యుద్ధంలో 43 వేల మంది సైనికులను కోల్పోయాం, శాంతి కావాలి: జెలెన్స్కీ

దాదాపు మూడేళ్ల నుంచి జరుగుతున్న యుద్ధంలో తాము 43 వేల మంది సైనికులను కోల్పోయామని ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ అన్నారు. తాజాగా డొనాల్డ్‌ ట్రంప్‌తో సమావేశమైన ఆయన.. రష్యా మరోసారి దాడి చేసే అవకాశం లేనివిధంగా శాంతి ఒప్పందం అవసరమని కోరారు.

New Update
Volodymyr Zelenskyy

రష్యా,ఉక్రెయిన్ మధ్య యుద్ధం ఇంకా కొనసాగుతూనే ఉంది. ఇరుదేశాల్లో భారీ సంఖ్యలో ప్రాణనష్టం జరిగింది. అయితే దీనికి సంబంధించి ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీ కీలక వ్యాఖ్యలు చేశారు. దాదాపు మూడేళ్ల నుంచి జరుగుతున్న యుద్ధంలో తాము 43 వేల మంది సైనికులను కోల్పోయామని తెలిపారు. మరో 3.70 లక్షల మందికి పైగా సైనికులు పైగా గాయపడ్డారని పేర్కొన్నారు. తాజాగా డొనాల్డ్‌ ట్రంప్‌తో సమావేశమైన జెలెన్‌స్కీ.. రష్యా మరోసారి దాడి చేసే అవకాశం లేనివిధంగా శాంతి ఒప్పందం అవసరమని కోరారు. 

Also Read: ధరణిలో మార్పులు, కొత్త ఆర్‌వోఆర్ చట్టం.. పొంగులేటి కీలక వ్యాఖ్యలు

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ''శాంతికి విఘాతం కలిగించేందుకు రష్యా అనేక ప్రయత్నాలు చేసింది. మాకు న్యాయమైన, శాశ్వతమైన శాంతి కావాలని ట్రంప్‌తో చెప్పాను. గతంలో రష్యా పదేపదే వ్యవహరించినట్లు కాకుండా తన శాంతికి ఎలాంటి విఘాతం కలుగుండా చేసేలా ఈ ఒప్పందం ఉండాలి. ఈ విషయంలో మిత్రదేశాలు గుడ్డిగా ఉండొద్దు. దీర్ఘకాలిక శాంతిని తీసుకొచ్చే ఒప్పందానికి మేము అంగీకరిస్తామని'' జెలెన్స్కీ అన్నారు. 

Also Read: CAPF, అస్సాం రైఫిల్స్‌లో 1,00,204 ఉద్యోగ ఖాళీలు..

మరోవైపు ఉక్రెయిన్‌లో వెంటనే కాల్పుల విరమణ అమల్లోకి తీసుకురావాలని ట్రంప్ పిలుపునిచ్చారు. ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్‌ మేక్రాన్‌తో పాటు ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీతో ఆయన భేటీ అయ్యారు. యుద్ధం వల్ల ఉక్రెయిన్, రష్యాలో వేలాది మంది సైనికులు ప్రాణాలు కోల్పోయారని, ఎన్నో కుటుంబాలు నాశనమయ్యాయని పేర్కొన్నారు. వెయ్యి రోజులకు పైగా కొనసాగుతున్న ఈ యుద్ధానికి ముగింపు పలకాలని సూచించారు. అలాగే శాంతి ఒప్పందం కోసం జెలెన్స్కీ ఆసక్తిగా ఉన్నారని స్పష్టం చేశారు.      

Also Read: ఈవీఎంలపై విపక్షాల అనుమానాలు.. స్పందించిన షిండే !

Also Read: ఆన్‌లైన్‌లో స్టిక్కర్లు అమ్మి నెలకు రూ.16 లక్షలు సంపాధిస్తున్న బాలుడు

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

నౌకాశ్రయంలో భారీ పేలుడు.. 400 మందికి పైగా?

ఇరాన్ నౌకాశ్రయంలో భారీ పేలుడు సంభవించింది. బందర్‌ అబ్బాస్‌ సమీపంలోని రజేయీ నౌకాశ్రయంలో పేలుడు సంభవించగా.. 400 మందికి పైగా గాయపడినట్లు తెలుస్తోంది. అయితే ఈ పేలుడు ఎలా సంభవించిందని విషయం ఇంకా తెలియాల్సి ఉంది.

New Update
Iran Harbor

Iran Harbor

ఇరాన్ నౌకాశ్రయంలో భారీ పేలుడు సంభవించిన ఘటన చోటుచేసుకుంది. బందర్‌ అబ్బాస్‌ సమీపంలో రజేయీ నౌకాశ్రయంలో భారీ పేలుడు సంభవించగా.. 400 మందికి పైగా గాయపడినట్లు తెలుస్తోంది. అయితే ఈ భారీ పేలుడు ఎలా సంభవించిందని విషయం ఇంకా తెలియాల్సి ఉంది.

ఇది కూడా చూడండి: Pahalgam Terror Attack : పహల్గాం దాడిపై ఉగ్రవాద సంస్థ సంచలన ప్రకటన.. టీఆర్‌ఎఫ్‌ యూ టర్న్

ఇది కూడా చూడండి: SLBC Tunnel: ఎస్‌ఎల్‌బీసీ టన్నెల్‌లో రెస్క్యూ ఆపరేషన్‌కు మూడు నెలలు బ్రేక్‌!

చమురు, పెట్రోకెమికల్స్ కారణంగా..

నౌకాశ్రయంలోని కంటెయినర్ల నుంచి పేలుడు సంభవించిందని భావిస్తున్నారు. ఇక్కడ ఎగుమతి, దిగుమతి కార్యకలాపాలు ఎక్కువగా జరుగుతుంటాయి. అయితే ఈ కంటైయినర్లలో చమురు, పెట్రోకెమికల్స్ ఉన్నాయి. వీటి కారణంగా పేలుడు సంభవించి ఉంటుందని భావిస్తున్నారు.

ఇది కూడా చూడండి: BIG BREAKING: దాడిపై దర్యాప్తు సిద్ధమని కాళ్ల బేరానికి పాకిస్తాన్.. మాకు నీళ్లు కావాలి!

ఇది కూడా చూడండి:Hyderabad: హైదరాబాద్‌లో పాకిస్తానీయులు.. పోలీసులు సంచలన నిర్ణయం

Advertisment
Advertisment
Advertisment