవహరిస్తోంది. 

ఇక తెలంగాణలో సంబురంగా జరుపుకునే పండుగను తెలంగాణ ప్రవాసీయులుపెద్ద సంఖ్యలో హాజరై దుబాయిలో అంగరంగ వైభవంగా నిర్వహించారు. మ‌హిళ‌లు పూలతో బతుకమ్మలు పేర్చి భక్తి శ్రద్ధలతో గౌరీ పూజ‌లు నిర్వహించారు. సాంప్రదాయ దుస్తుల్లో బతుకమ్మ ఆటపాటలతో దుబాయ్ న‌గ‌రం పుల‌కించింది. తెలంగాణ అస్తిత్వాన్ని, మన సంస్కృతి సంప్రదాయాలను దుబాయ్ గడ్డపై సగర్వంగా చాటుతున్నారు.  ఈ సంబరాలకు సింగర్స్ సోనీ పటేల్, వరం, అనన్యా నాగళ్ల, కమెడియన్ సదానందం పాల్గొని సందడి చేశారు. బతుకమ్మ పాటలతో ఉర్రూతలూగించారు.  

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

Fire Accident in america : అమెరికాలో అగ్నిప్రమాదం...పది మంది తెలుగు విద్యార్థులు..

అమెరికాలోని బర్మింగ్‌హామ్‌లో జరిగిన అగ్నిప్రమాదం నుంచి పది మంది తెలుగు విద్యార్థులు క్షేమంగా బయటపడ్డారు. శనివారం సాయంత్రం 6.20 గంటల సమయంలో బర్మింగ్‌హామ్‌లోని కెల్లామ్‌ స్ట్రీట్‌లో ఉన్న రెండు అపార్టుమెంటుల్లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి.

New Update
Fire Accident  in america

Fire Accident in america

Fire Accident  in america : అమెరికాలోని బర్మింగ్‌హామ్‌లో జరిగిన అగ్నిప్రమాదం నుంచి పది మంది తెలుగు విద్యార్థులు క్షేమంగా బయటపడ్డారు. శనివారం సాయంత్రం 6.20 గంటల సమయంలో బర్మింగ్‌హామ్‌లోని కెల్లామ్‌ స్ట్రీట్‌లో ఉన్న రెండు అపార్టుమెంటుల్లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. క్రమంగా అవి బిల్డింగ్‌ మొత్తానికి వ్యాపించడంతో భారీగా అగ్నికీలలు ఎగసిపడ్డాయి. సమాచారం అందుకున్న ఫైర్‌ సిబ్బంది హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపుచేశారు. అపార్టుమెంట్లలో ఉన్న పది మంది విద్యార్థులను రక్షించారు. వారిలో ఇద్దరు తీవ్రంగా గాయపడటంతో దవాఖానకు తరలించారని స్థానిక మీడియా కథనాలు వెల్లడించాయి.

Also Read: సన్నబియ్యం లబ్ధిదారుడి ఇంట్లో భోజనం చేసిన సీఎం రేవంత్!

బాధితులంతా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌కు చెందిన విద్యార్థులని పేర్కొన్నాయి. వారు అలబామా విశ్వవిద్యాలయంలో చదువుకుంటున్నారని తెలిపాయి. అపార్టుమెంట్లు పూర్తిగా దగ్ధమయ్యాయని వెల్లడించాయి. శనివారం సాయంత్రం 6.20 గంటలకు బిల్డింగ్‌లో మంటలు వ్యాపించాయని బాధితుల్లో ఒకరు ఇన్‌స్టా పోస్టు ద్వారా వెల్లడించారు.

Also Read: ఫస్ట్ నైట్‌లో వధువు వింత కండీషన్.. గజగజ వణికిపోయిన వరుడు!

మంటలను ఆర్పేందుకు ప్రయత్నించినప్పటికీ, వేగంగా అపార్టుమెంట్‌ మొత్తం వ్యాపించాయని తెలిపారు. అందరం వెనుక డోర్‌ నుంచి బయటకు వచ్చేశామని, కానీ ఒకరు మాత్రం పొగలు దట్టంగా అలముకోవడంతో అందులో చిక్కుకుపోయాడని పేర్కొన్నారు. ప్రస్తుతం ఇద్దరు ఐసీయూలో చికిత్స పొందుతున్నారని, వారి పరిస్థితి నిలకడగానే ఉన్నదని అందులో తెలిపారు. అగ్నిప్రమాదం నుంచి తాము బయటపడటం చాలా గొప్పవిషయమని చెప్పారు. ఈ విషయానికి సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

ఇది కూడా చూడండి: WhatsApp new features: వాట్సాప్‌ వీడియో కాల్స్ చేసుకునే వారికి గుడ్‌న్యూస్.. కొత్తగా 3 ఫీచర్లు!

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు