/rtv/media/media_files/2025/03/30/ftkebbzOcNbT579nuVHC.jpg)
7.1 earthquake hits Tonga in South Pacific
మయన్మార్, థాయ్‌లాండ్‌లో సంభవించిన భూకంపం పెను విధ్వంసం సృష్టించిన సంగతి తెలిసిందే. ఇప్పుడు తాజాగా దక్షిణ పసిఫిక్ మహాసముద్రంలోని టోంగా అనే ద్వీపం సమీపంలో భూకంపం వచ్చింది. ప్రధాన ద్వీపానికి ఈశాన్యంలో 100 కిలోమీటర్ల దూరంలో భూకంప కేంద్రం ఉన్నట్లు అమెరికా జియోలాజికల్ సర్వే (USGS) తెలిపింది. రిక్టర్ స్కేల్‌పై 7.1 తీవ్రతతో వచ్చినట్లు చెప్పింది. ఈ క్రమంలోనే టోంగాలోని దీవులకు అధికారులు మొదటగా సునామీ హెచ్చరికలు జారీ చేశారు.
Also Read: ఆ విషయంలో అమ్మకు దొరికిపొయా.. వివాదంలో ఇరుకున్న మరో స్టాండప్ కమెడియన్
భూకంప కేంద్రం నుంచి దాదాపు 300 కిలోమీటర్ల పరిధిలో అలలు తీవ్రంగా ఎగిసిపడే ఛాన్స్ ఉందని పసిఫిక్ సునామీ హెచ్చరికల కేంద్రం తెలిపింది. అయితే కొంత సమయం తర్వాత మళ్లీ సునామీ హెచ్చరికలను ఎత్తివేశారు. ఈ భూకంప ప్రభావం వల్ల జరిగిన నష్టానికి సంబంధించి సమాచారం లేదు. పది కిలోమీటర్ల లోతులో ఈ భూకంప కేంద్రం ఏర్పడిందని జర్మనీకి చెందిన జియోలాజికల్ సర్వే పేర్కొంది.
Also read: హిమాచల్ ప్రదేశ్ లో విరిగిపడిన కొండచరియలు..ఆరుగురు మృతి
ఇదిలాఉండగా.. టోంగా అనేక దీవుల సముదాయం. ఈ ప్రాంతంలో మొత్తం 171 దీవులు ఉన్నాయి. దాదాపు లక్ష మంది వరకు ప్రజలు ఇక్కడ జీవిస్తున్నారు. ముఖ్యంగా టోంగాటపు దీవిలోనే ఎక్కువగా ప్రజలు ఉంటారు. ఇక్కడ తెల్లని ఇసుక బీచ్‌లు, పగడపు దిబ్బలు ఉంటాయి. ఆస్ట్రేలియా తూర్పు తీరం నుంచి చూసుకుంటే 3500 కిలోమీటర్ల దూరంలో టోంగా ఉంటుంది.
Also Read: జీబ్లీ వాడడాన్ని తగ్గించండి, మా సిబ్బందికి నిద్ర కావాలి: ఓపెన్ ఏఐ సీఈవో శామ్ ఆల్ట్‌మాన్
telugu-news | earthquake | pacific-ocean