ఆఫ్గాన్‌ చేతిలో ఎస్-400.. రష్యా మాస్టర్ ప్లాన్‌తో పాక్‌ పని ఖతమే!

ఇటీవల మాస్కోలో జరిగిన ఓ అంతర్జాతీయ భద్రతా సదస్సులో రష్యా, తాలిబన్ ప్రభుత్వం కీలకమైన సైనిక సాంకేతిక సహకార ఒప్పందంపై సంతకాలు చేశాయి. ఈ ఒప్పందం ద్వారా పాక్‌ పని అయిపోయిందని ఊహాగానాలు వినిపిస్తున్నాయి.

New Update
FotoJet (2)

ప్రస్తుతం రష్యా, ఆఫ్ఘనిస్థాన్‌లోని తాలిబన్ల మధ్య స్నేహం పెరుగుతోంది. ఇటీవల మాస్కోలో జరిగిన ఓ అంతర్జాతీయ భద్రతా సదస్సులో రష్యా, తాలిబన్ ప్రభుత్వం కీలకమైన సైనిక సాంకేతిక సహకార ఒప్పందంపై సంతకాలు చేశాయి. ఈ ఒప్పందం ద్వారా రెండు దేశాల మధ్య రక్షణ రంగంలో సహకారం మరింత బలోపేతం కానుంది. ముఖ్యంగా ఆయుధాల మార్పిడి, సాంకేతిక పరిజ్ఞానాన్ని పంచుకోవడం, రక్షణ రంగానికి సంబంధించిన ఉమ్మడి ప్రాజెక్టులను చేపట్టే అవకాశం ఉందని తెలుస్తోంది. అయితే జూలై 2025లో రష్యా తాలిబన్ ప్రభుత్వాన్ని అధికారికంగా గుర్తించిన మొదటి దేశంగా నిలిచింది. అప్పటి నుంచి ఇరు దేశాలు స్నేహంగానే ఉన్నాయి. 

ఇది కూడా చూడండి: Raidurgam : రియల్ ఎస్టేట్ హిస్టరీలోనే బిగ్గెస్ట్ రికార్డ్: రాయదుర్గంలో ఎకరం స్థలం రూ.237 కోట్లు!

ఇది కూడా చూడండి: CM Siddaramaiah : రాజ్యసభ ఆఫర్ రిజెక్ట్.. సిద్ధరామయ్య సంచలన ప్రకటన!

సరిహద్దుల్లో శాంతి కోసం..

మరోవైపు ఆఫ్ఘనిస్థాన్, పాకిస్థాన్ మధ్య సరిహద్దు ఉద్రిక్తతలు రోజురోజుకూ పెరుగుతున్నాయి. తమ భూభాగంలో దాడులు చేస్తున్న తహ్రీక్-ఇ-తాలిబన్ పాకిస్థాన్ ఉగ్రవాదులకు ఆఫ్ఘన్ తాలిబన్లు ఆశ్రయం ఇస్తున్నారని ఇస్లామాబాద్ పదేపదే ఆరోపిస్తోంది. అలాగే పాక్ ప్రధాని షెహబాజ్ షరీఫ్.. తాలిబన్ పాలన భారత్‌తో కలిసి పాకిస్థాన్‌కు వ్యతిరేకంగా పని చేస్తోందని తీవ్ర ఆరోపణలు చేశారు. ఈ వివాదాల వల్ల రెండు దేశాల మధ్య సరిహద్దుల్లో కాల్పులు జరిగాయి. ఇలాంటి సమయంలో రష్యా జోక్యం చేసుకుని ఇరు దేశాల మధ్య మధ్యవర్తిత్వం వహించేందుకు ముందుకు వచ్చింది. మాస్కో సమావేశంలో పాకిస్థాన్ నేతలతో రష్యా మాట్లాడింది.

ఇది కూడా చూడండి: CM Revanth Reddy : మాకు ఇందిరమ్మ ఎంతో.. NTR కూడా అంతే : సీఎం రేవంత్ రెడ్డి

సరిహద్దుల్లో శాంతిని నెలకొల్పేందుకు తాము పూర్తిస్థాయిలో సహకరిస్తామని, దౌత్య మార్గాల ద్వారా సమస్యలను పరిష్కరించుకోవాలని పిలుపునిచ్చారు. రష్యా ఓ వైపు తాలిబన్లతో సైనిక బంధాన్ని పెంచుకుంటూనే, మరోవైపు పాకిస్థాన్‌తో వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని కొనసాగించాలని భావిస్తోంది. ముఖ్యంగా రష్యాకు చెందిన శక్తివంతమైన ఎస్-400 (S-400) ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్ లేదా పాంట్సిర్ వంటి అధునాతన వాయు రక్షణ వ్యవస్థలను ఆఫ్ఘనిస్థాన్‌కు సరఫరా చేసే అవకాశం ఉందని తెలుస్తోంది. ఒకవేళ తాలిబన్ల చేతికి ఇటువంటి ఆయుధాలు చిక్కితే.. పాకిస్తాన్ ఖతమే అని ఊహాగానాలు మొదలయ్యాయి.

Advertisment
తాజా కథనాలు