/rtv/media/media_files/2026/05/11/alberta-group-submits-petition-with-signatures-for-separatism-referendum-from-canada-2026-05-11-17-58-48.jpg)
Alberta group submits petition with signatures for separatism referendum from Canada
Alberta Separation Protests: కెనడా(Canada) అంటే ప్రశాంతత, మంచి వాతావరణం గుర్తొస్తుంది. ఈ దేశంలోని అత్యంత ధనిక రాష్ట్రాల్లో ఒకటైన ‘ఆల్బర్టా’ (Alberta) లో ప్రస్తుతం వేర్పాటువాదుల నిరసనలు జరుగుతున్నాయి. కెనడా నుంచి విడిపోయి తమకు స్వతంత్ర దేశం కావాలంటూ దాదాపు 3 లక్షల మందికి పైగా ప్రజలు సంతకాలు చేసిన ఓ భారీ వినతిపత్రం ఇప్పుడు కెనడా రాజకీయాల్లో సంచలనం రేపుతోంది. 'స్టే ఫ్రీ ఆల్బర్టా' అనే వేర్పాటువాద బృందం ఆధ్వర్యంలో ఈ ఉద్యమం కొనసాగుతోంది. స్వాతంత్ర్యంపై ప్రజాభిప్రాయ సేకరణ జరిపించాలని డిమాండ్ చేస్తూ ఎన్నికల సంఘానికి అధికారికంగా ఈ వేర్పాటుబృందం వినతిపత్రాన్ని అందించింది. దశాబ్దాల పాటు జరుగుతున్న ఈ రాజకీయ, ఆర్థిక అసంతృప్తి ఇప్పుడు కెనడా ప్రభుత్వానికి సవాలుగా మారింది.
ఆల్బర్టా ప్రజలు కెనడా నుంచి విడిపోవాలని బలంగా కోరుకోవడానికి ప్రధాన కారణం ఆర్థిక అసమానతలే. కెనడాలో అత్యంత సంపన్నమైన ప్రావిన్స్‌గా, చమురు-గ్యాస్ ఉత్పత్తికి కీలకంగా ఆల్బర్టా రాష్ట్రం ఉంది. ఫెడరల్ ప్రభుత్వానికి చెల్లిస్తున్న పన్నుల్లో తమకు న్యాయపరమైన వాటా దక్కడం లేదని చెబుతోంది. 2023-24లో కెనడా సమానత్వ కార్యక్రమం కింద పంపిణీ చేసిన 23 బిలియన్ డాలర్లలో ఆల్బర్టాకు ఒక్క పైసా కూడా రాలేదు. గత నాలుగు దశాబ్దాల్లో ఎంప్లాయ్‌మెంట్ ఇన్సూరెన్స్ ద్వారా ఈ రాష్ట్రం నుంచి 244 బిలియన్ డాలర్లకు పైగా నిధులు ఫెడరల్ ఖజానాకు వెళ్లాయి. ఇవన్నీ కూడా ఇతర పేద ప్రావిన్సుల అభివృద్ధికి వెళ్లిపోయాయి. తాము కష్టపడి సంపాదించే సంపదను కేంద్రం దోచుకుంటోందనే భావన ఇక్కడి ప్రజల్లోకి బలంగా వెళ్లిపోయింది.
Also Read: ఇజ్రాయెల్‌కు బిగ్ షాక్.. ఐరన్ డోమ్‌ను కూల్చేసిన హెజ్‌బొల్లా
ఆర్థిక కారణాలతో పాటు తీవ్రమైన రాజకీయ, సైద్ధాంతిక విభేదాలు సైతం ఈ వేర్పాటువాదుల డిమాండ్‌కు బలాన్ని ఇస్తున్నాయి. ఆల్బర్టా ప్రావిన్స్‌కు సంప్రదాయవాద భావజాలం ఉంటుంది. గత దశాబ్ద కాలంగా కెనడాలో లిబరల్ పార్టీ అధికారంలో ఉంది. ఒట్టావాలోని ఫెడరల్ ప్రభుత్వం తీసుకుంటున్న కఠినమైన పర్యావరణ విధానాలు, కార్బన్ పన్నులు తమ చమురు రంగాన్ని ఉద్దేశపూర్వకంగా దెబ్బతీసేలా ఉన్నాయంటూ ఆల్బర్టా నేతలు ఆరోపణలు చేస్తున్నారు. తమ సంస్కృతికి, ఆలోచనలకు ఏమాత్రం సరిపోని లిబరల్స్ విధానాల కింద తాము ఉండలేమని అంటున్నారు. తమ వనరులపై తమకే సంపూర్ణ నియంత్రణ ఉండాలని ప్రజలు కోరుకుంటున్నారని చెబుతున్నారు.
Also Read: కేంద్రం కీలక ప్రకటన.. వీబీ జీ రామ్ జీ చట్టం ఎప్పటి నుంచి అమల్లోకంటే ?
దీనికి సంబంధించి ఓ పోలింగ్ కూడా జరిగింది. దీనిప్రకారం 65 శాతం మంది కెనడాలోనే ఉండటానికి మొగ్గు చూపుతున్నారు. కేవలం 25 నుంచి 30 శాతం మంది మాత్రమే ప్రత్యేక దేశం కావాలని కోరుకుంటున్నారు. కానీ ఈ సంఖ్య కూడా క్రమంగా పెరుగుతోంది. ప్రత్యేక దేశంగా ఆల్బర్టా నిలవడం అంత తేలిక కాదు. దీని ముందు మూడు భారీ చట్టపరమైన అడ్డంకులున్నాయి. మొదటిది ప్రత్యేక దేశం పిటిషన్‌పై వచ్చిన 3 లక్షల సంతకాల ధృవీకరణ ప్రక్రియను కోర్టు ఆపేసింది. దీనికి కారణం.. కెనడియన్ రాజ్యాంగం ప్రకారం తమకు దక్కిన హక్కులకు ఈ విభజన తూట్లు పొడుస్తుందని స్థానిక స్వదేశీ తెగలు సైతం కోర్టులో పిటిషన్ వేశాయి.
ఒకవేళ కోర్టు దీనికి ఆమోదం తెలిపి, అక్టోబర్ 19, 2026న షెడ్యూల్ చేసినట్లుగా రిఫరెండం జరిగినా "క్లారిటీ యాక్ట్" (Clarity Act) ప్రకారం సాధారణ మెజార్టీ సరిపోదు. బలమైన మెజార్టీతో పాటు అత్యంత స్పష్టమైన ప్రశ్నతో ఓటింగ్ జరగాలి. ఈ విషయంలో కెనడా ఫెడరల్ పార్లమెంట్ తుది నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది.
Also Read: తమిళనాడు పాలిటిక్స్‌లో బిగ్ ట్విస్ట్.. స్టాలిన్ ఇంటికి సీఎం విజయ్!
ఒకవేళ చట్టపరమైన, రాజకీయ అడ్డంకులను దాటిమరీ ఆల్బర్టా కెనడా నుంచి విడిపోతే.. ఆ తర్వాత ఓ కొత్త దేశం స్థాపన కోసం సుదీర్ఘమైన ప్రక్రియ ప్రారంభమవుతుంది. ఇందులో భాగంగానే మొదట కెనడియన్ సమాఖ్యతో చర్చలు నిర్వహించాల్సి ఉంటుంది. దేశ విభజన అనేది రాజ్యాంగ సవరణలతో ముడిపడి ఉంటుంది. కాబట్టి అన్ని ప్రావిన్సుల నుంచి సమ్మతి తీసుకోవాలి. రెండో దశలో ఆస్తులు, అప్పుల పంపకం చేస్తారు. కెనడాకు ఉన్న భారీ జాతీయ రుణంలో ఆల్బర్టా తన వాటాను భరించాల్సి ఉంటుంది. అలాగే ఇప్పటిదాకా ఫెడరల్ పరిధిలో ఉన్న భూములు, భవనాలు, సరిహద్దుల విభజన, చమురు నిక్షేపాల యాజమాన్య బదిలీ లాంటి అంశాలపై ఇరుపక్షాల మధ్య ఏకాభిప్రాయం కుదరాల్సి ఉంటుంది.
Also Read: ఏంటీ ఈ పోక్సో చట్టం? : అరెస్ట్ తప్పదు.. బెయిల్ దొరకదు.. శిక్ష ఏంటో తెలుసా?
చివరి దశలో చూసుకుంటే ఆల్బర్టా ఓ స్వతంత్ర సార్వభౌమ దేశంగా నిలబడేందుకు తన సొంత రాజ్యాంగాన్ని రూపొందించుకోవాలి. కొత్త పౌరసత్వ విధానం, సొంత సెంట్రల్ బ్యాంక్ స్థాపన, కరెన్సీ ముద్రణ, అలాగే శాంతిభద్రతల కోసం సొంత సైన్యాన్ని ఏర్పాటు చేసుకోవాలి. వీటితో సహా అమెరికా, కెనడాతో పాటు ఇతర ప్రపంచ దేశాలతో కొత్తగా వాణిజ్య ఒప్పందాలు కుదుర్చుకోవాలి. అంతర్జాతీయ వేదికలపై గుర్తింపు తెచ్చుకునేందుకు ఐక్యరాజ్యసమితి లాంటి సంస్థల్లో సభ్యత్వం కోసం అప్లై చేసుకోవాలి. నిపుణుల అంచనాల ప్రకారం చూసుకుంటే.. ఇవన్నీ కూడా స్విచ్ నొక్కినంత వెంటనే జరగవు. ఓ కొత్త దేశంగా ఆల్బర్టా ఆవిర్భవించి.. స్థిరపడాలంటే కనీసం ఓ దశాబ్ద కాలం పైనే సమయం పడుతుంది.
Follow Us