/rtv/media/media_files/2026/03/31/america-drops-900-kg-bunker-buster-bomb-on-iran-2026-03-31-09-48-49.jpg)
America Drops 900 kg Bunker Buster Bomb On Iran's Isfahan, Trump Shares Video
ఇరాన్‌పై అమెరికా భీకర స్థాయిలో విరుచుకుపడుతోంది. అణుకేంద్రాలు ఉండే కీలక నగరమైన ఇస్ఫహాన్‌పై దాడులకు పాల్పడింది. ఆయుధ నిల్వలతో ఉన్న ఓ డిపోపై 900 కేజీల బంకర్ బస్టర్లతో ఈ దాడులు చేసింది. దీంతో అక్కడ పెద్దఎత్తున మంటలు చెలరేగాయి. అయితే ఈ దాడికి సంబంధించిన వీడియోను అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తన సోషల్ మీడియా ప్లాట్‌ఫాం ట్రూత్ సోషల్‌లో పోస్టు చేశారు.
Trump post a video of MASSIVE explosions in Isfahan on U.S.-Israeli airstrikes#isfahan#IranWarhttps://t.co/jl3d5x4CRl
— CA NK SHARMA (@nksharma5565) March 31, 2026
ఇటీవల ట్రంప్ ఇరాన్ విద్యుత్ కేంద్రాలు, ఇంధన మౌలిక సదుపాయాలపై దాడులు 10 రోజులు వాయిదా వేస్తున్నట్లు ప్రకటించిన సంగతి తెలిసిందే. అయినప్పటికీ ఇతర స్థావరాల్లో మాత్రం దాడులు చేస్తూనే ఉంది. మరోవైపు ఇరాన్.. గల్ఫ్ దేశాలపై విరుచుకుపడుతోంది. తాజాగా దుబాయ్ పోర్టు వద్ద ఉన్న కువైట్‌కు చెందిన ముడిచమురు నౌకపై డ్రోన్లతో దాడులు చేసింది. పెద్దఎత్తున మంటలు చెలరేగడంతో వాటిని అదుపులోకి తెచ్చేందుకు రెస్క్యూ సిబ్బంది యత్నిస్తున్నారు.
Also read: హిస్టరీలో ఫస్ట్ టైం.. రూపాయి భారీ పతనం: 95 మార్క్ దాటిన మారకం విలువ
మరోవైపు పశ్చిమాసియా యుద్ధాన్ని ముగించేందుకు శాంతి చర్చలు కొలిక్కి రావడం లేదు. అమెరికా-ఇరాన్ చర్చలకు తాము ఆతిథ్యమిస్తామని పాకిస్థాన్ ప్రకటించింది. కానీ ఇరాన్ మాత్రం దీనికి ఒప్పుకోవడం లేదు. పాక్ మధ్యవర్తిత్వ ప్రణాళికలతో తమకు సంబంధం లేదని తేల్చిచెప్పింది.
వాస్తవానికి పాక్ రాజధాని ఇస్లామాబాద్ వేదికగా ఈజిప్టు, సౌదీ అరేబియా, తుర్కియే విదేశాంగ శాఖ మంత్రులు సోమవారం సమావేశం కావాల్సి ఉంది. కానీ ఈ మీటింగ్‌కు ముందే వాళ్లు స్వదేశాలకు వెళ్లిపోయారు. మరోవైపు ట్రంప్.. ఇరాన్‌ను హెచ్చరిస్తూనే ఉన్నారు. త్వరగా ఒప్పందం చేసుకొని, హర్మూజ్ జలసంధిని పూర్తిగా తెరవాలంటూ సూచించారు.
Also Read: కువైట్‌కు మరో ఎదురుదెబ్బ.. చమురు ట్యాంకర్‌పై విరుచుకుపడ్డ ఇరాన్
Follow Us