Cyclone Alfred: తుఫాను విధ్వంసం.. అల్లకల్లోలంగా మారుతున్న ఆస్ట్రేలియా.. వీడియోలు చూశారా?

ఆల్ఫ్రెడ్ తుఫాను కారణంగా ఆస్ట్రేలియా దారుణమైన పరిస్థితులను ఎదుర్కొంటోంది. ఈదురుగాలుల కారణంగా చెట్లు కూలిపోయాయి. విద్యుత్ స్తంభాలు తెగిపోయాయి. దాదాపు 2.50లక్షల మంది ప్రజలు అంధకారంలో మునిగిపోయారు. అనేక ప్రాంతాలు జలమయమయ్యాయి.

New Update
Tropical Cyclone Alfred Australia videos

Tropical Cyclone Alfred Australia videos

పసిఫిక్ మహాసముద్రంలో తలెత్తిన తుఫాను శనివారం ఉదయం 6 గంటల ప్రాంతంలో ఆస్ట్రేలియాకు చేరుకుంది. అక్కడ బ్రిస్బేన్ సమీపంలోని మోరెటన్ బే ద్వీపాన్ని తాకింది. గంటకు 100 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తుండగా, భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈదురుగాలుల కారణంగా చెట్లు కూలిపోయాయి. విద్యుత్ స్తంభాలు తెగిపోయాయి. దాదాపు 2.50 లక్షల మంది ప్రజలు అంధకారంలో మునిగిపోయారు. అనేక ప్రాంతాలు జలమయమయ్యాయి.

Also Read: అమెరికా కోర్టులో రాణాకు ఎదురు దెబ్బ.. ముంబై ఉగ్రదాడి కేసులో ఇండియా రావాల్సిందే

ఈ తుఫాను రాబోయే 12 నుండి 24 గంటల్లో ఆగ్నేయ క్వీన్స్‌ల్యాండ్, ఉత్తర న్యూ సౌత్ వేల్స్ వైపు వెళుతుంది. అయితే దీనివల్ల ప్రాణాలకు ముప్పు వాటిల్లుతుందని కొందరు భావిస్తున్నారు. ఆల్ఫ్రెడ్ తుఫాను పట్ల జాగ్రత్తగా ఉండాలని ప్రధాన మంత్రి అల్బనీస్ ఆస్ట్రేలియన్ ప్రజలను హెచ్చరించారు. 1000 కిలోమీటర్ల విస్తీర్ణంలో నివసిస్తున్న దాదాపు 25 లక్షల మంది దీని ప్రభావానికి లోనవుతారని.. ఇది ప్రాణాంతకం కావచ్చన్నారు. అందువల్ల ప్రజలు ఇంటి లోపలే ఉండాలని ఆయన విజ్ఞప్తి చేశారు.

ప్రమాద స్థాయికి లిస్మోర్ నది

ఇవాళ మధ్యాహ్నం నాటికి ఉత్తర న్యూ సౌత్ వేల్స్ ప్రాంతాలకు తుఫాను చేరుకుంటుందని జాతీయ వాతావరణ సేవ అంచనా వేసింది. దీని కారణంగా భారీ వర్షం, తుఫాను గాలులు, నష్టపరిచే గాలులు ఉంటాయని హెచ్చరించింది. ఇప్పటికీ ఈ తుఫాను తాకిడికి లిస్మోర్, గ్రాఫ్టన్, కాఫ్స్ హార్బర్, టెన్టర్‌ఫీల్డ్, యాంబా, వూల్‌గూల్గా, సాటెల్, డోరిగో ప్రాంతాలు అల్లకల్లోలంగా మారాయి. అందులో క్వీన్స్‌ల్యాండ్‌లో విద్యుత్ సరఫరాకు అంతరాయం కలిగింది. తుఫాను ప్రభావం నెరాంగ్‌లో ఎక్కువగా కలిగింది. అక్కడ దాదాపు 6,000 మంది ప్రజలు తుఫాను ప్రభావాన్ని ఎదుర్కొంటున్నారు. 

Also Read: మందుబాబులకు మరో బిగ్ షాక్.. మళ్లీ పెరగనున్న బీర్ల ధరలు.. ఈ సారి ఎంతంటే?

Also Read: అమ్మకానికి ప్రియాంక ఆస్తులు.. కోట్లలో డిమాండ్.. అదిమాత్రం చాలా కాస్ట్‌లీ!

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

Donald Trump: ట్రంప్ టార్గెట్ హార్వర్డ్.. యూనివర్సిటీపై తన స్టైల్లో జోకులు

తన వైఖరిపై నిరసన తెలిపిన హార్వర్డ్ యూనివర్సిటీపై ట్రంప్ మండిపడ్డాడు. విశ్వవిద్యాలయానికి నిధులు ఆపేసి.. ట్యాక్స్ వేస్తానని వార్నింగ్ ఇచ్చాడు. హర్వర్డ్‌ పనికి మాలిన రాజకీయ సంస్థ అని యూనిర్సిటీపై జోకులు వేశాడు. దీనిపై వర్సిటీ అధికారులు కూడా సీరియస్ అయ్యారు.

New Update
trump harvard

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ తన వింత నిర్ణయాలతో ప్రపంచ దేశాలకు షాక్ ఇస్తున్నాడు. రెండవ సారి అధ్యక్ష బాధ్యతలు స్వీకరించిన తర్వాత ట్రంప్ ఛేష్ఠలకు అడ్డూ అదుపూ లేకుండా పోయింది. ఫస్ట్ వలవవాదులపై ఉక్కువాదం, తర్వాత ప్రపంచ దేశాలపై టారీఫ్‌ లు పెంచాడు. ఐక్యరాజ్య సమితికి, విదేశీ సాయం నిధులు తగ్గించాడు. తాజాగా హార్వర్డ్ యూనివర్సిటీ మీద పడ్డాడు. ట్రంప్ విదేశీ విద్యార్థులు, వలసవాదులపై అవలంభించిన తీరుపై హార్వర్డ్ వర్సిటీ విద్యార్థులు నిరసన తెలిపారు. అదే సమయంలో పాలస్తీనాకు అనుకూలంగా నినాదాలు చేశారు. దీంతో ట్రంప్ మండిపోయింది. ఆ యూనివర్సిటీకి అమెరికా ప్రభుత్వం అందించే ఫెడరల్ నిధులను నిలివేస్తామని హెచ్చరించాడు. అది యూనివర్సిటీ కాదు ఓ పనికిమాలిన రాజకీయ సంస్థ హార్వర్డ్ పై ట్రంప్ విమర్శలు గుప్పించారు.

Also read: Combination Drugs: 35 రకాల ఔషదాలు నిషేదించిన కేంద్రం

రాజకీయ సిద్ధాంతపరమైన ఉగ్రవాద ప్రేరేపిత వైఖరి మానుకోవాలని హార్వర్డ్‌కు ట్రంప్ వార్నింగ్ ఇచ్చాడు. క్యాంపస్ లో పాలస్తీనా అనుకూల ఉగ్రవాద చర్యలను ప్రోత్సహించే ఆందోళన ఆలోచన పక్కన పెట్టాలని యూనివర్సిటీకి చురకలు అంటించారు. వర్సిటీకి పన్ను మినహాయింపు హోదా రద్దుచేస్తామని బెదిరించాడు. తమ స్వయం ప్రతిపత్తిని రాజ్యాంగ హక్కులను సవాలు చేసే అధికారం ప్రభుత్వానికి లేదని హార్బర్డ్ చీఫ్ అలన్ గార్బర్ అన్నారు. ట్రంప్ మాటలను ఆయన ఖండించారు. ప్రపంచంలోనే అత్యుత్తమ యూనివర్సిటీలో  హార్వర్డ్ ఒకటి అని వర్సిటీ చీఫ్ చెప్పుకొచ్చారు. ప్రస్తుతం హార్వర్డ్ సంస్థ, ట్రంప్ మధ్య విభేదాలు కొనసాగుతూనే ఉన్నాయి.

Also read: Waqf Board Act: వక్ఫ్ బోర్డు చట్టంలో కేంద్రానికి సుప్రీంకోర్టు నోటీసులు

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు