White house : ట్రంప్ ను వేటాడుతున్న మృత్యువు...శ్వేత సౌధం సమీపంలో మరోసారి కాల్పుల కలకలం

అమెరికా అధ్యక్షుడి అధికారిక నివాసమైన శ్వేతసౌధం (వైట్‌హౌస్) సమీపంలో మరోసారి కాల్పుల కలకలం రేగింది. 17వ స్ట్రీట్, పెన్సిల్వేనియా ఎవెన్యూ సమీపంలోని సీక్రెట్ సర్వీస్ చెక్‌పాయింట్ వద్దకు తుపాకీతో వచ్చిన ఒక అనుమానిత వ్యక్తి భద్రతా బలగాలపై కాల్పులకు తెగబడ్డాడు.

New Update
White House clarifies

Another shooting near the White House

White house : అమెరికా అధ్యక్షుడి అధికారిక నివాసమైన శ్వేతసౌధం (వైట్‌హౌస్) సమీపంలో మరోసారి కాల్పుల కలకలం రేగింది. 17వ స్ట్రీట్, పెన్సిల్వేనియా ఎవెన్యూ సమీపంలోని సీక్రెట్ సర్వీస్ చెక్‌పాయింట్ వద్దకు తుపాకీతో వచ్చిన ఒక అనుమానిత వ్యక్తి భద్రతా బలగాలపై కాల్పులకు తెగబడ్డాడు. దుండగుడు దాదాపు 20 రౌండ్ల వరకు కాల్పులు జరపడంతో అప్రమత్తమైన సీక్రెట్ సర్వీస్ అధికారులు ఎదురుకాల్పులు జరిపారు. ఈ కాల్పుల ఘటనతో ఒక్కసారిగా తీవ్ర ఉత్కంఠ నెలకొనగా, అధికారులు రంగంలోకి దిగి వైట్‌హౌస్ పరిసరాల్లో భారీగా బలగాలను మోహరించారు.

ఈ ప్రమాదకర కాల్పుల సమయంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వైట్‌హౌస్‌లోనే ఉన్నట్లు సమాచారం. కాల్పుల శబ్దాలు విన్న వెంటనే అక్కడున్న జర్నలిస్టులను అధికారులు సురక్షితంగా ప్రెస్ బ్రీఫింగ్ రూమ్‌లోకి వెళ్లాల్సిందిగా ఆదేశించారు. అయితే ఈ ఘటన జరిగిన కొద్దిసేపటికే అధ్యక్షుడు ట్రంప్ వైట్‌హౌస్‌లోని ఈస్ట్ రూమ్‌లో జరిగిన ఒక కార్యక్రమంలో పాల్గొని ప్రసంగించారు. అధ్యక్షుడికి ఎలాంటి ముప్పు వాటిల్లలేదని, ఈ ఘటనపై ఎఫ్‌బీఐ (FBI) డైరెక్టర్ కాష్ పటేల్ సామాజిక మాధ్యమం 'X' ద్వారా వివరాలను వెల్లడించారు.

భద్రతా సిబ్బంది జరిపిన ఎదురుకాల్పుల్లో తీవ్రంగా గాయపడిన నిందితుడిని చికిత్స నిమిత్తం స్థానిక ఆసుపత్రికి తరలించగా, అతడు మృతి చెందినట్లు సీక్రెట్ సర్వీస్ అధికారులు ప్రాథమికంగా ధృవీకరించారు. నిందితుడిని మేరీల్యాండ్‌కు చెందిన శ్వేతజాతీయుడిగా గుర్తించారు. అంతకుముందు సోమవారం కూడా అతను వైట్‌హౌస్ ప్రవేశ ద్వారం వద్దకు రావడానికి ప్రయత్నించాడా అనే కోణంలో అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. కాగా, ఈ దుండగుడు జరిపిన కాల్పుల్లో ఒక బాలుడికి స్వల్ప గాయాలవ్వడంతో ఆసుపత్రికి తరలించారు. బాలుడి ప్రాణానికి ఎటువంటి ప్రమాదం లేదని, సీక్రెట్ సర్వీస్ సిబ్బంది అంతా సురక్షితంగా ఉన్నారని అధికారులు తెలిపారు.

వైట్‌హౌస్ సమీపంలో కొద్దిరోజుల వ్యవధిలోనే ఇలాంటి భద్రతా వైఫల్యం బయటపడటం ఇది రెండోసారి కావడం గమనార్హం. వైట్ హౌస్ కరస్పాండెంట్స్ అసోసియేషన్ డిన్నర్ జరిగిన హోటల్ వద్ద కాల్పులు జరిగిన రెండు వారాల లోపే ఈ తాజా ఘటన చోటుచేసుకుంది. అంతేకాకుండా, ఈ కాల్పులు జరగడానికి కొద్ది నిమిషాల ముందే అమెరికా వైస్ ప్రెసిడెంట్ జేడీ వాన్స్ కాన్వాయ్ కూడా అదే ప్రాంతం మీదుగా వెళ్ళినట్లు యూఎస్‌ఎస్‌ఎస్ (USSS) డిప్యూటీ డైరెక్టర్‌ మాట్ క్విన్ మీడియా సమావేశంలో వెల్లడించారు.

Advertisment
తాజా కథనాలు