/rtv/media/media_files/2025/03/21/u9rpuv5QCiUl4P8p6djD.jpg)
Donald Trump
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ యెమెన్‌పై మార్చి 15వ తేదీన దాడులను ప్రకటించారు. అయితే అమెరికా అనుకోకుండా చేసిన ఓ చిన్న పొరపాటు ఇప్పుడు దేశ భద్రత ఇరకాటంలో పడింది. డొనాల్డ్ ట్రంప్ పరిపాలనలోని అగ్ర జాతీయ భద్రతా అధికారులు యెమెన్‌లోని హౌతీ గ్రూపుపై సైనిక దాడులను ప్లాన్ చేసి, వాణిజ్య సందేశ సేవలో చర్చించారు. అయితే ఇప్పుడు ఆ చాట్ లీక్ అయ్యింది. ఓ గ్రూప్ చాట్ ద్వారా ఈ విషయం తెలిసినట్లు ద అట్లాంటిక్ మ్యాగజైన్ ఎడిటర్ ఇన్ చీఫ్ జెఫ్రీ గోల్డ్‌బర్గ్ తెలిపారు. అయితే ఈ చాట్ లీక్ కావడానికి రెండు రోజుల ముందే తనని ఆ గ్రూప్‌లో యాడ్ చేశారని వెల్లడించారు.
ఇది కూడా చూడండి: Betting Apps Anvesh: యూట్యూబర్ VR రాజాపై అన్వేష్ ఫైర్.. గడ్డి తింటున్నారంటూ ఆగ్రహం!
BREAKING: In a stunning moment, Donald Trump admits that he has no idea what his own administration is up to, when asked about the major lapse in security when war plans were accidentally shared over Signal with a reporter.
— Really American 🇺🇸 (@ReallyAmerican1) March 24, 2025
Make sure everyone sees this.pic.twitter.com/Jy4IKgT8EV
ఇది కూడా చూడండి: వీడు మగాడ్రా బుజ్జి.. ఇంపాక్ట్ ప్లేయర్‌గా వచ్చి..జట్టును గెలిపించి!
యూరప్‌కి తిరిగి సాయం చేయాల్సి వస్తుందని..
హెగ్సెత్ గ్రూప్ చాట్‌లో టార్గెట్స్, అమెరికా ఆయుధాల మోహరింపు, దాడులు చేసే దిశ వంటి అంశాలపై చర్చించినట్లు గోల్డ్‌బర్గ్ తెలిపారు. ఈ క్రమంలోనే దాడులు జరిగాయని, వాన్స్‌గా గుర్తించిన వ్యక్తి ఈ దాడులను వ్యతిరేకించినట్లు తెలుస్తోంది. అయితే నిజంగానే షిప్పింగ్‌పై దాడులు జరిగితే యూఎస్ యూరప్‌కు తిరిగి సాయం చేయాల్సి వస్తుందని కూడా చాట్‌లో ఉంది. అయితే జాతీయ భద్రతా సలహాదారు మైక్ వాల్జ్, హెగ్సెత్‌లు యెమెన్‌పై దాడులు చేసేంత సామర్థ్యం కేవలం అమెరికాకు మాత్రమే ఉందన్నారని గోల్డ్‌బర్గ్ తెలిపారు.
ఇది కూడా చూడండి: Nicholas Pooran : భయంకరమైన హిట్టర్.. 29 ఏళ్లకే 600 సిక్సులు!
గోల్డ్‌బెర్గ్‌కు ఈ విషయం ముందే తెలిసినా కూడా బయటకు చెప్పలేదు. అయితే దీనిపై ట్రంప్ కూడా స్పందించారు. ఎలాంటి సమాచారం దీనిపై లేదన్నారు. జాతీయ భద్రతా మండలి ప్రతినిధి బ్రియాన్ హ్యూస్ స్పందిస్తూ గ్రూప్‌చాట్‌లోకి అనుకోకుండా జర్నలిస్టు ఎలా వచ్చారనే దానిపై విచారణ జరుపుతున్నట్లు తెలిపింది. ఈ భద్రతను తీవ్రంగా ఖండించారు. అయితే ట్రంప్ పాలక వర్గం అజాగ్రత్త వల్లే ఇలా జరిగిందని మరికొందరు అంటున్నారు.
ఇది కూడా చూడండి: AP Man : అమెరికాలో ఆంక్షలు.. ఏపీ యువకుడు ఆత్మహత్య!