Cannes Film Festival : నీలిరంగు గౌనులో మెరిసిన ఐశ్వర్య రాయ్..!...కళ్లన్నీ ఆ అందాల పైనే...

ప్రతిష్ఠాత్మక 79వ Cannes Film Festival వేదికపై భారతీయ సౌందర్యం మరోసారి విశ్వరూపం ప్రదర్శించింది. బాలీవుడ్ అగ్రనటి ఐశ్వర్యా రాయ్ బచ్చన్. కేన్స్ వేదికపై నీలిరంగు గౌనులో నడిచివస్తుంటే.. అక్కడ ఒక్కసారిగా కెమెరా క్లిక్‌ల వర్షం కురిసింది.  

New Update
FotoJet - 2026-05-23T165533.726

Aishwarya Rai Bachchan

Cannes Film Festival : ప్రపంచవ్యాప్తంగా సినీ, ఫ్యాషన్ ప్రియులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూసే ప్రతిష్ఠాత్మక 79వ కేన్స్ చలన చిత్రోత్సవం (Cannes Film Festival) వేదికపై భారతీయ సౌందర్యం మరోసారి విశ్వరూపం ప్రదర్శించింది. అంతర్జాతీయ రెడ్ కార్పెట్‌పై ఎందరో భామలు మెరిసినప్పటికీ, అందరి చూపు ఒక్కరిపైనే నిలిచిపోయింది. ఆమే.. విశ్వసుందరి, బాలీవుడ్ అగ్రనటి ఐశ్వర్యా రాయ్ బచ్చన్. కేన్స్ వేదికపై నీలిరంగు గౌనులో ఆమె దేవకన్యలా నడిచివస్తుంటే.. అక్కడ ఒక్కసారిగా కెమెరా క్లిక్‌ల వర్షం కురిసింది.  

కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో రొటీన్ డ్రెస్సుల హడావుడి నడుస్తోందనుకుంటున్న తరుణంలో.. ఐశ్వర్య రాయ్ బచ్చన్ గ్రాండ్ ఎంట్రీ ఇచ్చి అందరినీ ఆశ్చర్యపరిచారు. ఈ ప్రతిష్ఠాత్మక వేడుకలో ఐశ్వర్య పాల్గొనడం ఇది 24వ సారి కావడం విశేషం. దశాబ్దాలు మారుతున్నా, ఫ్యాషన్ ట్రెండ్స్ వస్తూ పోతున్నా.. రెడ్ కార్పెట్‌పై ఐశ్వర్య క్రేజ్, ఆమె సృష్టించే మ్యాజిక్ ఏమాత్రం తగ్గలేదని ఈ వేడుకతో మరోసారి రుజువైంది.ప్రముఖ ఫ్యాషన్ డిజైనర్ అమిత్ అగర్వాల్ ప్రత్యేకంగా రూపొందించిన ఈ అద్భుతమైన నీలిరంగు గౌనుకు 'లుమినారా' అని పేరు పెట్టారు. ఈ డ్రెస్ వెనుక ఉన్న కళా నైపుణ్యం, శ్రమ అంతర్జాతీయ ఫ్యాషన్ వర్గాలను సైతం విస్మయానికి గురిచేస్తోంది:

క్రిస్టల్ వెయిన్ ఎంబ్రాయిడరీ తో అమిత్ అగర్వాల్ సిగ్నేచర్ స్టైల్ అయిన ఈ టెక్నిక్‌ను ఉపయోగించి వందలాది చిన్న చిన్న క్రిస్టల్స్‌ను చేతితో ఎంతో సునిశితంగా కుట్టారు.ఈ విలాసవంతమైన గౌనును పూర్తి చేయడానికి డిజైనర్ బృందానికి ఏకంగా 1500 గంటలకు పైగా సమయం పట్టిందట. ప్రకృతి సిద్ధమైన ఆకృతుల ఆధారంగా (బయోమిమిక్రీ) ఈ గౌనును డిజైన్ చేశారు. ముఖ్యంగా భుజాల నుంచి రెక్కల్లా విస్తరించిన నిర్మాణాలు, ముదురు నీలి రంగు (Dark Blue) కాంబినేషన్ ఈ డ్రెస్‌ను నెక్స్ట్‌ లెవెల్‌కు తీసుకెళ్లాయి.

ఇది కేవలం డ్రెస్ కాదు.. ఒక 'ఎనర్జీ ఫీల్డ్'!

ఈ అద్భుత సృష్టి గురించి డిజైనర్ అమిత్ అగర్వాల్ మాట్లాడుతూ.. "ఇది కేవలం ఒక డ్రెస్ మాత్రమే కాదు, ఇదొక ఎనర్జీ ఫీల్డ్. ఐశ్వర్యా రాయ్ లోని తేజస్సును, ఆమెకున్న తిరుగులేని వ్యక్తిత్వాన్ని ప్రతిబింబించేలా ఈ లుమినారా గౌనును డిజైన్ చేయడం జరిగింది" అని ఎంతో గర్వంగా చెప్పుకొచ్చారు.రెడ్ కార్పెట్‌పై ఐశ్వర్య ఈ డ్రెస్‌లో నడుస్తుంటే.. ఒక అద్భుతమైన సినిమా విజువల్స్ చూస్తున్న అనుభూతి కలిగిందని అక్కడి ఫ్యాషన్ విశ్లేషకులు ప్రశంసలు కురిపించారు. మొత్తానికి 79వ కేన్స్ వేదికపై తన రాయల్ లుక్‌తో ప్రపంచవ్యాప్తంగా మరోసారి టాక్ ఆఫ్ ది టౌన్‌గా నిలిచారు ఐశ్వర్యా రాయ్ బచ్చన్.

Advertisment
తాజా కథనాలు