/rtv/media/media_files/2026/04/27/trump-2026-04-27-07-02-07.jpg)
Donald Trump: అమెరికా(America) అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పాల్గొన్న ఒక పెద్ద విందు వేడుకలో కాల్పులు జరిపిన వ్యక్తికి సంబంధించిన సంచలన విషయాలు బయటపడ్డాయి. కాలిఫోర్నియాకు చెందిన కోల్ అలెన్ అనే వ్యక్తి ఈ దారుణానికి ఒడిగట్టాడు. అయితే, కాల్పులు జరపడానికి సరిగ్గా పది నిమిషాల ముందే తన కుటుంబ సభ్యులకు ఒక సుదీర్ఘమైన లెటర్ పంపి తన ప్లాన్ మొత్తం వివరించాడు. నిందితుడు అలెన్ ఆ లెటర్‌లో తనను తాను ఒక ప్రొఫెషనల్ కిల్లర్ గా అభివర్ణించుకున్నాడు.
ట్రంప్ ప్రభుత్వంలోని పెద్ద పెద్ద అధికారులను చంపడమే తన లక్ష్యమని. వారు ఎంత పెద్ద పదవిలో ఉంటే వారికి అంత ముప్పు అని రాశాడు. అయితే ఎఫ్‌బీఐ డైరెక్టర్ కాష్ పటేల్‌ను మాత్రం వదిలేస్తానని చెప్పాడు. నేను ఇన్ని తుపాకులతో హోటల్‌లోకి దర్జాగా నడుచుకుంటూ వెళ్తున్నా ఎవరూ ఆపలేదు. ఇక్కడి సెక్యూరిటీ అంతా షో తప్ప ఏం లేదు. అందరూ బయట ఉన్న జనంపైనే నిఘా పెట్టారు కానీ, హోటల్‌లో రూమ్ తీసుకున్న నా గురించి పట్టించుకోలేదని ఎద్దేవా చేశాడు. లోకంలో అన్యాయం జరుగుతుంటే చూస్తూ ఊరుకోవడం కూడా నేరమే. అందుకే నేను శిక్షించడానికి వచ్చాను అంటూ తన పిచ్చి వాదనను వినిపించాడు.
Also Read: గ్యాంగ్‌స్టర్ గా బాలయ్య.. కొరటాల శివ ప్లాన్ మామూలుగా లేదుగా!
నిందితుడు పంపిన ఆ భయంకరమైన మెసేజ్ చూడగానే అతని సోదరుడు కంగారు పడిపోయి వెంటనే పోలీసులకు ఫోన్ చేసి విషయం చెప్పాడు. దీంతో అలర్ట్ అయిన పోలీసులు అతడిని పట్టుకున్నారు. నిందితుడి సోదరి కూడా.. అతనికి పిచ్చి పిచ్చి రాజకీయ ఆలోచనలు ఎక్కువ. ఏదో ఒకటి చేసి లోకాన్ని మారుస్తానని ఎప్పుడూ అనేవాడని పోలీసులకు తెలిపింది.
రికార్డులు చూస్తే మైండ్ బ్లాక్
కాల్పులు జరిపిన అలెన్ గురించి తెలుసుకుంటే ఎవరైనా ఆశ్చర్యపోవాల్సిందే. అతను ఏదో చదువురాని వాడో లేక మామూలు క్రిమినలో కాదు. అత్యంత తెలివైన వాడు, పైగా గొప్ప విద్యావంతుడు. అతని రికార్డులు చూస్తే మైండ్ బ్లాక్ అవుతుంది. ప్రపంచంలోనే పేరున్న కాల్‌టెక్ యూనివర్సిటీ నుండి 2017లో మెకానికల్ ఇంజినీరింగ్ పూర్తి చేశాడు. ఆ తర్వాత కంప్యూటర్ సైన్స్‌లో మాస్టర్స్ డిగ్రీ కూడా సాధించాడు. చదువుకునే రోజుల్లోనే వీల్‌ఛైర్ల కోసం ఒక స్పెషల్ ఎమర్జెన్సీ బ్రేక్ సిస్టమ్‌ను కనిపెట్టి అందరి దృష్టిని ఆకర్షించాడు.
Also Read: విభిన్న పాత్రలో దువ్వాడ మాధురి.. ‘చీన్ టపాక్ డుం డుం’లో సర్‌ప్రైజ్ రోల్!
అప్పట్లో లోకల్ పేపర్లలో అతని గురించి గొప్పగా వార్తలు కూడా వచ్చాయి. సాఫ్ట్‌వేర్ రంగంలో కూడా అతనికి మంచి పట్టు ఉంది. 2018లో ఒక వీడియో గేమ్‌ను తయారు చేసి దానికి గుర్తింపు తెచ్చుకున్నాడు. రీసెంట్‌గా మరో గేమ్‌ను కూడా రెడీ చేస్తున్నాడు. ప్రస్తుతం అతను 'సీ2 ఎడ్యుకేషన్' అనే చోట టీచర్‌గా పని చేస్తున్నాడు. ఎంత బాగా పాఠాలు చెప్పేవాడంటే.. మొన్నటి డిసెంబర్ (2024)లోనే అతడిని టీచర్ ఆఫ్ ది మంత్ గా ఆ సంస్థ గౌరవించింది.ఇంత తెలివైన వాడు, పది మందికి పాఠాలు చెప్పే టీచర్.. ఇలాంటి ఘోరానికి ఎలా ఒడిగట్టాడనేది ఇప్పుడు అందరినీ వేధిస్తున్న ప్రశ్న.
Follow Us