cockroach : ఆస్ట్రేలియాలో విదేశీ బొద్దింకల గుట్టురట్టు...చరిత్రలోనే అతిపెద్ద సీజ్!

ఆస్ట్రేలియా చరిత్రలోనే అత్యంత భారీ స్థాయి కీటకాల అక్రమ రవాణా నెట్‌వర్క్ బట్టబయలైంది. ఆస్ట్రేలియా వన్యప్రాణి సంరక్షణ అధికారులు ఒక రహస్య స్థావరంపై మెరుపు దాడులు చేసి అక్కడ అక్రమంగా పెంచుతున్న విదేశీ రకానికి చెందిన లక్ష బొద్దింకలను స్వాధీనం చేసుకున్నారు.

New Update
FotoJet - 2026-06-07T090312.524

Australia Seizes 1 Lakh Illegal Cockroaches

cockroach :  ఆస్ట్రేలియా చరిత్రలోనే అత్యంత భారీ స్థాయి కీటకాల అక్రమ రవాణా నెట్‌వర్క్ బట్టబయలైంది. పక్కా సమాచారంతో ఆస్ట్రేలియా వన్యప్రాణి సంరక్షణ అధికారులు ఒక రహస్య స్థావరంపై మెరుపు దాడులు నిర్వహించారు. అక్కడ అక్రమంగా పెంచుతున్న విదేశీ రకానికి చెందిన సుమారు లక్ష బొద్దింకలను స్వాధీనం చేసుకున్నారు. ఆ దేశ సరిహద్దు రక్షణ, పర్యావరణ చరిత్రలో ఇంత భారీ మొత్తంలో విదేశీ కీటకాలను పట్టుకోవడం ఇదే మొదటిసారి అని అధికారులు వెల్లడించారు.

ఆస్ట్రేలియా డిపార్ట్‌మెంట్ ఆఫ్ క్లైమేట్ ఛేంజ్, ఎనర్జీ, ది ఎన్విరాన్‌మెంట్ అండ్ వాటర్ (DCCEEW) తెలిపిన వివరాల ప్రకారం.. న్యూసౌత్ వేల్స్ పరిధిలోని బాథర్ట్స్‌లో ఉన్న ఒక భవనంలో ఎలాంటి అనుమతులు లేకుండా రహస్యంగా విదేశీ బొద్దింకలను పెంచుతున్నట్లు అధికారులకు సమాచారం అందింది. దీంతో మే 26వ తేదీన DCCEEW, ఫెడరల్ ఎన్విరాన్‌మెంట్ డిపార్ట్‌మెంట్,వన్యప్రాణి సంరక్షణ బృందాలు సంయుక్తంగా ఆ భవనంపై దాడి చేసి ఈ అక్రమ రవాణా ముఠా గుట్టును రట్టు చేశాయి.

అంతర్జాతీయ మార్కెట్లో రూ.1.34 కోట్ల విలువ!
ఈ దాడుల్లో పట్టుబడిన కీటకాలు ఆఫ్రికా ఖండానికి చెందిన ప్రత్యేకమైన 'మడగాస్కర్ హిస్సింగ్' జాతి బొద్దింకలు. గ్లోబల్ మార్కెట్లో వీటికి విపరీతమైన డిమాండ్ ఉంది. అధికారులు స్వాధీనం చేసుకున్న ఈ లక్ష బొద్దింకల విలువ అంతర్జాతీయ మార్కెట్లో దాదాపు 2,00,000 ఆస్ట్రేలియన్ డాలర్లు ఉంటుందని అంచనా వేస్తున్నారు. అంటే మన భారతీయ కరెన్సీలో వీటి విలువ సుమారు రూ.1.34 కోట్లు ఉండటం గమనార్హం.

'మడగాస్కర్' బొద్దింకల ప్రత్యేకతలు:

 ఇవి సాధారణ బొద్దింకల కంటే చాలా పెద్దవిగా, దాదాపు 3 అంగుళాల పొడవుతో, మనిషి అరచేతి పరిమాణంలో ఉంటాయి. వీటికి రెక్కలు ఉండవు కాబట్టి ఇవి ఎగరలేవు. అయితే, వీటికి ఏదైనా ప్రమాదం ఎదురైనప్పుడు లేదా ఎవరైనా పట్టుకున్నప్పుడు రక్షణ కోసం పాములాగా ‘హిస్‌స్‌స్’ అంటూ వింతగా బుసలు కొడుతూ శబ్దం చేస్తాయి. ఈ జాతిలోని మగ బొద్దింకల తలపై ప్రత్యేకంగా కొమ్ములు ఉంటాయి.

హై-ప్రోటీన్ ఫుడ్: ఈ బొద్దింకలలో ప్రొటీన్లు అత్యధికంగా ఉంటాయి. విదేశాలలో ధనవంతులు పెంపుడు జంతువులుగా పెంచుకునే అరుదైన పాములు, బల్లులు వంటి సరీసృపాలకు (Reptiles) వీటిని ప్రధాన ఆహారంగా తినిపిస్తారు. అందువల్లనే ఈ కీటకాలను ఆస్ట్రేలియాలో రహస్యంగా బ్రిడింగ్ చేస్తూ బ్లాక్ మార్కెట్లో విక్రయిస్తున్నట్లు అధికారులు గుర్తించారు.

Advertisment
తాజా కథనాలు