ఎడ్యుకేషన్ పై AI ఎఫెక్ట్.. ఆ 12 వేల కోర్సులు ఔట్.. యూనివర్సిటీల సంచలన నిర్ణయం!

సౌత్ చైనా మార్నింగ్ పోస్ట్ నివేదిక ప్రకారం, చైనాలోని యూనివర్సిటీలు తమ విద్యా విధానాన్ని భారీగా మార్చేస్తున్నాయి. కాలం చెల్లిన కోర్సులను రద్దు చేస్తూ, కొత్త టెక్నాలజీ కోర్సులకు ప్రాధాన్యత ఇస్తున్నాయి.

New Update
ai

ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కేవలం మనుషులు పని చేసే విధానాన్ని మాత్రమే కాదు, విద్యార్థులు చదువుకునే కోర్సులను కూడా మార్చేస్తోంది. కన్సల్టింగ్, ఫైనాన్స్, మార్కెటింగ్, మేనేజ్మెంట్ లాంటి రంగాల్లో ఏఐ వాడకం పెరిగిపోతుండటంతో, భవిష్యత్తులో ఉద్యోగ గ్యారెంటీ లేని కోర్సులపై భారీగా డబ్బులు ఖర్చు పెట్టడానికి విద్యార్థులు వెనకాడుతున్నారు. గత నెలలో అమెరికాలోని కొన్ని యూనివర్సిటీలు ఎంబీఏ కోర్సుల ఫీజులను తగ్గించగా, ఇప్పుడు చైనాలో అంతకంటే పెద్ద మార్పు మొదలైంది. మారుతున్న ఉద్యోగ మార్కెట్‌కు అనుగుణంగా చైనాలోని యూనివర్సిటీలు పాతబడిపోయిన కోర్సులను తీసేసి, వాటి స్థానంలో ఏఐ లాంటి సరికొత్త సాంకేతిక కోర్సులను ప్రవేశపెడుతున్నాయి.

సౌత్ చైనా మార్నింగ్ పోస్ట్ నివేదిక ప్రకారం, చైనాలోని యూనివర్సిటీలు తమ విద్యా విధానాన్ని భారీగా మార్చేస్తున్నాయి. కాలం చెల్లిన కోర్సులను రద్దు చేస్తూ, కొత్త టెక్నాలజీ కోర్సులకు ప్రాధాన్యత ఇస్తున్నాయి. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, రోబోటిక్స్, అడ్వాన్స్‌డ్ మాన్యుఫ్యాక్చరింగ్ లాంటి నెక్స్ట్ జనరేషన్ పరిశ్రమల్లో ప్రపంచ లీడర్‌గా ఎదగాలనే చైనా ప్రభుత్వ లక్ష్యానికి అనుగుణంగా ఈ మార్పులు జరుగుతున్నాయి.

ప్రస్తుతం చైనాలో డిగ్రీలు పూర్తి చేసుకుని బయటకు వస్తున్న విద్యార్థుల సంఖ్య పెరుగుతున్నప్పటికీ, వారి చదువుకు తగ్గ ఉద్యోగాలు దొరకడం లేదు. అక్కడ యువతలో నిరుద్యోగిత రేటు 16 శాతం కంటే ఎక్కువగా ఉంది. మరోవైపు, కంపెనీలు కోరుకునే నైపుణ్యాలను ఏఐ పూర్తిగా మార్చేస్తోంది. అందుకే, మార్కెట్లో డిమాండ్ లేని, అవకాశాలు తగ్గిపోయిన ఆర్ట్స్, హ్యుమానిటీస్, విదేశీ భాషలు, మేనేజ్‌మెంట్ కోర్సులను యూనివర్సిటీలు పక్కన పెడుతున్నాయి.

దీనికి బదులుగా, చైనా పారిశ్రామిక రంగానికి ఉపయోగపడే కొత్త కోర్సులను ప్రవేశపెడుతున్నారు. ఇందులో ముఖ్యంగా ఎంబోడీడ్ ఇంటెలిజెన్స్  కోర్సుకు భారీ డిమాండ్ ఏర్పడింది. చైనాలోని దాదాపు 9 యూనివర్సిటీలు ఇప్పటికే ఈ కొత్త మేజర్‌ను ప్రారంభించాయి. చైనా విద్యా మంత్రిత్వ శాఖ గణాంకాల ప్రకారం.. 2021 నుండి 2025 మధ్య కాలంలో చైనా యూనివర్సిటీలు దాదాపు 12,200 అండర్ గ్రాడ్యుయేట్ కోర్సులను రద్దు చేయగా, కొత్తగా 10,200 కోర్సులను చేర్చాయి. అంటే మొత్తం కోర్సులలో 30 శాతం కంటే ఎక్కువ మార్పులు జరిగాయి.

కొన్ని సంవత్సరాల క్రితం

అయితే, కేవలం ఒక డిగ్రీ స్థానంలో మరో డిగ్రీని తీసుకురావడం వల్ల పెద్దగా ప్రయోజనం ఉండదని నిపుణులు హెచ్చరిస్తున్నారు. సాంకేతికత మారుతున్న వేగాన్ని అందుకోవాలంటే విద్యావ్యవస్థలో ఇంకా లోతైన సంస్కరణలు రావాలని వారు అభిప్రాయపడుతున్నారు. ఇప్పుడు రద్దు చేసిన కోర్సులలో చాలావరకు కొన్ని సంవత్సరాల క్రితం ప్రారంభించినవేనని, అవి పూర్తిస్థాయిలో మెరుగవ్వడానికి ముందే రద్దు చేశారని గుర్తు చేస్తున్నారు. పదే పదే గ్రూపులను మార్చడం కంటే, మారుతున్న పరిశ్రమల అవసరాలకు అనుగుణంగా విద్యార్థులు నైపుణ్యాలను నేర్చుకునేలా మరింత వెసులుబాటు ఉన్న విద్యా విధానాన్ని రూపొందించాలని నిపుణులు సూచిస్తున్నారు.

Advertisment
తాజా కథనాలు